Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్: దేశంలో కోటీశ్వరులు పెరిగారు.. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే...!

భారతదేశంలో కోటీశ్వరులు, అర్థ కోటీశ్వరుల సంఖ్యలో మంచి పెరుగుదల కనిపించగా.. ఆదాయపు పన్ను దాఖలు చేసేవారి సంఖ్య మాత్రం స్వల్పగా పెరిగిందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది!

By:  Raja Ch   |   11 Jan 2026 10:13 AM IST
గుడ్  న్యూస్: దేశంలో కోటీశ్వరులు పెరిగారు.. బ్యాడ్  న్యూస్  ఏమిటంటే...!
X

భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది.. ఈ క్రమంలో భారతదేశం $4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారి జపాన్‌ ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రభుత్వం చెబుతోంది! అయితే ఈ అభివృద్ధి పన్ను చెల్లింపు వర్గం విస్తరించడం ద్వారా జరగాలా.. జరిగిందా..? లేక, సామాన్యులపై అధిక పనుల్ల భారం వేయడం వల్ల జరిగిందా..? ఇందులో ఏది నిజమైన అభివృద్ధి..? దేశంలో కోటీశ్వరుల పెరుగుదలలో అభివృద్ధి ఎక్కువగా ఉండగా.. పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో మాత్రం తక్కువ అభివృద్ధి కనిపించడాన్ని ఎలా చూడాలి..?

భారతదేశంలో కోటీశ్వరులు, అర్థ కోటీశ్వరుల సంఖ్యలో మంచి పెరుగుదల కనిపించగా.. ఆదాయపు పన్ను దాఖలు చేసేవారి సంఖ్య మాత్రం స్వల్పగా పెరిగిందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది! ఇది వ్యవస్థలో లోపమా.. లేక, ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పౌరుడి హోదాలో ఉండి.. రకరకాల కారణాలతో ఎగ్గొట్టే బ్యాచ్ పెరగడమా..? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు! వాస్తవానికి పెరుగుదల స్వల్పంగా ఉన్నా, పెరగడం పెరగడమే.. కానీ.. ఈ పోటీ ప్రపంచంలో, ఇంత పెద్ద దేశానికి అది సరైన పెరుగుదల కానే కాదు కదా!?

ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం గత 5 సంవత్సరాలలో ఐటీఆర్ ఫైలింగ్ లలో 36% వృద్ధి కనిపించిందని! అంటే... 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6.72 కోట్ల ఐటీఆర్ లు దాఖలైతే.. 2025-26 కి వచ్చే సరికి 9.19 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. అయితే 2024-25 (8.92 కోట్లు) తో పోలిసే 2025-26 (9.19) కోట్ల పెరుగుదల అంత భారీది కాదనే చెప్పాలి! ఇక్కడ పెరుగుదల 1.22% మాత్రమే కావడం గమనార్హం. అయితే.. ఈ గ్యాప్ లో కోటీశ్వరుల సంఖ్యలో మాత్రం పెరుగుదల దాదాపు 22% గా ఉంది! ఈ నేపథ్యంలోనే ఐటీఆర్ చెల్లింపుల సంఖ్యలో స్వల్ప పెరుగుదలను ఎత్తి చూపుతున్నాయని అంటున్నారు!

అవును... 2023-24 అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించి తమ పన్ను రిటర్న్‌ లలో రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నట్లు ప్రకటించిన వ్యక్తుల సంఖ్య 2.16 లక్షలు కంటే ఎక్కువ ఉండగా... 2024-25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం రూ.1 కోటి కంటే ఎక్కువ ఉన్నట్లు ప్రకటించిన వ్యక్తుల సంఖ్య 3,17,098 ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-డిసెంబర్ కాలానికి) ఈ సంఖ్య పెరిగి 3,85,752 కి చేరుకుంది. అంటే పెరుగుదల 21.65% అన్నమాట. కోటీశ్వరుల పెరుగుదలలో ఇది శుభసూచిక!

అయితే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా (145కోట్ల కంటే ఎక్కువ!) కలిగి ఉన్న భారతదేశంలో రూ.1 కోటి కంటే ఎక్కువ పన్ను చెల్లించేవారు 3.85 లక్షల మంది మాత్రమే ఉండటం వల్ల ఆదాయ అసమానతలను స్పష్టంగా సూచిస్తుందని అంటున్నారు. అంటే... దేశంలో తక్కువ మంది ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉంటే.. ఎక్కువ మంది అతి తక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్నారన్నమాట! దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటుతున్నప్పటికీ ఈ భారీ వ్యత్యాసం గురించి ఎవరిని ప్రశ్నించాలనేది మరో కీలక ప్రశ్నగా ఉంది!

ఇక దేశంలో ఆదాయం పెరుగుదల ఏ శ్రేణిలో ఎలా ఉందనేది ఇప్పుడు చూదామ్...!

5 లక్షల వరకూ సంపాదించేవారి సంఖ్య 2024-25లో 3.61 కోట్లుగా ఉంటే.. 2025-26లో 24.1% క్షీణతతో 2.74 కోట్లుగా ఉంది.

5 నుంచి 10 లక్షలు సంపాదించేవారి సంఖ్య 2024-25లో 3.32 కోట్లుగా ఉంటే.. 2025-26లో 15.4% వృద్ధితో 3.83 కోట్లుగా ఉంది.

10 నుంచి 50 లక్షలు సంపాదించేవారి సంఖ్య 2024-25లో 1.28 కోట్లుగా ఉంటే.. 2025-26లో 17.3% వృద్ధితో 1.50 కోట్లుగా ఉంది.

50 లక్షలు నుంచి కోటి సంపాదించేవారి సంఖ్య 2024-25లో 6.28 లక్షలుగా ఉంటే.. 2025-26లో 21.4% వృద్ధితో 7.62 లక్షలుగా ఉంది.

1 నుంచి 5 కోట్లు సంపాదించేవారి సంఖ్య 2024-25లో 2.90 లక్షలుగా ఉంటే.. 2025-26లో 21% వృద్ధితో 3.51 లక్షలుగా ఉంది.

అయితే... 2024–25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ – డిసెంబర్‌ లో 9.19 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అవ్వగా.. 2025-26 ఏడాదిలో వీటి సంఖ్య 8.92 కోట్లు. అంటే వృద్ధి 1.22% (మాత్రమే!).

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... బాధ్యతాయుతమైన పన్ను చెల్లింపుదారుల ద్వారా బలమైన భారతదేశం నిర్మించబడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే.. ప్రభుత్వం నిత్యం గుర్తుచేసే విషయమే! అయినప్పటికీ... ఎవరికి వారు పన్ను చెల్లింపుల విషయంలో ముందుకు రాకపోతే.. తప్పించుకునే మార్గాలు వెత్తుక్కుంటూ పోతే దేశ సమగ్రాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది..? ఆర్థిక అసమానతలు ఎక్కువగా పెరిగి.. ధనవంతులు దేశాన్ని వదిలి వెళ్లిపోయి.. సామాన్యులే దేశంలో మిగిలే రోజులు వస్తే.. భారతదేశం మళ్లీ ఎక్కడికి చేరుతుంది..? ఇవన్నీ ఆర్థిక విషయాలపై పెద్దగా అవగాహన లేకపోయినా.. కామన్ సెన్స్ తో వ్యక్తపరుస్తున్న కామన్ మ్యాన్ ప్రశ్నలు!