Begin typing your search above and press return to search.

మార్చి 1 నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న డ్రైవ్

ఈ సందర్భంగా ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషర్ డి.జోయల్ డేవిస్ కీలక ప్రకటన చేశారు. ఇకపై వాహనాల్నినడిపే వారిపై నిరంతరం ప్రత్యేక డ్రైవ్ లు ఉంటాయని వెల్లడించారు.

By:  Garuda Media   |   11 Feb 2026 11:00 AM IST
మార్చి 1 నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న డ్రైవ్
X

హైదరాబాద్ మహానగరంలో రోడ్డు ప్రమాదాలు ఇటీవల కాలంలో అంతకంతకూ పెరుగుతున్నాయి. నెలలు తిరిగే కొద్దీ ప్రమాదాల సంఖ్య పెరగటమే కానీ తగ్గే పరిస్థితి కనిపించటం లేదు. దీనికి అమితమైన వేగంతో పాటు.. ప్రమాదాలను పసిగట్టే నియంత్రణ చాలా అవసరం. తాజాగా అలాంటిదే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. మార్చి ఒకటి నుంచి ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాల్ని నడపటం నేరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషర్ డి.జోయల్ డేవిస్ కీలక ప్రకటన చేశారు. ఇకపై వాహనాల్నినడిపే వారిపై నిరంతరం ప్రత్యేక డ్రైవ్ లు ఉంటాయని వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వామనాల్ని నడిపే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని చెబుతున్నారు. డ్రైవింగ్ చేసే వేళలో వాహనదారులు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సు కచ్ఛితంగా దగ్గర పెట్టుకోవాలసిందే. ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్న ప్రమాదాల్లో రోడ్డు మీద వెళ్లే వారు బలవుతున్నారు.

అంతేకాదు.. సరదా కోసమో ఇతర కారణాలు ఏమైనా.. డ్రైవింగ్ లైసెన్సు లేని వ్యక్తులకు ఇచ్చే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లుగా పేర్కొన్నారు. లైసెన్సు లేని వ్యక్తి వాహనం నడుపుతున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవటంతో పాటు.. జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిందని.. లైసెన్సు లేని వ్యక్తలు వెంటనే తమ వాహనాల్ని ఇచ్చే అలవాటును అర్జెంట్ గా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.