Begin typing your search above and press return to search.

భారత్ లో అత్యధికంగా వాడే ‘ఏఐ’ యాప్ ఏదో తెలుసా?

తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. నెలవారీ యాక్టివ్ యూజర్ల పరంగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ మార్కెట్లలో ఒకటిగా అవతరించింది.

By:  A.N.Kumar   |   20 Dec 2025 12:00 AM IST
భారత్ లో అత్యధికంగా వాడే ‘ఏఐ’ యాప్ ఏదో తెలుసా?
X

భారత్ లో ఏఐ వినియోగం ఊహించని వేగంతో దూసుకుపోంది. స్మార్ట్ ఫోన్ వాడకం.. చౌకౌన డేటా లభ్యతతో భారతీయులు ఏఐ టెక్నాలజీని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటున్నారు. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. నెలవారీ యాక్టివ్ యూజర్ల పరంగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ మార్కెట్లలో ఒకటిగా అవతరించింది.

అగ్రస్థానంలో చాట్ జీపీటీ.. అలుపెరగని పోరాటంలో జెమిని

బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీ భారత్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం దేశంలో సుమారు 14.5 కోట్ల (14.5 మిలియన్) మంది యూజర్లు దీనిని వినియోగిస్తున్నారు. విద్యార్థులు ప్రాజెక్టుల కోసం.. ఉద్యోగులు కోడింగ్, కంటెంట్ రైటింగ్ కోసం దీనిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

మరో వైపు టెక్ దిగ్గజం గూగుల్ కు చెందిన ‘జెమెని’ కూడా గట్టి పోటీనిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో నేరుగా లభ్యత ఉండడం..గూగుల్ అసిస్టెంట్ తో అనుసంధానం కావడంతో జెమినీకి భారత్ లో 10.5 కోట్ల (105 మిలియన్ ) మంది యూజర్లు ఉన్నారు.

వెనుకబడిన మస్క్ ‘గ్రోక్’.. దూసుకొస్తున్న ‘పర్ ప్లెక్సిటీ’

ప్రశ్న, సమాధానాలు, లోతైన రీసెర్చ్ కోసం పేరుగాంచిన పర్ ప్లెక్సిటీ ఏఐ సుమారు 2 కోట్ల మంది యూజర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఎలాన్ మస్క్ కు చెందిన గ్రోక్ ఇంకా ట్విట్టర్ ఎక్స్ ఫ్లాట్ ఫారమ్ కే పరిమితం కావడం వల్ల.. అలాగే చైనాకు చెందిన డీప్ సీక్ భారత మార్కెట్ లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టకపోవడంతో వీటి వినియోగం కేవలం 50 లక్షలలోపే ఉంది.

ప్రాంతీయ భాషలే భవిష్యత్తు!

భారతదేశంలోని స్టార్టప్ సంస్కృతి, యువతలో పెరుగుతున్న టెక్నాలజీ ఆసక్తి ఏఐ వినియోగాన్ని మరింత పెంచనున్నాయి. ముఖ్యంగా తెలుగు, హిందీ వంటి ప్రాంతీయ భాషల్లో మెరుగైన సేవలందించే యాప్స్ కు భవిష్యత్తులో విపరీతమైన డిమాండ్ ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచదేశాలతో పోలిస్తే.. ఏఐ వినియోగంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.