Begin typing your search above and press return to search.

ప్రపంచ అతిపెద్ద చమురు వినియోగదారుగా భారత్.. స్పెన్సర్ డేల్ ఆసక్తికర వ్యాఖ్య

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే ఠక్కున భారత్ అని చెప్పాల్సిందే.

By:  Tupaki Political Desk   |   8 Oct 2025 3:32 PM IST
ప్రపంచ అతిపెద్ద చమురు వినియోగదారుగా భారత్.. స్పెన్సర్ డేల్ ఆసక్తికర వ్యాఖ్య
X

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే ఠక్కున భారత్ అని చెప్పాల్సిందే. భారత్ జనాభా ప్రపంచ వాణిజ్య రంగాన్ని శాసిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రపంచం నేడు ఇండియా వైపు చూస్తుంది. కావలసినంత కార్మిక శక్తి, కావలసినంత ఇంధన వనరులు, మంచి భూమి ఇలాంటివి భారతదేశంలో కొదువలేదు. ఇంధన వినియోగంలోనూ భారత్ ప్రపంచంతో పోలిస్తే అగ్రభాగానే ఉంది. ఇండియా ప్రస్తుతం ప్రపంచ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా నిలిచినా, భవిష్యత్తులో ఇది మరింత ఎదుగుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రిటన్ ఎకనామిస్ట్ స్పెన్సర్ డేల్ చేసిన అధ్యయనం ప్రకారం.. 2050 నాటికి చమురు వినియోగంలో అతిపెద్ద దేశం కావడం ఖాయం. ప్రపంచ ఇంధన వినియోగాన్ని పోలిస్తే భారతదేశం 12 శాతం ఎక్కువ చమురు వినియోగించే అవకాశం ఉన్నట్లు సూచిస్తున్నారు.

పెరుగుతున్న వినియోగమే కారణం..

ఆర్థిక అభివృద్ధి, వృద్ధి వేగం, దేశీయంగా పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య కారణంగా 2050లో ఈ రికార్డు సాధించగలదు. భారతదేశం తక్కువ ధరలో చమురు, నేచురల్ గ్యాస్ వంటి ముడి పదార్థాలను వినియోగించుకునేందుకు ప్రపంచ మార్కెట్లపై ఆధారపడుతుంది. పెరుగుతున్న డిమాండ్ భారతీయ కంపెనీలకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం కలిగిస్తుంది. దేశీయ ఇంధన సరఫరాను పెంచడంలో రిఫైనరీలు, నిల్వలు, సరళమైన సరఫరా సైకిల్ మరింత కీలకంగా మారుతుంది.

నేచురల్ గ్యాస్ లో కూడా గణనీయమైన పెరుగుదల..

కేవలం చమురు మాత్రమే కాదు.. నేచురల్ గ్యాస్ వినియోగంలో కూడా దేశం గణనీయమైన పెరుగుదలను చూపిస్తోంది. పారిశ్రామిక రంగం, విద్యుత్ ఉత్పత్తి, రియాక్టర్ ఉపయోగాలు గ్యాస్ డిమాండ్‌ను రోజుకు రోజు పెంచుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ మార్గంలో అడుగులు వేస్తూ కూడా.. తక్కువ కాలుష్య ఇంధనాల కోసం దేశం నేచురల్ గ్యాస్‌ను ఆధారంగా చేసుకోవడం అనివార్యం.

ఇప్పటికి భారత్ చమురు దిగుమతిలో మూడో స్థానం..

ఇప్పటి వరకు భారత్ చమురు దిగుమతిలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ, 2050కి ఈ లెక్క మారుతుంది. ఇది నిజమైతే, ప్రపంచ చమురు మార్కెట్, ధరలు, భౌగోళిక రాజకీయాలపై దేశం అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు దేశీయ ఉత్పత్తిని పెంచడం, ఎనర్జీ భద్రతపై దృష్టి సారించడం ముఖ్యమనే చెప్పాలి.

భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవాలి..

భవిష్యత్తులో ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి, వ్యూహాత్మక విధానాలు అవసరం. విద్యుత్, స్వయంశక్తి, ఇతర ఇంధనాలపై పెట్టుబడులు, జాతీయ ఇంధన పాలసీలు మరింత కట్టుదిట్టంగా ఉండాలి. దేశ ఆర్థిక వ్యవస్థను నమ్మకంతో ముందుకు తీసుకెళ్లడం.. ప్రపంచ ఇంధన రంగంలో కేంద్ర భాగం కలిగి ఉందడం ఇవే భారత్ ఎదుర్కొనే ప్రధాన అవకాశాలు. మొత్తంగా, 2050లో భారత్ అత్యధిక చమురు వినియోగదారుగా మారటం కేవలం గణాంకం కాదు.. ఇది ఆర్థిక, పారిశ్రామిక, రాజకీయ పరంగా ఓ మైలురాయి. ప్రభుత్వ, పరిశ్రమ, వినియోగదారుల చర్యలపై దీని ప్రభావం కీలకంగా మారుతుంది.