Begin typing your search above and press return to search.

రక్షణ రంగంలో భారత్ ను చూసి ప్రపంచం ఆశ్చర్యం పోవాల్సిందే..

యుద్ధాలు ఇప్పుడు గన్స్‌తో కాకుండా గిగాబైట్లు, డ్రోన్లు, కృత్రిమ మేధస్సుతో సాగుతుంది. ఈ కొత్త యుగానికి భారత్ సిద్ధం అవుతోంది.

By:  Tupaki Political Desk   |   13 Oct 2025 9:30 PM IST
రక్షణ రంగంలో భారత్ ను చూసి ప్రపంచం ఆశ్చర్యం పోవాల్సిందే..
X

ఏటికి ఏడు భారత రక్షణ రంగం భారీగా రూపాంతరం చెందుతోంది. డిఫెన్స్ రంగానికి సంబంధించి పరికరాలను కొనుగోలు చేయడంతో పాటు సొంతంగా తయారు చేసుకుంటుంది. ప్రపంచంలో ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడమే కాకుండా ఉత్పత్తి సైతం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని అక్కడి శాస్త్రవేత్తలను కోరుతుంది. దీంతో భారత్ పాస్టెస్ట్ గ్రోవింగ్ దేశమే కాకుండా.. ఫాస్టెస్ట్ డిఫెన్స్ ఎక్విప్ మెంట్ సప్లయ్ దేశంగా కూడా నిలుస్తుంది.

యుద్ధాలు ఇప్పుడు గన్స్‌తో కాకుండా గిగాబైట్లు, డ్రోన్లు, కృత్రిమ మేధస్సుతో సాగుతుంది. ఈ కొత్త యుగానికి భారత్ సిద్ధం అవుతోంది. వచ్చే 15 ఏళ్లలో భారత సాయుధ దళాలు ప్రపంచంలో అత్యాధునికంగా రూపాంతరం చెందనున్నాయి. ఈ ప్రణాళిక భారత రక్షణ రంగ చరిత్రలో అత్యంత విస్తృత ఆధునీకరణ పుష్‌గా పరిగణించబడుతోంది.

యుద్ధాల భవిష్యత్తు రూపకల్పన

ఇమేజ్‌లో పేర్కొన్నట్లుగా భారత్‌ సైనిక సామర్థ్యాన్ని సమగ్రంగా పునర్నిర్మించనుంది:

*50,000 యాంటీ-ట్యాంక్‌ క్షిపణులు

*1,800 భవిష్యత్తు ట్యాంకులు

*700+ రోబోటిక్ కౌంటర్-IED వ్యవస్థలు

*400 లైట్‌ ట్యాంకులు

*150 స్టెల్త్‌ డ్రోన్లు

*100 రిమోట్‌ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ (RPAs)

*75 ప్సూడో శాటిలైట్స్‌

*10 ఫ్రిగేట్స్‌, 7 కార్వెట్లు, 4 ల్యాండింగ్ డాక్ ప్లాట్‌ఫారమ్స్‌,

తోపాటు వందలాది ప్రెసిషన్‌-గైడెడ్ వెపన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు కావు.. ఇవి భారత సైనిక దౌత్యం, సాంకేతికత, వ్యూహాత్మక స్వావలంబన (strategic autonomy) మధ్య బలమైన అనుసంధానాన్ని సూచిస్తున్నాయి.

మేక్ ఇన్ ఇండియాతో స్వీయ తయారీ..

ఇది కేవలం ఆయుధాల కొనుగోలు ప్రణాళిక కాదు.. ఇది ‘మేక్ ఇన్ ఇండియా, డిఫెండ్ ఫర్ ఇండియా’ అనే సిద్ధాంతానికి నిదర్శనం. దేశం ఇప్పుడు రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే దేశం నుంచి, వాటిని తయారు చేసేదిగా.. ఎగుమతి సైతం చేసే దేశంగా ఎదిగింది. హైదరాబాద్‌, బెంగళూరు, నాగ్‌పూర్‌, పూణె వంటి నగరాల్లో కొత్త డిఫెన్స్ పార్కులు, డ్రోన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి.

ఈ విధానం ద్వారా రక్షణ రంగం దేశీయ పరిశ్రమలకు కొత్త ప్రాణం పోస్తోంది. సైన్యం ఆధునీకరణతో పాటు ఉద్యోగావకాశాలు, ఆర్థిక వృద్ధి, సాంకేతిక పరిశోధనకు విస్తృత అవకాశాలు కలుగుతున్నాయి.

కొత్త యుద్ధ రంగం

భవిష్యత్తు యుద్ధాలు మానవ శరీరంతో కాకుండా సెన్సార్లు, శాటిలైట్లు, డ్రోన్లు, రోబోట్స్, ఏఐతో సాగుతుంది. భారత్‌ ఇప్పుడు ఆ దిశగా ముందడుగు వేస్తోంది. 150 స్టెల్త్‌ డ్రోన్లు, 100 RPAs, 75 ప్సూడో శాటిలైట్లు ఈ మూడు వ్యవస్థలు కలిపి ‘విజువల్ డామినెన్స్‌’కు బలం ఇస్తాయి. అంటే శత్రువుల దాడి మన భూమిపై కదలిక జరగకముందే ఆకాశం దాన్ని గుర్తిస్తుంది.

రోబోటిక్ IED కౌంటర్‌ సిస్టమ్స్‌ యుద్ధభూమిలో సైనికులను చాలా రక్షణను ఇస్తాయి. యాంటీ ట్యాంక్ మిసైల్స్‌ భూమి దళాలకు భయంకర బలం ఇస్తాయి. లైట్ ట్యాంక్స్‌ హిమాలయ సరిహద్దుల్లో తేలికపాటి కదలికల కోసం ప్రత్యేకంగా రూపొందించబడతాయి.

సముద్రం నుంచి అంతరిక్షం వరకు

నేవీ భాగంలో 10 ఫ్రిగేట్లు, 7 కార్వెట్లు, 4 ల్యాండింగ్ ప్లాట్‌ఫారమ్స్‌ చేర్చడం ద్వారా భారత సముద్ర రక్షణ మరింత బలపడనుంది.

ప్రస్తుతం ఇండియన్ నేవీ హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం నిలుపుకుంటున్నా, కొత్త దశలో ‘బ్లూ వాటర్ నేవీ’ అభివృద్ధి చెందుతుంది. అంటే సముద్ర సరిహద్దులు దాటి దూర ప్రాంతాల్లో సైనిక ఉనికి కనుగొంటుంది.

75 ప్సూడో శాటిలైట్లు భారత అంతరిక్ష నిఘా వ్యవస్థలో విప్లవం తీసుకువస్తాయి. ఇది చైనాకు, పాకిస్థాన్‌కి మాత్రమే కాదు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కూడా భారత్‌ వ్యూహాత్మక ఆధిపత్యం పెంచుతుంది.

యుద్ధానికి కాదు, శాంతికి బలం

ఈ ఆధునీకరణను కొందరు ‘ఆర్మ్స్‌ రేస్‌’గా చూడవచ్చు. కానీ నిజానికి ఇది శాంతికి బలమైన హామీ. భారత్‌ ఎప్పుడూ శాంతి కాముక దేశమే. రక్షణాత్మక దృష్టితోనే సైనిక శక్తిని పెంచుకుంటుంది. సాంకేతిక శక్తి ఉన్నప్పుడు దాడి అవసరం ఉండదు. ఎందుకంటే శత్రువు కూడా 2సార్లు ఆలోచిస్తాడు.

ఈ ఆధునీకరణతో భారతదేశం కేవలం తన భూభాగాన్ని కాపాడడం మాత్రమే కాదు.. ప్రపంచంలో సమతుల్యత, స్థిరత్వం, స్వతంత్ర నిర్ణయంకు ఒక అక్షంగా నిలవబోతోంది.

రాబోయే 15 ఏళ్లలో భారత సైన్యం మానవ ధైర్యం, సాంకేతిక మేధస్సు, వ్యూహాత్మక దృష్టి ఈ మూడు సమ్మేళనం అవుతాయి. ఇది కేవలం రక్షణ ప్రణాళిక కాదు ఇది భారత భవిష్యత్తు స్వరూపం. ‘భారత సైన్యం ప్రపంచ శాంతికి బలమైన కంచె’ అని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు.