Begin typing your search above and press return to search.

ట్రాప్: పబ్ కు వెళితే జేబు ఖాళీ.. బీరుకు రూ.29వేలు

తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసింది. డేటింగ్ యాప్ లో ఐటీ ఉద్యోగి కు యువతి పరిచయమైంది.

By:  Garuda Media   |   30 Sept 2026 3:47 PM IST
ట్రాప్: పబ్ కు వెళితే జేబు ఖాళీ.. బీరుకు రూ.29వేలు
X

అందంతో వల వేయటం.. సరదాగా డేట్ కు వెళదామా అంటూ గాలం వేయటం.. కట్ చేస్తే.. పబ్ కు తీసుకెళ్లి జేబు ఖాళీ చేయించే ఉదంతాలు హైదరాబాద్ మహానగరంలో అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో గాలం వేసే అమ్మాయి.. అందుకు సహకరించే పబ్ భాగోతాలు ఇప్పటికే బయటకు వచ్చి.. కేసులు నమోదయ్యాయి. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి హైదరాబాద్ మహానగరంలో వెలుగు చూసింది. ఒక డేటింగ్ యాప్ లో ఐటీ ఉద్యోగి కి ఒక అమ్మాయి పరిచయమైంది.

కాస్త చాటింగ్.. మరికాస్త మాటలయ్యాక.. ఓ కప్పు కాఫీ తాగుదామా? అనే మాట తరహాలో.. సరదాగా పబ్ కు వెళదామా? అని అడగటం.. ఆ వెంటనే ఓకే చెప్పేసిన బాధితుడి.. సదరు యువతి చెప్పినట్లుగా జూబ్లీహిల్స్ లోని నీరూస్ జంక్షన్ వద్ద కలుసుకుంది. వీరిద్దరు కలిసి అక్కడి దగ్గర్లోని పబ్ కు వెళ్లారు. అయితే.. సదరు పబ్ కు వెళ్లాలన్న మాట సదరు యువతి చెప్పటంతో అతడు కూడా ఓకే చెప్పేశాడు.

పబ్ లోకి వెళ్లిన తర్వాత అతను తాగిన ఒక బీర్ కు.. యువతి తీసుకున్న ఫ్రూట్ జ్యూస్.. స్నాక్స్ కు కలిపి ఏకంగా రూ.29,884 భారీ బిల్లు వేయటంతో బాధితుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక్క బీర్ కు.. ఫ్రూట్ జ్యూస్ కు రూ.29వేలా? అదెలా? అన్న ప్రశ్నకు సమాధానంగా బౌన్సర్లు రావటం.. సదరు యువతి తాను అప్పటికే తాను రూ.10వేలు కట్టినట్లుగా ఆన్ లైన్ రశీదు చూపించి చల్లగా జారుకుంది. మిగిలిన మొత్తాన్ని కట్టాల్సిందేనని పబ్ లోని వారు గట్టిగా అడగటంతో ఇంకేం చేయలేని పరిస్థితి.

దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించారు. తనకు యువతి మీదా.. పబ్ యాజమాన్యంమీదా అనుమానాలు ఉన్నాయని.. వారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.