Begin typing your search above and press return to search.

మిలియన్ టన్నుల బంగారం.. కానీ తవ్వకానికి నోచుకోని గనులు.. ఎక్కడున్నాయంటే?

బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎక్కడైనా నిక్షేపాలు ఉన్నాయా అనే కోణంలో నిపుణులు కూడా తెగ వెతికే ప్రయత్నం చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   29 Oct 2025 1:15 PM IST
మిలియన్ టన్నుల బంగారం.. కానీ తవ్వకానికి నోచుకోని గనులు.. ఎక్కడున్నాయంటే?
X

బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎక్కడైనా నిక్షేపాలు ఉన్నాయా అనే కోణంలో నిపుణులు కూడా తెగ వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరు ఊహించలేని విషయాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు భూగర్భంలో మిలియన్ టన్నుల కొద్దీ బంగారం నిలువలు ఉన్నాయని, వాటి విలువ సుమారుగా లక్షల కోట్లు ఉంటుంది అని, తమ అభిప్రాయంగా వ్యక్తం చేశారు. మొత్తానికైతే మిలియన్ టన్నుల బంగారం ఉంది కానీ తవ్వకానికి మాత్రం నోచుకోక భూగర్భంలోనే ఈ బంగారం నిలువలు నిక్షిప్తమై ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే ఈ బంగారు విలువలు ఏ దేశంలో అధికంగా ఉన్నాయి ? ఎక్కడ ఉన్నాయి.. ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారు నిల్వలు విషయంలో మనం ఇంకా వెనుకబడి ఉన్నాం.. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఒక అద్భుతమైన అవకాశం భారతదేశానికి జాక్పాట్ లాంటిది. కనివిని ఎరుగని రీతిలో ఈ బంగారు నిల్వలు బయటపడబోతున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా భూమిలో దాదాపు 2,44,000 మెట్రిక్ టన్నుల బంగారం ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు 1,87,000 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే బయటపడింది. అంటే ఇంకా 57, 000 మెట్రిక్ టన్నుల విలువైన పసిడి భూగర్భంలోనే నిక్షిప్తమై ఉంది. ఇది గనుక బయటపడితే ప్రపంచ దేశాలతో పాటు భారతదేశానికి కూడా అదృష్టం పట్టబోతోంది అని చెప్పవచ్చు..

ఇకపోతే ప్రపంచంలోనే అత్యధికంగా ఇంకా తవ్వకానికి నోచుకోని బంగారు నిల్వలు ఉన్న దేశాల జాబితాలో అగ్రస్థానం సంపాదించుకున్న దేశాలు ఏవేవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియా..

ఇంకా తవ్వకానికి నోచుకోని బంగారు నిలువలు ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాలలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ భూగర్భంలో దాదాపు 12 వేల మెట్రిక్ టన్నుల బంగారం ఉందని.. దీని ప్రస్తుత విలువ సుమారుగా 720 బిలియన్ డాలర్లు అని సమాచారం. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 60 లక్షల కోట్లు. ఆ తర్వాత దేశం రష్యా . ఇక్కడ కూడా ఆస్ట్రేలియాకు సమానంగా దాదాపు 12 వేల మెట్రిక్ టన్నుల భారీ బంగారు నిల్వలు భూగర్భంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇండోనేషియా.. ఈ దేశంలో కూడా సుమారుగా 3,600 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అలా భూగర్భంలో భారీ నిల్వలు ఉన్న ఈ మూడు దేశాలు కూడా భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా మారనున్నాయి. పైగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటాయని సమాచారం. అయితే ఈ విషయం ఇటు భారత్ కి మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారు నిల్వలు పుష్కలంగా ఉన్న ఆస్ట్రేలియా, రష్యా, ఇండోనేషియా దేశాలు భారతదేశానికి మిత్ర దేశాలు. ఈ దేశాల నుండి తక్కువ ధరలకు లేదా రాయితీ పన్ను రేట్లతో బంగారాన్ని దిగుమతి చేసుకొనే అవకాశం కూడా ఉంది.

ముఖ్యంగా ఇది దేశీయంగా బంగారు ధరల స్థిరత్వానికి, సరఫరాకు, భారత ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయం సంతోషించదగిన విషయం అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ బంగారు గనులు తవ్వకానికి నోచుకొని.. ఈ బంగారం బయటపడితే మాత్రం భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం ఖాయం అని కూడా తెలుస్తోంది.