Begin typing your search above and press return to search.

అమెరికా ఆయుధ కొనుగోళ్లపై బంద్.. భారత్ క్లారిటీ ఇదే

రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, భారత్ -అమెరికా మధ్య రక్షణ సంబంధాలు చాలా బలంగా, స్థిరంగా ఉన్నాయి.

By:  A.N.Kumar   |   8 Aug 2025 8:02 PM IST
అమెరికా ఆయుధ కొనుగోళ్లపై బంద్.. భారత్ క్లారిటీ ఇదే
X

అమెరికా నుంచి ఆయుధాలు , యుద్ధ విమానాల కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఇటీవల రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించిన ఒక కథనాన్ని ఖండిస్తూ, రక్షణ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆ కథనంలో, అమెరికా విధించిన సుంకాలపై నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు, దీనిలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్లు పేర్కొనడం జరిగింది. అయితే ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని, ఇటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని రక్షణ శాఖ గట్టిగా చెప్పింది.

-రక్షణ సంబంధాలు యధావిధిగా కొనసాగుతాయి

రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, భారత్ -అమెరికా మధ్య రక్షణ సంబంధాలు చాలా బలంగా, స్థిరంగా ఉన్నాయి. యుద్ధ విమానాలు, ఆయుధాల కొనుగోళ్లపై ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రణాళికల ప్రకారం, అన్ని ఒప్పందాలు.. కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయి.

రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన రద్దు అయిందన్న వార్త కూడా అవాస్తవమని, రెండు దేశాల మధ్య జరగాల్సిన సమావేశాలు, కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని రక్షణ శాఖ తెలిపింది.

-వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టం

రక్షణ శాఖ ఈ పుకార్లకు ముగింపు పలకడం ద్వారా భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం తదుపరి దశకు చేరుకోవడానికి ఈ క్లారిటీ దోహదపడుతుందని వారు చెబుతున్నారు. ఈ పుకార్ల వల్ల ఏర్పడిన గందరగోళం తొలగిపోవడంతో, భవిష్యత్లో జరిగే చర్చలు, ఒప్పందాలకు మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో, రెండు దేశాల మధ్య రక్షణ వాణిజ్యం మరియు సాంకేతిక సహకారం మరింత వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నారు.

2021లో భారత నౌకాదళం కోసం 6 బోయింగ్ P-8I జెట్‌లను కొనుగోలు చేయడానికి అమెరికాతో $2.42 బిలియన్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ జెట్‌లు సముద్ర గస్తీ, నిఘా , శత్రు జలాంతర్గాములను గుర్తించడంలో చాలా కీలకమైనవి. అయితే ఒప్పందం కుదిరిన తర్వాత, అమెరికా ప్రభుత్వం విధించిన కొత్త దిగుమతి సుంకాల (టారిఫ్‌లు) కారణంగా ఈ జెట్‌ల ధర 50% పెరిగింది. ఈ జెట్‌లకు అవసరమైన కొన్ని ముడి పదార్థాలు భారత్ నుంచే సరఫరా అవుతున్నప్పటికీ, అమెరికా విధించిన టారిఫ్‌లు మొత్తం ఒప్పంద విలువను $3.6 బిలియన్లకు చేర్చాయి. అమెరికా యొక్క ఏకపక్ష టారిఫ్ విధానాలకు వ్యతిరేకంగా భారత్ నిర్ణయం తీసుకోకుండా ప్రస్తుతానికి అమెరికా ఆయుధాల కొనుగోలుపై రెడీగా నే ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రతీకారం ఉండదని పేర్కొంది.