పాకిస్తాన్ జర బార్డర్ లో జాగ్రత్తగా అడుగేయ్.. ఇకపై ఇండియా దెబ్బ మామూలుగా ఉండదు మరి..
పక్కింటి వాళ్లు అప్పుడప్పుడూ మైకు పట్టుకుని చేసే హెచ్చరికలు, రాత్రిపూట దొంగచాటుగా పంపే డ్రోన్ల ‘కుహు కుహు’లకి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చేసింది.
By: A.N.Kumar | 4 July 2026 7:02 AM ISTపక్కింటి వాళ్లు అప్పుడప్పుడూ మైకు పట్టుకుని చేసే హెచ్చరికలు, రాత్రిపూట దొంగచాటుగా పంపే డ్రోన్ల ‘కుహు కుహు’లకి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చేసింది. "మీరు పాత చింతకాయ పచ్చడి లాంటి ప్లాన్లతో వస్తే... మేము నెక్స్ట్ లెవెల్ అప్‌గ్రేడ్‌తో రెడీ" అంటూ కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి భారీ బూస్ట్ ఇచ్చింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) మీటింగ్‌లో ఏకంగా రూ.52,000 కోట్ల షాపింగ్ లిస్ట్‌కు "యాక్సెప్టెన్స్ ఆఫ్ నెససిటీ (ఏఓఎన్)" గ్రీన్ సిగ్నల్ లభించింది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే... "ఇక మాటలు లేవు, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మోడ్రన్ టెక్నాలజీ ఆట మొదలైంది!"
శత్రు డ్రోన్లకి ‘బై బై’ చెప్పే ‘ఆకాశ్ తరంగ్’
ఇటీవల సరిహద్దుల్లో చీమలు దూరినా కనిపెట్టొచ్చు కానీ.. కొన్ని ‘కెమెరా డ్రోన్లు’ తెగ హల్‌చల్ చేస్తున్నాయి. వీటికి శాశ్వతంగా ‘టాటా, బైబై’ చెప్పేందుకు సైన్యంలోకి 'ఆకాశ్ తరంగ్' యాంటీ-యూఏవీ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ ఎంట్రీ ఇస్తోంది. శత్రువుల డ్రోన్ మన బోర్డర్ వైపు చూసి "హలో" అందామనుకునే లోపే.. దాన్ని గాల్లోనే ముక్కలు చేసి కింద పడేసే రేంజ్‌లో ఈ సిస్టమ్ పనిచేస్తుంది.
దీంతో పాటు భూమిపై శత్రువుల ట్యాంకులను తుత్తునియలు చేసే మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లు, మన ట్యాంకులకు రక్షణ కల్పించే యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ కూడా వస్తున్నాయి. ఇక ఆకాశం నుంచి వచ్చే దాడులను గాల్లోనే లేపేసే మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ కూడా ఈ ప్యాకేజీలో ఉంది. వీటికి తోడు తక్కువ ఖర్చుతో ప్రత్యర్థులకు ఎక్కువ నష్టం కలిగించే ‘జెట్ ఆధారిత కమికాజే డ్రోన్లు’ ఆత్మహుతి డ్రోన్లు కూడా మన సైన్యం అమ్ములపొదిలోకి చేరుతున్నాయి.
సముద్రంలో సైలెంట్ ఆపరేషన్స్.. ఆకాశంలో ‘సూడో’ కాపలాదారు
ఆర్మీ సంగతి సరే మరి నేవీ, ఎయిర్‌ఫోర్స్ పరిస్థితి ఏంటి? అక్కడా రచ్చ మామూలుగా లేదు .సముద్ర గర్భంలో శత్రు నౌకల ఆట కట్టించడానికి ‘మల్టీ ఇన్‌ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్’, నావల్ షిప్‌బోర్న్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ రంగంలోకి దిగుతున్నాయి. సముద్రంలో మనవాళ్లు "సైలెంట్‌గా చూస్తూ... సరైన టైమ్‌లో గట్టిగా బుద్ధి చెప్పే" ప్లాన్ అన్నమాట. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాయుసేన కోసం ‘హై ఆల్టిట్యూడ్ స్యూడో శాటిలైట్’ వ్యవస్థను కొనుగోలు చేస్తున్నారు. ఇది ఆకాశంలో తిరుగుతూ నిరంతరం నిఘా వేస్తుంది. అంటే... శత్రువుల కదలికలను 24 గంటలూ గమనించే ఒక ‘ఆకాశ కాపలాదారు’ రెడీ అవుతున్నాడు.
అంతా ‘మేడ్ ఇన్ ఇండియా’.. లోకల్ ‘వోకల్’ పవర్
ఈ రూ.52,000 కోట్ల షాపింగ్‌లో అత్యంత బ్యూటిఫుల్ పాయింట్ ఏంటో తెలుసా? ఇందులో మెజారిటీ వాటా విదేశీ సంస్థలకు కాదు.. మన స్వదేశీ రక్షణ తయారీ సంస్థలకే దక్కనుంది. దీనివల్ల మన దేశీయ పరిశ్రమలకు బూస్ట్ రావడమే కాకుండా.. "ఆత్మనిర్భర్ భారత్" నినాదానికి వంద శాతం న్యాయం చేకూరనుంది.
మొత్తానికి కేంద్రం వేసిన ఈ బిగ్ స్టెప్‌తో భారత త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అత్యాధునిక టెక్నాలజీతో ‘సూపర్ హీరోల’ లాగా అప్‌గ్రేడ్ కాబోతున్నాయి. ఇకపై బోర్డర్ వైపు చూసి బెదిరింపులు లేదా గిల్లికజ్జాలు పెట్టుకోవాలనుకునే ముందు, ప్రత్యర్థులు ఒక్కటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే... ఇక్కడ దెబ్బ మామూలుగా ఉండదు మరి..
