Begin typing your search above and press return to search.

దేశంలో 5జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 100 కోట్లు

భారతదేశంలో 5జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2031 నాటికి 100 కోట్లకు పెరగవచ్చు అన్నది ఒక నివేదిక. ఇదిపుడు సంచలనం రేపుతోంది.

By:  Satya P   |   21 Nov 2025 7:00 AM IST
దేశంలో 5జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 100 కోట్లు
X

భారతదేశంలో 5జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2031 నాటికి 100 కోట్లకు పెరగవచ్చు అన్నది ఒక నివేదిక. ఇదిపుడు సంచలనం రేపుతోంది. భారతదేశంలో యాక్టివ్ స్మార్ట్‌ఫోన్‌కు మొబైల్ డేటా వినియోగం నెలకు 36 జీబీగా సగటున ఉందని ఎ రిక్సన్ మొబిలిటీ నివేదిక పేర్కొంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసినా అత్యధికంగా ఉంది. ఇక 2031 నాటికి నెలకు 65 జీబీకి ఇది పెరుగుతుందని తాజా నివేదిక అంచనా వేస్తోంది. ఈ మేరకు విడుదలైన తాజా ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం మొబైల్ ఫోన్ సబ్‌స్క్రిప్షన్‌లలో ఐదవ తరం సేవలు దాదాపు 32 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇక ఇవి 2031 నాటికి 79 శాతానికి పెరుగుతాయని ఈ నివేదిక స్పష్టంగా వెల్లడించింది.

వేగవంతమైన వృద్ధి :

ఇక 2031 నాటికి భారతదేశం ఒక బిలియన్ 5జీ సబ్‌స్క్రిప్షన్‌లను అధిగమించనుందని ఇది వంతమైన 5జీ వృద్ధిని సూచిస్తోందని వెల్లడించింది. ఇక ఊస్తే ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక ప్రకారం భారతదేశం 2025 చివరి నాటికి 394 మిలియన్ 5జీ సబ్‌స్క్రిప్షన్‌లను చేరుకుంటుందని అంచనాగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా వేగంగా 5జీ సేవల విస్తరణకు ఒక సంకేతంగా చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా :

మరో వైపు చూస్తే కనుక 2025లో ప్రపంచవ్యాప్తంగా అదనంగా 400 మిలియన్ల మంది 5జీ సేవలను అందుకున్నారు. చైనా ప్రధాన భూభాగం వెలుపల ప్రపంచ జనాభాలో సగం మంది ఈ సంవత్సరం చివరి నాటికి 5జీ సేవలతో పూర్తిగా కవర్ చేయబడతారని భావిస్తున్నారు. 2024 మూడవ త్రైమాసికం 2025లో అదే కాలం మధ్య చూస్తే కనుక మొబైల్ నెట్‌వర్క్ డేటా ట్రాఫిక్ 20 శాతం మేర అధికంగా పెరిగిందని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం చైనాతో పాటుగా భారతదేశంలో 5జీ సేవల వృద్ధి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇదే వేగంతో కనుక ముందుకు సాగితే మాత్రం 2031 నాటికి ఈ 5జీ సేవల ట్రాఫిక్ వార్షిక సగటు రేటు 16 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

6 జీ సేవలతో :

ఇంకో వైపు చూస్తే 2031 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 6జీ సబ్‌స్క్రిప్షన్‌లు 180 మిలియన్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఏఐ ఆధారిత సేవలతో పాటు వాణిజ్యపరమైన అవసరాలు కొత్త ప్రాజెక్టులతో ఊహించిన దానికంటే ముందుగానే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రానున్న కాలంలో 6జీ విస్తరణలను చూడవచ్చని భావిస్తున్నారు. ఇక భారత దేశం 5జీ సేవలలో దూసుకుని పోవడానికి కారణం స్మార్ట్ ఫోన్ల వినియోగం అధికం కావడం అలాగే డేటా వినియోగం కూడా బాగా పేరగడం అని విశ్లేషిస్తున్నారు.