బిగ్ డౌట్: 'మోడీ' మరిచారా.. జనం మరిచిపోయారని అనుకున్నారా?
ప్రధాన మంత్రినరేంద్ర మోడీ మంగళవారం ఉదయం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి 2 నిమిషాల 56 సెకన్ల నిడివితో కూడిన ఓ సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమం ఇన్‌స్టాలో పోస్టు చేశారు.
By: Garuda Media | 1 Sept 2026 10:48 PM ISTప్రధాన మంత్రినరేంద్ర మోడీ మంగళవారం ఉదయం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి 2 నిమిషాల 56 సెకన్ల నిడివితో కూడిన ఓ సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమం ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దాదాపు నెల తర్వాత.. ఆయన మరోసారి సామాజిక మాధ్యమంలో ఇలా సెల్ఫీ వీడియో పోస్టు చేయడం గమనార్హం. ఇక, ఆయన ప్రస్తావించిన విషయం.. జీడీపీ వృద్ధి!. తాజాగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఏప్రిల్-జూన్ మధ్య మూడు మాసాల్లో దేశ ఆర్థిక వృద్ధి 7.8 శాతానికి పెరిగిందని.. ఇది ప్రజల సమష్టి కృషి అని.. దీనిని కొనసాగించాలని.. ఆయన సూచించారు.
అయితే.. మోడీ ప్రస్తావించిన ఈ విషయం వెనుక దాగిన అనేక విషయాలు ఉన్నాయనేది ఆయన మరిచి పోయారా? లేక జనాలు మరిచిపోయారని అనుకున్నారా? అనేది బిగ్ డౌట్. ఎందుకంటే.. జీడీపీ వృద్ధి అంటే.. ప్రభుత్వాలకు వచ్చిన ఆదాయాన్ని పేర్కొనడమే!. గత ఏడాది ఇంత ఆదాయం వచ్చింది..ఈ ఏడాది ఇంత ఆదాయం వచ్చింది.. అనే విషయాన్ని వృద్ధి రూపంలో ఆర్థిక శాఖ చెబుతుంది. దీనినే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ .. జీడీపీ అంటారు. కానీ, ఇది పెరగడం వెనుక.. ఉన్న రీజన్లను గమనిస్తే.. ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా ప్రభుత్వాలు అనుత్పాదక రంగాలు!.
అంటే.. ప్రభుత్వాలు తమంతట తాము ఆదాయాన్ని వృద్ధి చేయవు. ప్రజలు కట్టే పన్నులు, కొనుగోలు ద్వారా ఆయా వస్తువులపై వచ్చే సెస్సులు, ట్యాక్సుల ద్వారా మాత్రమే ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు మోడీ చెబుతున్న వృద్ధి కూడా అదే బాపతు. అంటే.. ప్రజలు కొనుగోలు చేసిన వస్తువుల ద్వారా వాటిపై వచ్చిన సెస్సులు, పన్నులు, విలువ ఆధారిత పన్నులు ఇలా.. ఎన్నయినా కావొచ్చు.. వాటి నుంచి వచ్చిన ఆదాయమే. కానీ, నాణేనికిమరో కోణం ఏంటంటే.. ఇలా వృద్ధి పెంపొందడానికి హేతువు.. ప్రజలు ఖర్చు చేసే సొమ్ములు.. తద్వారా.. వారిపై పడుతున్న భారాలు.
ప్రస్తుతం గత రెండు మూడు మాసాల నుంచి దేశవ్యాప్తంగా అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్‌పై పశ్చిమాసియా యుద్ధాన్ని చూపి వేసిన భారం ఇప్పటికీకొనసాగుతోంది. తద్వారా.. దీనికి లింక్‌గా ఉన్న అన్ని మార్కెట్లు కూడా ధరల భారాలను అమాం తం పెంచేశాయి. అంటే.. సామాన్యులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదన్న కమ్యూనిస్టుల నినాదాన్ని పాడుకుంటున్నా రు. ఇక, ఈ విషయాన్నికాంగ్రెస్ పక్షాలు ప్రశ్నించాయి. వృద్ధి పాట పాడుతున్న ప్రధాన మంత్రి.. ధరలగురించి కూడా చెబితే బాగుండేదన్న వాదనా వినిపిస్తోంది. ప్రస్తుతం అన్ని ధరలు ఆకాశాన్నంటగా.. అంతిమంగా వాటిపై వస్తున్న పన్నుల ఆదాయం వృద్ధి రూపంలో ఖజానాకు చేరుతోందన్నది విపక్షాలు, ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. సో.. ఇదీ.. అసలు విషయం.
