Begin typing your search above and press return to search.

కోల్ కతాలో విధ్వంసం.. హైదరాబాద్ లో పరిస్థితి ఏంటి? రేవంత్ మ్యాచ్ జరుగుతుందా?

ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా కోల్ కతాలో అభిమానుల అంచనాలు తలిందులయ్యాయి.

By:  A.N.Kumar   |   13 Dec 2025 5:00 PM IST
కోల్ కతాలో విధ్వంసం.. హైదరాబాద్ లో పరిస్థితి ఏంటి? రేవంత్ మ్యాచ్ జరుగుతుందా?
X

ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా కోల్ కతాలో అభిమానుల అంచనాలు తలిందులయ్యాయి. సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీని చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ సమయానికి మెస్సీ కేవలం నిమిషాల్లోనే వెళ్లిపోవడంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ విధ్వంసానికి దిగారు.

కోల్ కతాలో ఫ్యాన్స్ ఆగ్రహం..విధ్వంసం

మెస్సీ ఈరోజు కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు మెస్సీని చూసేందుకు తరలివచ్చారు. కాగా.. మ్యాచ్ సమయానికి మెస్సీ నిమిషాల్లోనే వెళ్లిపోవడం..ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. దీంతో స్టేడియంలోనే విధ్వంసానికి దిగారు. కుర్చీలు ధ్వంసం చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్ విసిరిపారేశారు. ఫ్యాన్స్ ఆగ్రహంతో మెస్సి స్టేడియంలోని సొరంగం నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఎదురైంది. ఫ్యాన్స్ ను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. స్టేడియంలో గందరగోళ పరిస్థితులు కొనసాగాయి. ఈ ఘటనకు సంబంధించి ఈవెంట్ నిర్వాహకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

సాయంత్రం హైదరాబాద్ లో పరిస్థితేంటి?

కోల్ కతాలో జరిగిన ఘటన నేపథ్యంలో సాయంత్రం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న మెస్సీ టూర్ గురించి దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025’లో భాగంగా హైదరాబాద్ లో పర్యటించనున్నారు. మెస్సీ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న ఫ్లెండ్లీ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తలపడనున్నారు.

మొదట ఈ గోట్ టూర్ ఈవెంట్ సంగీత విభావరితో మొదలుకానుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి 9, వర్సెస్ మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల మధ్య 20 నిమిషాల పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగునుంది. ఈ మ్యాచ్ చివరి 5 నిమిషాల్లోనే మెస్సీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ మైదానంలోకి దిగుతారు. అనంతరం ఇద్దరూ కలిసి పెనాల్టీ షూటౌట్ లు కూడా ఆడనున్నారు. ఈ మ్యాచ్ ను వీక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ చేరుకున్నారు.

కోల్ కతాలో విధ్వంసం జరగడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోల్ కతా తరహాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుందా ముందస్తు చర్యలు చేపట్టారు. కేవలం టికెట్ , పాస్ లు ఉన్న వారినిమాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్ లో ఈ మ్యాచ్ ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో ఫుట్ బాల్ క్రీడకు ప్రోత్సాహం లభిస్తుందని.. హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.