ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. కారులో డ్రైవర్ సజీవదహనం!
ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ - శామీర్ పేట సమీపంలో ఆర్ఆర్ఆర్ పై ఓ కారులో మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.
By: Raja Ch | 24 Nov 2025 1:43 PM ISTఇటీవల కాలంలో వాహనాల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తోన్న బస్సులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో ప్రయాణికులు సజీవ దహనమైపోయారు. బస్సులోని సీట్ల మధ్య మాంసపు ముద్దపు మిగిలిన దృశ్యాలు చూపరులతో కంటతడి పెట్టించాయి. ఈ క్రమంలో తాజాగా ఔటర్ రింగ్ రోడ్డుపై ఇలాంటి ఘటనే జరిగింది.
అవును... ఫోర్ వీలర్ వాహనాల్లో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రన్నింగ్ లో ఉన్న వాహనాల్లోనే కాదు, ఆగి ఉన్న కారుల్లోనూ మంటలు వ్యాపిస్తూ ప్రాణాలు హరిస్తున్నాయి, తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ - శామీర్ పేట సమీపంలో ఆర్ఆర్ఆర్ పై ఓ కారులో మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.
వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ - శామీర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం ఉదయం 5:50 గంటల ప్రాంతంలో కారులో మంటలు చెలరేగాయి. వాస్తవానికి ఆ సమయంలో కారు నిలిపేసిన డ్రైవర్.. హీటర్ వేసుకుని నిద్రపోతున్నాడని అంటున్నారు. సరిగ్గా అతడు నిద్రలో ఉండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మంటల్లో అతడు సజీవ దహనమైపోయాడు.
ఈ సమయంలో అతడి శరీరం పూర్తిగా కాలిపోయి, మాంసపు ముద్దగా మిగిలిందనే విషయం ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారింది! ఈ సమయంలో కారు నెంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మృతుడిని హన్మకొండకు చెందిన దుర్గా ప్రసాద్ (30)గా గుర్తించారు. వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది!
