సామూహిక విష ప్రయోగానికి కుట్ర చేసిన హైదరాబాద్ వైద్యుడు?
సాదాసీదాగా ఉంటూ.. వైద్యుడిగా పేరున్న అతడి అసలు ప్లాన్ తెలిస్తే నోట మాట రాదంతే.
By: Garuda Media | 11 Nov 2025 11:34 AM ISTసాదాసీదాగా ఉంటూ.. వైద్యుడిగా పేరున్న అతడి అసలు ప్లాన్ తెలిస్తే నోట మాట రాదంతే. యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు ఆదివారం హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ కు చెందిన షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. అదేమంటే.. సదరు వైద్యుడు (సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్) దారుణ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. ఆయుదం గింజలతో అత్యంత ప్రమాదకరమైన విషాన్ని తయారు చేసే పనిలో ఉన్నట్లుగా తేల్చారు.
మార్కెట్ లో సులువుగా లభించే ఆముదం గింజలతో తయారు చేసే అత్యంత శక్తివంతమైన విషాన్ని దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీళ్లు.. గుడి ప్రసాదాల్లో కలిపి వేలాది మంది ఊసురు తీసేందుకు ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. ఇతడు తయారు చేసిన విషానికి ప్రత్యేక గుణం ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఈ విషానికి ఎలాంటి వాసన.. రుచి ఉండదని పోలీసులు గుర్తించారు. ఇది సైనేడ్ కంటే ప్రమాదకరమైనదిగా పేర్కొంటున్నారు. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అతగాడికి పెళ్లి కాలేదు. 30 ఏళ్ల వయసు దాటినా పెళ్లి కాకపోవటం అతనున కుంగుబాటుకు గురైనట్లుగా చెబుతున్నారు. ఆన్ లైన్ లో రోగులకు కన్సల్టెన్సీ ద్వారా వైద్య సలహాల్ని ఇస్తుంటాడని తెలుస్తోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో మంచి నీళ్లల్లో కలపటం ద్వారా సామూహిక హత్యలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాదు.. పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉచితంగా పంచే ప్రసాదంలోనూ కలిపేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎవరూ చేయని అతి పెద్ద సామూహిక విషప్రయోగాన్ని చేపట్టి.. దారుణ మారణకాండకు ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. కేంద్ర నిఘా వర్గాల అప్రమత్తతో పాటు.. యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ దూకుడు భారీ విష ప్రయోగాన్ని అమలు కాకుండా ఆపిందని చెప్పక తప్పదు. ఉగ్రభూతానని అంటించుకున్న వైట్ కాలర్ టీంలు దేశ వ్యాప్తంగా ఇంకెన్ని ఉన్నాయన్న అంశాల్ని తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పకతప్పదు.
