పెళ్లి కావట్లేదని హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య
సలేం జరిగిందంటే.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 26 ఏళ్ల విజయలక్ష్మికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు.
By: Garuda Media | 3 Feb 2026 9:39 AM ISTపెళ్లి కావట్లేదన్న మనోవ్యధలో ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తాజాగా వెలుగు చూసింది. కనిపించకుండా పోయిన ఆ యువతి మిస్సింగ్ అయిన వైనం గురించి ఆమె స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 26 ఏళ్ల విజయలక్ష్మికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి సరస్వతికి మతిస్థిమితం సరిగా లేదు. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.
వీరు ప్రస్తుతం కూకట్ పల్లి పరిధిలోని మైత్రినగర్ లో నివాసం ఉంటున్నారు. తల్లికి తానై సపర్యలు చేస్తూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఐటీ సంస్థలో జాబ్ చేస్తున్న ఆమెకు ఇటీవల పెళ్లి సంబంధాలు వచ్చాయి. అయితే.. అనారోగ్యంతో ఉండే తన తల్లి తనతోనే ఉంటుందన్న నిబంధనతో పలు సంబంధాలు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో తీవ్ర మనోవ్యధకు గురైంది విజయలక్ష్మి.
దీంతో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆమె సమీప బంధువు.. స్నేహితుడు అభిషేక్ పోలీసులకు ఆదివారం మిస్సింగ్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హుస్సేన్ సాగర్ లో యువతి డెడ్ బాడీని పోలీసులు కనుగొనటం.. అది విజయలక్ష్మిదే కావటంతో కూకట్ పల్లిలోని వారి ఇంటికి సమాచారం అందించారు. తల్లి కారణంగా పెళ్లి కావట్లేదని మనోవేదనకు గురైన విజయలక్ష్మి.. తాను తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతే.. తీవ్ర అనారోగ్యంగా ఉండే తన తల్లిని ఎవరు చూస్తారన్న విషయాన్ని ఆమె ఎందుకు మర్చిపోయింది? అన్నది ప్రశ్న. మతిస్థిమితం సరిగా లేని విజయలక్ష్మి తల్లి పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్న.
