Begin typing your search above and press return to search.

భారత్ లోకి రోహింగ్యాలు ఎలా ప్రవేశిస్తున్నారు...బీజేపీ ఎంపీ విశ్లేషణ !

ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్య అంతర్జాతీయ సరిహద్దుకు ఫెన్సింగ్ లేదని కొండా విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేశారు

By:  Satya P   |   17 Oct 2026 7:00 PM IST
భారత్ లోకి రోహింగ్యాలు ఎలా ప్రవేశిస్తున్నారు...బీజేపీ ఎంపీ విశ్లేషణ !
X

రోహింగ్యాలు భారత్ లోకి ఎలా ప్రవేశిస్తున్నారు, వారికి భారత్ లో ఓటు హక్కు, ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు ఎందుకు లభిస్తున్నాయి, ఢిల్లీ ఉద్యమాలకు మద్దతు ఇస్తున్న పొరుగు దేశానికి ఓటు బ్యాంక్ కి మధ్య అతి పెద్ద లింక్ ఏమిటి అంటే మ్యాటర్ చాలానే ఉందని అంటున్నారు బీజేపీకి చెందిన చేవేళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన బంగ్లా దేశ్ నుంచి రోహింగ్యాలు ఎలా భారత్ లోకి సులువుగా ప్రవేశిస్తున్నారో ఒక వీడియో చేసి మరీ జనాలకు చక్కగా వివరించి విశ్లేషించారు.ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ కి భారత్ కి మధ్య అంతర్జాతీయ సరిహద్దుకు ఫెన్సింగ్ లేదని కొండా విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేశారు

ఫెన్సింగ్ లేని దేశ సరిహద్దు :

దీని వల్లనే చాలా సులువుగా రోహింగ్యాలు భారత్ లోకి ప్రవేశిస్తున్నారు అని ఆయన చెప్పారు. ఇక ఈ సరిహద్దులు కూడా గందరగోళంగా ఉన్నాయని ఆయన అన్నారు గతంలో చూస్తే కనుక ఇండియా కొంత భాగం బంగ్లాదేశ్ లో అలాగే ఇండియాలో కొంత భాగం బంగ్లాదేశ్ లో ఉందని అన్నారు. అంతే కాకుండా ఒకటి రెండు కాకుండా బంగ్లాదేశ్ లో ఇండియా ఎంక్లేవ్స్ 111 ఉన్నాయని చెప్పారు. అలాగే ఇండియాలో బంగ్లాదేశ్ ఎంక్లేవ్స్ 51 దాకా ఉన్నాయని వివరించారు. సెకండ్ ఆర్డర్ ఎంక్లేవ్ అని, థర్డ్ ఆర్డర్ ఎంక్లేవ్ అని బంగ్లాదేశ్ లో ఉన్నాయని ఇది ఆశ్చర్యకరమని అన్నారు. . పిచ్చి పిచ్చి విభజనగా ఇండియాలో బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ లో ఇండియా ఉంది. ఇలా చూసుకుంటే పోతే ఇలాంటి పిచ్చితనం కానీ ఈ తరహా బోర్డర్ కానీ ప్రపంచంలో ఎక్కడా ఉండదని బీజేపీ ఎంపీ అంటున్నారు. దీంతో బోర్డర్ అన్నది లేకుండా యధేచ్చగా ఎవరిష్టం వచ్చినట్లుగా వారు వస్తూ పోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇది సరైనదా అని ఆయన ప్రశ్నించారు

అసలేమిటి ఇదంతా :

ఇలా ఉంటే ప్రజలకు పాలన ఎలా జరుగుతుంది, సౌకర్యాలు ఎలా అందుతాయని ఆయన ప్రశ్నించారు. దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ 2015లో మోడీ అధికారం చేపట్టాక ఇండియా బంగ్లాదేశ్ ల్యాండ్ బోర్డర్ అగ్రిమెంట్ అయింది, వందవ రాజ్యాంగ సవరణ కూడా అయింది అని ఆయన చెప్పారు. దీంతో అంతర్జాతీయ బోర్డర్ స్పష్టంగా విభజించబడింది అని ఆయన చెప్పారు. అయితే ఈ చట్టం మాత్రం ఇప్పటిదాకా అమలు కాలేదు, దానికి కారణం పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల వీలు కాలేదని అన్నారు. ఇపుడు బీజేపీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉంది కాబట్టి అంతర్జాతీయ బోర్డర్ కి కంచె వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు.

బంగ్లా మద్దతు వెనక :

గడచిన కాలమంతా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు భారత్ లోకి సులువుగా ప్రవేశించి తిష్ట వేశారు. పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయింది. దాంతో వారి వలసలకు చెక్ పడింది. సర్ ప్రక్రియతో వారందరి ఓట్లు కూడా లేకుండా తీసేశారు. దాంతోనే ఇపుడు రోహింగ్యాలు తమ సొంత దేశానికి వెళ్ళాల్సిన అనివార్యత ఏర్పడింది. వారికి అక్కడ ఉపాధి లేక ఇక్కడ అవకాశం లేక ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే ఇపుడు ఓటు చోరీ అని ఉద్యమిస్తున్న వారికి బంగ్లాదేశ్ లో ఇలాంటి వారంతా మద్దతు తెలుపుతున్నారని అంటున్నారు, భారత్ లో నీట్ పరీక్షలకు వారికి సంబంధం ఏమిటని ఆయన నిలదీశారు. ఈ నిరసనల వెనక ఉన్న అసలు విషయాలను తెలుసుకోవాలని, ప్రజలు అంతా ఈ సంగతికి గుర్తించాలని కొండా విశ్వేశ్వర రెడ్డి కోరారు.