Begin typing your search above and press return to search.

దేశ ఎగుమతుల్లో గుజరాత్ టాప్.. తెలుగు రాష్ట్రాల సంగతి?

ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలేంటి? ఏయే ఉత్పత్తుల ఎగుమతుల్లో వారు ఉన్నారు? అన్న విషయాల్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

By:  Garuda Media   |   6 Aug 2025 11:00 AM IST
దేశ ఎగుమతుల్లో గుజరాత్ టాప్.. తెలుగు రాష్ట్రాల సంగతి?
X

ఆసక్తికర అంశం ఒకటి వెల్లడైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్ని కలుపుకొని.. ఎగుమతుల్లో టాప్ ఎవరన్న విషయాన్ని.. ఎందుకు? అన్న విషయాన్ని తాజాగా వెల్లడించింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్టు ఆర్గనైజేషన్. పొట్టిగా చెప్పాలంటే ఫియో. తాజాగా దేశీయంగా ఎగుమతులు ఎంత? ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలేంటి? ఏయే ఉత్పత్తుల ఎగుమతుల్లో వారు ఉన్నారు? అన్న విషయాల్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

గత ఏడాది మన దేశం నుంచి జరిగిన ఎగుమతుల విలువ రూ.37.02 లక్షల కోట్లుగా తేల్చారు. అందులో రూ.9.83 లక్షల కోట్లు గుజరాత్ నుంచే కావటం గమనార్హం. దేశం మొత్తం ఎగుమతుల్లో గుజరాత్ వాటా 30 శాతం వరకు ఉంది. గుజరాత్ లోని జామ్ నగర్ నుంచి ఎగుమతి అయ్యే పెట్రోలియం.. రిఫైనరీ ఉత్పత్తులు గుజరాత్ ను అగ్రస్థానంలో ఉండేలా చేస్తున్నాయని చెప్పాలి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర.. తమిళనాడు..కర్ణాటక..ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

ఇంజనీరింగ్ వస్తువులు.. పెట్రోలియం వస్తువుల ఎగుమతుల్లో ఈ రాష్ట్రాలు ముందున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. జాబితాలో ఆరేడు స్థానాల్లో నిలిచాయి. రెండు తెలుగురాష్ట్రాల ఎగుమతుల్లో ఎక్కువ భాగం అమెరికాకే ఉండటం గమనార్హం. ఎగుమతుల్లో తెలంగాణ కంటే ఏపీ ముందు ఉంది. దీనికి కారణం మత్స్య ఉత్ప్తతులు.. ఔషధ ఫార్ములేషన్లు.. బయో లాజిక్స్ ఉన్నాయి

తెలంగాణ విషయానికి వస్తే.. ఎయిర్ క్రాఫ్ట్స్.. స్పేస్ క్రాఫ్ట్ ల విడిభాగాలు.. ఔషధ ఫార్ములేషన్లు.. బయోలాజిక్స్ ఉన్నాయి. ఏపీ ఎగుమతుల్లో 24.40 శాతం.. తెలంగాణలో 23.60 శాతం అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. రసాయన ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. సేంద్రీయ.. అర్బన రసాయనాలు..చర్మశుద్ధి.. రంగులు.. వ్యవసాయ రసాయనాలు.. ప్లాస్టిక్. సింథటిక్ రబ్బర్.. ఫైబర్ ను భారత్ ఎక్కువగా ఎగుమతి చేస్తోంది. మొత్తం ఎగుమతుల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 26.67 శాతం ఉండగా.. తర్వాతి స్థానంలో పెట్రోలియం ఉత్పత్తులు 14.48 శాతం.. ఎలక్ట్రానిక్ వస్తువులు 8.82 శాతం.. డ్రగ్స్ అండ్ ఫార్మా 6.82 శాతం.. వజ్రాలు.. ఆభరణాలు 6.56 శాతంగా ఉన్నాయి.