Begin typing your search above and press return to search.

హైడ్రా సంచలన నిర్ణయం.. కమర్షియల్ భవనాల్లో తనిఖీలు

హైదరాబాద్ లోని వాణిజ్య భవనాల్లో తనిఖీలకు సిద్ధమైంది. అగ్నిప్రమాదాల నివారణే లక్ష్యంగా రద్దీ ప్రాంతాల్లోని వ్యాపార కేంద్రాలను తనిఖీ చేపట్టాలని డిసైడ్ చేశారు.

By:  Garuda Media   |   29 Jan 2026 9:26 AM IST
హైడ్రా సంచలన నిర్ణయం.. కమర్షియల్ భవనాల్లో తనిఖీలు
X

గత వారంలో నాంపల్లిలోని ఫర్నీచర్ దుకాణంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించటం తెలిసిందే. బచ్చాస్ ఫర్నీచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు.. ఒక పెద్ద వయస్కురాలు..వారిని కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు పురుషులు మరణించటం తెలిసిందే. సెల్లార్ లో చిక్కుకున్న వారు మంటలతో రేగిన పొగకు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా ఉదంతాలు ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి.

నిబంధనల్ని పాటించకుండా.. సరైన చర్యలు తీసుకోకుండా.. నిర్మించిన అక్రమ నిర్మాణాల కారణంగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. హైదరాబాద్ లోని వాణిజ్య భవనాల్లో తనిఖీలకు సిద్ధమైంది. అగ్నిప్రమాదాల నివారణే లక్ష్యంగా రద్దీ ప్రాంతాల్లోని వ్యాపార కేంద్రాలను తనిఖీ చేపట్టాలని డిసైడ్ చేశారు.

ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో కలిసి రివ్యూ చేసిన ఆయన.. అగ్నిమాపక చర్యలు పాటించని భవనాలకు వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని.. లోపాలని తెలుపుతూ భవనం ముందు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాదు.. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే తప్పించుకునే దారి లేని షాపులు.. కాంప్లెక్సులకు సంబంధించిన వివరాల్ని హైడ్రా కంట్రోల్ రూంకు అందచేయాలన్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని 90001 13667కు మెసేజ్ చేయాలని.. తాము ఇచ్చే వివరాలకు సంబంధించి వీడియోలు.. ఫోటోల్ని కూడా జత చేసి పంపాలన్నారు. తమకు సమాచారం అందించిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు.

నాంపల్లి ఫర్నీచర్ షాప్ దుర్ఘటన నేపథ్యంలో సెల్లార్ ను వాహనాల పార్కింగ్ కు మాత్రమే వినియోగించాలని.. అందుకు భిన్నంగా వినియోగిస్తే.. అలాంటి షాపులకు తాళాలు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ నేపథ్యంలో అన్ని షాపులు.. వ్యాపార కేంద్రాల నిర్వాహకులు వెంటనే తమ సెల్లార్లను ఖాళీ చేయాలన్నారు. సెల్లార్ ను వాహనాల పార్కింగ్ కే వినియోగించాలని స్పష్టం చేశారు. తాము చేసే తనిఖీల్లో తప్పులు చేసినట్లుగా దొరికితే మాత్రం సదరు బిల్డింగ్ కు తాళాలు వేస్తామని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు వీలుగా పలు సూచనలు చేశారు.

హైదరాబాద్ మహానగరంలో సెల్లార్ ను వాణిజ్య అవసరాలకు వినియోగించేవి వందల్లో ఉంటాయి.మరి.. ఇలాంటి వాటన్నింటి మీదా చర్యలు తీసుకుంటే మరోసారి రచ్చ గ్యారెంటీ. దశాబ్దాలుగా సాగుతున్న ఈ అతిక్రమణల మీద చర్యల్ని ఆగమేఘాల మీద కాకుండా ప్రణాళికా బద్దంగా చేపడితే బాగుంటుంది. అంతే తప్పించి లేడికి లేచిందే పరుగు అన్న రీతిలో వ్యవహరిస్తే మాత్రం ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. హైడ్రా ఏం చేస్తుందో చూడాలి.