Begin typing your search above and press return to search.

పాక్ ను వదిలినా మునీర్ వదలడం లేదు.. యూకేలో ముక్కు పగిలింది!

దేశం వెలుపల ఉన్నా తన దాడులు ఆగవనే సంకేతాన్ని పాక్ ప్రజానికానికి ఇవ్వాలని చూశారో ఏమో కానీ... దేశం విడిచి వెళ్లి యూకేలో నివశిస్తున్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ సలహాదారుడిపై యూకేలో అతని ఇంటివద్దే దాడి జరిగింది.

By:  Raja Ch   |   26 Dec 2025 9:19 AM IST
పాక్  ను వదిలినా మునీర్  వదలడం లేదు.. యూకేలో ముక్కు పగిలింది!
X

పాకిస్థాన్ అనధికారిక నియంత, ఆ దేశ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ వ్యవహారం ఇంటా బయటా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో 2022 ఏప్రిల్ లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అధికారం నుంచి తొలగించిన తర్వాత తన కుటుంబంతో కలిసి పాకిస్థాన్ నుంచి పారిపోయి యూకేలో నివసిస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ మాజీ సలహాదారుడు మీర్జా షాజాద్ అక్బర్. తాజాగా అతనిపై దాడి జరిగింది. ఇది రెండోసారి!

అవును... తనను విమర్శించేవారు, తనతో విభేధించేవారు దేశంలోనే కాదు.. దేశం వెలుపల ఉన్నా తన దాడులు ఆగవనే సంకేతాన్ని పాక్ ప్రజానికానికి ఇవ్వాలని చూశారో ఏమో కానీ... దేశం విడిచి వెళ్లి యూకేలో నివశిస్తున్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ సలహాదారుడిపై యూకేలో అతని ఇంటివద్దే దాడి జరిగింది. అయితే.. ఇదంతా అసిమ్ మునీర్ పనే అని.. ఇలా తనపై దాడి జరగడం ఇదే తొలిసారి కాదని అక్బర్ చెబుతున్నారు.

ఇటీవల తన ప్రసంగంలో మునీర్ ను అక్బర్ తీవ్రంగా విమర్శించినట్లు చెబుతున్నారు. అతని పేరు చెప్పకుండానే... గత మూడున్నర సంవత్సరాలుగా భయం, భీభత్సంతో నడిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని.. కానీ చివరికి ఆ భయంలోనే అతను జీవించాల్సి వచ్చిందని అన్నారు. ఇక తాజా ఘటనతో... ఈ దాడి రాజకీయంగా ప్రేరేపించబడినదని అతని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇది మునీర్ పిరికితనానికి నిదర్శనమని అంటున్నారు.

ఈ ఘటనపై స్పందించిన అక్బర్... ఉదయం 8 గంటల ప్రాంతంలో డోర్ బెల్ మోగడంతో తాను నిద్ర లేచానని.. వెళ్లి తలుపు తెరిచారనని.. ఆ సమయంలో ఓ వ్యక్తి తనను గుద్దడం ప్రారంభించాడని.. ఆ దాడిలో నా ముక్కు పగిలి, దవడ విరిగిపోయిందని అన్నాడు. అయితే.. తాను బలంగా ప్రతిఘటించడంతో అతని వెళ్లిపోయాడని.. ఈ సమయంలో కుటుంబం మేల్కొని నన్ను చూడటాన్నికి కిందకు వచ్చిందని తెలిపారు.

ఈ క్రమంలో దాడి చేసిన వ్యక్తి మళ్లీ తిరిగి వచ్చి దాడి చేయడం ప్రారంభించాడని.. ఈ సారి పగిలిన నా ముక్కు, విరిగిన నా దవడ పరిస్థితిని ఎవరికో చూపించాలి అన్నట్లుగా వీడియో, ఫోటోలు తీశాడని తెలిపారు. ప్రస్తుతం ఈ దాడిలో గాయపడిన అక్బర్... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది. 2022 ఏప్రిల్ లో అతను యూకేకి వచ్చేసిన తర్వాత అతనిపై జరిగిన రెండోదాడిగా దీన్ని చెబుతున్నారు. 2023లో ఇతనిపై యాసిడ్ దాడి జరిగింది.

ఇటీవల వైరల్ అయిన తన ప్రసంగంలో అక్బర్.. మునీర్ ను తీవ్రంగా విమర్శించారు. అతన్ని పేరు చెప్పకుండానే.. గత మూడున్నర సంవత్సరాలుగా పాకిస్థాన్ ను భయం, భీభత్సంతో నడిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అయితే, చివరికి అతడే భయంతో జీవించాల్సి వచ్చిందని చెప్పాడు. అతను తమ ఇళ్లపై దాడి చేసి, తమ ప్రియమైన వారిని కిడ్నాప్ చేశాడని.. తమనూ కిడ్నాప్ చేశాడని అక్బర్ తన ప్రసంగంలో అన్నారు.

ఇదే క్రమంలో తమ నాయకులను, తమ కుటుంబాలను కిడ్నాప్ చేశాడని.. మాలో భయం నింపడానికి అతడు అన్ని రకాల దారుణాలకూ పాల్పడ్డాడన్ని.. ఈ విషయంలో అతడు విజయం సాధించి ఉంటే ఈ రోజు మేము ఇక్కడ అంత పెద్ద సంఖ్యలో ఉండేవాళ్లం కాదని.. అతని విజయం సాధించి ఉంటే.. పాకిస్థాన్ లోని అడియాలా జైలు వెలుపల ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు కూర్చుని ఉండేవారు కాదని.. దీని అర్ధం అతడు విఫలమయ్యాడని.. ఇప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ ధరించిన ఆ వ్యక్తిలో భయం వ్యాపించిందని అన్నారు.

ఈ నేపథంలోనే అక్బర్ పై యూకేలోని తన ఇంటివద్దే దాడి జరిగిందని అంటున్నారు. కాగా... 2023లో ఒకసారి అతని కళ్లపై గురిపెట్టి యాసిడ్ దాడి ప్రయత్నం జరిగింది.. అయితే, ఆ దాడిలో అతనూ తృటిలో తప్పించుకున్నాడు. కాకపోతే అతన్ని శరీరానికి గాయాలు అయ్యయి! ఈ నేపథ్యంలో తాజాగా అతనిపై ఓ వ్యక్తి పిడిగుద్దులు గుద్ది.. ముక్కును పగలగొట్టి, దవడను విరగొట్టాడు!