Begin typing your search above and press return to search.

రెండు మనసులకు పెళ్ళి...రోల్ మోడల్స్ ఐఏఎస్ జంట

పెళ్ళి అంటే ఎంతో ఆర్భాటం మరేంతో హడావుడి సంబరం ఇలా చాలానే చెప్పవచ్చు.

By:  Satya P   |   22 Nov 2025 10:16 PM IST
రెండు మనసులకు పెళ్ళి...రోల్ మోడల్స్  ఐఏఎస్ జంట
X

పెళ్ళి అంటే ఎంతో ఆర్భాటం మరేంతో హడావుడి సంబరం ఇలా చాలానే చెప్పవచ్చు. తమ స్టేటస్ ని తెలియచెప్పడానికే పెళ్ళిని ఎంతో గొప్పగా నిర్వహించే వర్తమాన సమాజం ఉంది పెద్ద వారిని చూసి పేద వారు కూడా తనకు ఆర్థిక స్తోమత లేకపోయినా ఎంతో ఖర్చుని నెత్తికెక్కించుకుని నానా అవస్థలు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎంతో ఉన్నత చదువులు చదివి అవసరం అనుకుంటే చాలా మంది సెలబ్రిటీల మాదిరిగా తాము కూడా గొప్పగా చేసుకోవచ్చు. కానీ తాము చేసే పని సమాజానికి కూడా ఆదర్శంగా ఉండాలని భావించారో లేక పెళ్ళి అంటే అసలైన అర్ధం తెలియచెప్పాలని అనుకున్నారో కానీ ఇద్దరు ఉన్నతాధికారులు చాలా సింపుల్ గా ఒక గుడిలో దండలు మార్చుకుని చేసుకున్న ఒక పెళ్ళి అయితే ఇపుడు అంతటా చర్చనీయాంశం అవుతోంది.

ఐఏఎస్ ఐఏస్ ల జంట :

ఆమె ఐఏఎస్ చదివి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా అలాగే ఇన్ఛార్జి సంయుక్త కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె పేరు శ్రీ పూజ. ఇక ఆయన వైపు చూస్తే మేఘాలయ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ఆదిత్య వర్మ. ఈ ఇద్దరి మనసులు కలిసాయి. మనువులు కుదిరాయి. ఇంతవరకూ ఓకే కానీ ఈ ఇద్దరూ వివాహం చేసుకున్న పద్ధతి అయితే మాత్రం ఎంతో మందిని ఆలోచింపచేసేలా ఉంది.

కొత్త జీవితంలోకి సింపుల్ గా :

పెళ్ళి అన్నది మనసులకే అని వారు ఇద్దరు గుర్తెరిగారు. అందుకే విశాఖలోని ఒక ఆలయంలో ఇద్దరూ దండలు మార్చుకుని పెళ్ళి చేసుకున్నారు. ఆ వెంటనే విశాఖపట్నంలోని సూపర్‌ బజార్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో తమ వివాహానికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఈ పెళ్ళికి హాజరైన వారు చాలా తక్కువ మందే. ఈ ఇద్దరి కుటుంబాలకు చెందిన అత్యంత ఆత్మీయులు. దగ్గరివారే. అలా పెళ్ళి అంటే ఏమిటో వారు చాటి చూపించారు. అంతే కాదు కొత్త జీవితంలోకి ఎంత అందంగా అడుగుపెట్టాలో కూడా సమాజనికి ఒక పాఠంగా చెప్పారు. ఇంతకీ ఈ ఇద్దరికీ ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిర్చిన వివాహం కావడం అసలైన విషయం.

నేపథ్యం ఇదీ :

ఇక ఈ ఇద్దరి కుటుంబ నేపధ్యం కూడా ఆసక్తికరంగా ఉంది శ్రీ పూజ ది కడప జిల్లా. అయితే వారంతా భీమవరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. శ్రీ పూజ బీటెక్ చేశారు ఆ మీదట 2021లో ఐఏఎస్ పూర్తి చేసి అల్లూరి జిల్లాలో ఉద్యోగం సంపాదించారు ఇక ఆదిత్య వర్మ విషయనికి వస్తే ఆయన ఉత్తర ప్రదేశ్ లోని మిర్జాపూర్ కి చెందిన వారు. తండ్రి పోలీస్ అధికారి. ఇలా కడప అమ్మాయి, యూపీకి చెందిన అబ్బాయి ఇద్దరూ ఈ విధంగా ఒక ఆదర్శవంతమైన తీరులో నవ దంపతులుగా మారారు. ఎందరిలో స్పూర్తిని నింపారు. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.