ఐటీ రిఫండ్ ఇంకా రాలేదా? ఇప్పుడేం చేయాలి?
దాదాపు ఏడు కోట్ల మంది తమ రిటర్న్ లను దాఖలు చేశారు. వీరిలో చాలామంది రిఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. చాలామందికి ఇంకా తమ రిఫండ్ రాలేదు. అందుకోసం ఎదరుచూస్తున్నారు.
By: Garuda Media | 21 Sept 2025 12:09 PM ISTవార్షిక ఆదాయపన్నుకు సంబంధించిన ఐటీ రిటర్న్ ను దాఖలు చేశారా? అందులో మీకు ఇప్పటికే కట్ అయినా పన్నును క్లెయిం చేశారా? అది ఇంకా రాలేదా? అయితే.. దీని కోసం ఏం చేయాలి? ఎలాంటి పద్దతుల్ని ఫాలో కావాలి? అసలు రిటర్న్ దాఖలు చేసిన తర్వాత ఎంతకాలానికి రీఫండ్ అమౌంట్ బ్యాంకు ఖాతాలో పడుతుందన్న అంశాలకు సంబంధించిన విషయాల్ని చూస్తే.. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన ఆదాయపన్ను రిటర్నును ఈ నెల (సెప్టెంబరు) 16 గడువు తేదీ అన్నది తెలిసిందే. దాదాపు ఏడు కోట్ల మంది తమ రిటర్న్ లను దాఖలు చేశారు. వీరిలో చాలామంది రిఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. చాలామందికి ఇంకా తమ రిఫండ్ రాలేదు. అందుకోసం ఎదరుచూస్తున్నారు.
జూన్.. జులైలోనూ ఫైల్ చేసినా రీఫండ్ రానోళ్లు ఉన్నారు. ఇలాంటప్పుడు రీఫండ్ ఎప్పుడు వస్తుందన్నది ప్రశ్న. నిబంధనల ప్రకారం చూస్తే.. ఈ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత నాలుగు వారాల నుంచి ఐదు వారాల్లో రీఫండ్ మొత్తం ఆయా వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో పడాలన్నది మర్చిపోకూదు. ఒకవేళ ఈ గడువు లోపు రీఫండ్ బ్యాంకు ఖాతాలో పడకుంటే.. ఇప్పుడు చెప్పే అంశాల్లో ఏదో ఒకటి కారణమై ఉండేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉండి ఉంటుంది. చాలా సందర్భాల్లో దాఖలు చేసిన రిటర్న్ లో పేర్కొన్న అంశాలు.. ఐటీ శాఖ వద్ద టాక్స్ పేయర్ సమాచారానికి సంబంధించిన సమ్మరీ (టీఐఎస్).. యాన్యయువల్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (ఏఐఎస్).. ఫామ్ 26 ఏఎస్ లోని సమాచారానికి.. ఫైల్ చేసిన రిటర్న్ లోని సమాచారానికి మధ్య తేడాలు ఉన్నా ఆలస్యమవుతుంది.
ఒకవేళ మీరు ఐటీ రిటర్న్ దాఖలు చేసిన తర్వాత ఏమైనా నోటీసులు వచ్చినా.. రివ్యూల సమాచారం అందినా లేట్ అవుతుందని అర్థం. బిజినెస్ ఆదాయం.. మూలధన లాభాలు.. అనేక తగ్గింపులు ఎక్కువగా ఉన్నప్పుడు.. రీఫండ్ మొత్తం రూ.50 వేల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు..టీడీఎస్ డేటాలో తేడాలు ఉన్నా.. రిటర్న్ లోని వివరాల్ని పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు.. బ్యాంక్ ఖాతాను ముందుగా వ్యాలిడేట్ చేయకపోవటం లాంటి అంశాల్లో తేడాలు కూడా రీఫండ్ ఆలస్యానికి కారణమవుతుందన్నది మర్చిపోకూడదు.
బ్యాంకు ఖాతాలోని పేరు.. పాన్ కార్డుపై ఉన్న పేరులో తేడా.. తప్పుడు ఐఎఫ్ఎస్ సీ కోడ్ ఉన్నప్పుడు.. ఐటీఆర్ లో పేర్కొన్న బ్యాంకు ఖాతా క్లోజ్ చేసినప్పుడు.. పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయనప్పుడు కూడా రీఫండ్ ఆలస్యమయ్యే వీలుంది. వార్షిక రిటర్న్ ను దాఖలు చేసిన తర్వాత ‘‘సబ్‌మిటెడ్ అండ్ పెండింగ్ ఫర్ ఈ-వెరిఫికేషన్ అని వస్తే’’ రిటర్న్ ఫైల్ చేసినా ఈ వెరిపిఖేషన్ పూర్తి కాలేదన్నది అర్థం. ఒకవేళ ‘‘సక్సె్‌సఫుల్లీ ఈ-వెరిఫైడ్ అని వస్తే’’ మీరు దాఖలుచేసిన రిటర్ను ఈ-వెరిఫై చేశారు కానీ రిటర్న్ లోని అంశాల్ని ఇంకా ప్రాసెస్ చేయలేదని అర్థం.
ఒకవేళ ‘ప్రాసెస్డ్’’ అని వస్తే.. మీరు దాఖలు చేసిన రిటర్న్ విజయవంతంగా ప్రాసెస్ చేశారన్నది అర్థం. ‘‘డిఫెక్టివ్’’ అని వస్తే మాత్రం మీరు దాఖలు చేసిన రిటర్న్ లో కొన్ని వివరాలు లేకపోవటం.. లేదంటే లోపంతో ఉన్నట్లు అర్థం. ఇలాంటప్పుడు మాత్రం నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ లోపాల్ని సవరించి.. మళ్లీ రిటర్న్ ఫైలు చేయాల్సి ఉంటుంది.
మీరు ఫైల్ చేసిన తర్వాత మీకు రావాల్సిన రీఫండ్ ఆలస్యమవుతుంటే ఆ వివరాల్ని తెలుసుకోవాలంటే.. పాన్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా incometax.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. కాకుంటే.. మీ పాన్ నెంబరు.. ఆధార్ నంబరుతో అనుసంధానం అయి ఉండదాలన్నది మర్చిపోకూడదు. లాగిన్ అయ్యాక.. ఈ ఫైల్ ట్యాబ్ లోకి వెళ్లి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే.. వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు కోరుకున్న అసెస్ మెంట్ సంవత్సరానికి సంబంధించిన మీ రీఫండ్ స్టేటస్ కనిపిస్తుంది. దీంతో.. మీ రీఫండ్ ఏ స్టేజ్ లో ఉందన్నది తెలుసుకునే వీలు కలుగుతుంది.
