హెచ్ సీయూ ల్యాబ్ లో కోడి మాంసం.. క్యాలీప్లవర్ తయారీ
అత్యధికులు వినియోగించే కోడి మాంసం.. క్యాలీఫ్లవర్ తో పాటు.. సహజ సిద్ధమైన పాలకు దగ్గరగా ఉండే ప్రత్యామ్నాయ పోషకాలు ఉండే మిల్క్ ను ల్యాబ్ లో తయారు చేస్తున్నారు
By: Garuda Media | 16 Sept 2025 1:00 PM ISTవినూత్న ప్రయోగానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది హైదరాబాద్. అత్యధికులు వినియోగించే కోడి మాంసం.. క్యాలీఫ్లవర్ తో పాటు.. సహజ సిద్ధమైన పాలకు దగ్గరగా ఉండే ప్రత్యామ్నాయ పోషకాలు ఉండే మిల్క్ ను ల్యాబ్ లో తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనలు తుదిదశకు చేరుకోవటమేకాదు.. వీలైనంత త్వరగా సామాన్యుల చెంతకు రానున్నాయి.
అవును.. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వేదికగా ఆస్పైర్ - బయోనెస్ట్ ప్రయోగశాలలో కోడి మాంసాన్ని.. క్యాలీఫ్లవర్ .. పాలను ఉత్పత్తి చేసే ప్రయోగాల్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. క్యాలీఫ్లవర్ లో రసాయనాలు వినియోగం పెద్ద ఎత్తున ఉండటంతోఆరోగ్యానికి హాని కలుగుతుందన్న భయాందోళనలు ఉన్నాయి. అంతేకాదు.. మాంసాహారంలోనూ నాణ్యత విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి
ఇలాంటి వాటికి చెక్ చెబుతూ బయోటెక్నాలజీ ద్వారా నాన్ వెజ్.. వెజ్.. పాలను తయారు చేసే ప్రక్రియ కొద్దికాలం క్రితం మొదలైంది. ప్రస్తుతానికి ఈ ప్రయోగశాలలో తయారైనవి సహజ పదార్థాలకు దగ్గరగా ఉన్నాయి. చికెన్ ఇష్టంగా తినే వారికి హెచ్ సీయూ బయోనెస్ట్ లో ఒక స్టార్టప్ సంస్థ కృత్రిమ మాంసాన్ని తయారు చేస్తోంది. కోడిలోని కణజాలాన్ని తీసుకొని దాన్ని ల్యాబ్ లో డెవలప్ చేసి మాంసంగా మారుస్తోంది. ఇది సాధారణ కోడి మాంసం మాదిరే ఉంటుందని చెబుతున్నారు.
హెచ్ సీయూలోని మరో స్టార్టప్ సంస్థ క్యాబేజీ పొరలు.. క్యాలీఫ్లవర్.. బ్రోకలీ కాండాల్నిసేకరించి వాటితో ప్రత్యామ్నాయ పోషకాల్ని రూపొందిస్తున్నారు. ఈ పోషకాలు వీగన్స్ తో పాటు శాఖాహారులకు ఉపయోగపడతాయి. అంతేకాదు బ్యూటీ ఇండస్ట్రీకి.. ఎనర్జీ బార్ లోనూ వినియోగానికి వీలుగా ప్రయోగాలు సాగుతున్నాయి. త్వరలోనే వీటి ఫలితాలు అందరికి అందుబాటులోకి రానున్నాయి. పెద్ద ఎత్తున ఉత్పత్తికి వీలుగా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లుగా ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
