Begin typing your search above and press return to search.

ప్రపంచం ముందు మరోసారి పాక్ పరువు పాయె... షాకిచ్చిన భారత్!

ఈ క్రమంలో మరోసారి ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ టాపిక్ ఎత్తిన పాక్ కు భారత్ గట్టిగా బుద్ది చెబుతూ.. ఆ దేశ సైన్యం రాక్షసత్వాన్ని మరోసారి గుర్తుచేసింది.

By:  Raja Ch   |   10 Oct 2025 11:00 PM IST
ప్రపంచం ముందు మరోసారి పాక్  పరువు పాయె... షాకిచ్చిన భారత్!
X

ఐక్యరాజ్యసమితిలో పదే పదే కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం.. అనంతరం భారత్ చేతిలో ఘోర పరాభవానికి గురవ్వడం.. ఫైనల్ గా ప్రపంచ దేశాల ముందు పరువు తీసుకోవడం పాకిస్థాన్ కు అలవాటుగా మారినట్లుంది. ఈ క్రమంలో మరోసారి ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ టాపిక్ ఎత్తిన పాక్ కు భారత్ గట్టిగా బుద్ది చెబుతూ.. ఆ దేశ సైన్యం రాక్షసత్వాన్ని మరోసారి గుర్తుచేసింది.

అవును... ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ లో ఆ దేశ ఆర్మీ సైతం వారి కంటే డేంజర్ అనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్ ఆర్మీ ఎంత భయంకరమైనదో చెబుతూ 1971 నాటి సంఘటనను ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ మరోసారి గుర్తు చేసింది. దీంతో... పాకిస్థాన్ కు గట్టిగా బుద్ది చెప్పినట్లయ్యింది.

వివరాళ్లోకి వెళ్తే... 'మహిళలు, శాంతి, భద్రత' అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన చర్చలో ఐక్యరాజ్యసమితిలో పాక్ శాశ్వత మిషన్‌ లో కౌన్సిలర్‌ గా ఉన్న సైమా సలీమ్ మాట్లాడుతూ... కాశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసను అనుభవిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో... ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.

1971లో 'ఆపరేషన్ సెర్చ్‌ లైట్' పేరుతో పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్‌ లో (ప్రస్తుత బంగ్లాదేశ్) 4 లక్షల మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు చేసిందని భారత్ గుర్తు చేసింది. 1971 మార్చి 25న బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పెరుగుతున్న డిమాండ్‌ లను అణిచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం ఈ దుర్మార్గానికి పూనుకుందని హరీష్ పర్వతనేని వెల్లడించారు.

ఇదే క్రమంలో... నాడు పాకిస్థాన్ సైన్యం చేసిన క్రూరమైన చర్యల వల్ల యుద్ధ సమయంలోనే లక్షలాది మంది మహిళలు గర్భవతులు అయ్యారని.. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడగా.. చాలామంది అబార్షన్స్ చేయించుకున్నారని తేలిందని.. 1971 డిసెంబర్ లో భారత్ ఆర్మీకి పాకిస్థాన్ ఆర్మీ సరెండర్ అయినతర్వాతే ఈ దారుణాలు ఆగాయని భారత్ స్పష్టం చేసింది.

ఇదే సమయంలో... ఏటా భారత్‌ పై, ప్రధానంగా వారు ఆశపడే భారత భూభాగమైన జమ్మూకాశ్మీర్‌ పై పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను దురదృష్టవశాత్తు తాము వినాల్సి వస్తోందని చెప్పిన హరీష్... మహిళలు, శాంతి, భద్రత అజెండాలో భారత్ అద్భుతమైన రికార్డు కలిగి ఉందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌ పై వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలని హితవు పలికారు.

దీంతో... ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. పాక్ సైన్యం ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులకంటే ప్రమాదమా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది!