ఒకేలా ఇద్దరి వేలి ముద్రలు... సైన్స్ లో కొత్త అప్డేట్
అయితే కొన్ని సార్లు సాంకేతికంగా లోపం ఏమైనా ఉంటే ఇలాగే చూపిస్తుంది. దాంతో అలా ఏమైనా జరిగిందా అన్నదే ప్రాధమికంగా విచారిస్తున్నారు.
By: Satya P | 18 Nov 2025 2:00 AM ISTఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల వేలి ముద్రలు ఒక్కలా ఉండవు. అంతే కాదు ఏ ఇద్దరి చేతి గీతలు ఒకేలా ఉండవు. ఇది సృష్టిలోని ఒక వింత. అదే అద్భుతం అని అంటారు. ఆఖరుకు ఒకే రూపుగా ఉంటూ బాడీ లాంగేజ్ నుంచి అన్నీ ఒక్కలాగ ఉండే కవల పిల్లలలో సైతం ఇలాంటి విషయాల్లో భిన్నంగానే ఉంటాయి. అందుకే బయో మెట్రిక్ వ్యవస్థ మీద అంత నమ్మకం ఉంటుంది. అయితే చిత్రంగా ఇద్దరు కవలల ఫింగర్ ప్రింట్స్ ఒకేలాగ ఉండడం మాత్రం ఆశ్చర్యంగానూ ఆసక్తికరంగానూ ఉంది. ఒక విధంగా చూస్తే ఇది సైన్స్ కే సవాల్ చేసే విధంగా ఉందని అంటున్నారు.
అక్కడ జరిగింది :
ఉత్తర ప్రదేశ్ లోని ఇద్దరు కవలలు అయిన ప్రబల్, పవిత్రా మిశ్రాల ఫింగర్ ప్రింట్స్, రెటీనాలు రెండూ ఒకేలా సరిపోయేలా ఉన్న్నాయి. దీంతో షాక్ తినడం అధికారుల వంతు అవుతోంది. ఇక్కడ ఒకరి ఆధార్ కార్డు అప్ లోడ్ చేస్తే రెండవ వారిది డీయాక్టివేట్ అవుతోంది. దాంతో ఈ వింతను విచిత్రాన్ని అధికారులు కనుగొన్నారు. అయితే జన్యుపరంగా చూస్తే కవలల్లోనూ ఈ విధంగా ఒకే మాదిరిగా ఫింగర్ ప్రింట్స్ ఉండడం అన్నది అసాధ్యమని నిపుణులు చెబుతున్న మాటగా ఉంది.
సాంకేతిక లోపమా :
అయితే కొన్ని సార్లు సాంకేతికంగా లోపం ఏమైనా ఉంటే ఇలాగే చూపిస్తుంది. దాంతో అలా ఏమైనా జరిగిందా అన్నదే ప్రాధమికంగా విచారిస్తున్నారు. ఒక వేళ అలా కాకపోతే మాత్రం ఇది సైన్స్ లో కొత్త అప్డేట్ గానే చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఈ ఇద్దరి కవలల బయోమెట్రిక్స్ సేం టూ సేం గా ఉండడం అంటే ఇప్పటిదాకా బయోమెట్రిక్ వ్యవస్థకే ఒక పరీక్షగానే భావించాలి. అంతా నమ్ముతున్న విధంగా ఏ ఇద్దరి వ్యక్తుల బయోమెట్రిక్స్ ఒకేలా ఉండవన్నది పాత మాట అవుతుంది. దాంతో బయోమెట్రిక్ విషయంలో కూడా రానున్న కాలంలో వినూత్న పరిశోధనలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అని అంటున్నారు.
జన్యువుల విషయంలో :
ఇక శాస్త్రాలు చెప్పేది ఏమిటి అంటే జన్యువుల విషయంలో ఎంతటి సారూప్యం ఉన్నా కూడా ఏ రెండూ ఒకటి కావు అన్నది. వేటికవే అన్నట్లుగానే ఉంటాయి. లోతుగా వెళ్తే మాత్రం అదే రుజువు అవుతుంది. ఇంతకాలం మనం అభివృద్ధి చేసుకున్న సైన్స్ ఇదే చెబుతూ వచ్చింది. కానీ సైన్స్ లో కూడా కొత్త పుంతలు తొక్కించే ఘటనలు జరిగినపుడే ఆవిష్కరణలు వేరే విధంగా చేయాల్సి వస్తోంది. దాంతో ఆ విధంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందా అన్నది కూడా అంతా ఇపుడు ఆలోచిస్తున్నారు.
