హైదరాబాద్ బిర్యానీ.. ఏకంగా 9వేలు ఖర్చుపెట్టిన బిర్యానీ ప్రియుడు!
అయితే ముంబైకి చెందిన వెల్టన్ సల్దాన్హా అనే వ్యక్తి మాత్రం ఈ రుచి కోసం ఏకంగా తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
By: Madhu Reddy | 6 March 2026 1:37 PM ISTహైదరాబాద్ బిర్యానీ రుచి చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అయితే ముంబైకి చెందిన వెల్టన్ సల్దాన్హా అనే వ్యక్తి మాత్రం ఈ రుచి కోసం ఏకంగా తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 12 రోజుల పాటు హైదరాబాద్‌లో రకరకాల బిర్యానీలను ఆస్వాదించిన ఆయన, ఇంటికి వెళ్లేటప్పుడు ఆ రుచిని వదిలి వెళ్లలేక తన లగేజీలో ప్యాక్ చేసుకున్నాడు. బిర్యానీ ఖరీదు కంటే దాన్ని విమానంలో తీసుకెళ్లడానికి కట్టిన ఎక్సెస్ లగేజీ ఫీజు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు ఇలా వున్నాయి..
బిర్యానీ 5 వేలు.. లగేజీ ఫీజు 4,200:
వెల్టన్ సల్దాన్హా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. హైదరాబాద్‌లో 12 రోజుల పాటు గడిపిన ఆయన, వెళ్తూ వెళ్తూ దాదాపు 5 వేల రూపాయల విలువైన బిర్యానీలను ప్యాక్ చేయించుకున్నాడు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ బరువు పెరగడంతో, విమానయాన సంస్థ అతనికి 4,200 రూపాయల అదనపు ఫీజు వేసింది. అంటే తాను కొన్న బిర్యానీ ధరతో దాదాపు సమానంగా లగేజీకి చెల్లించాడన్నమాట. ఇక మొత్తంగా ఒక బిర్యానీ కోసం 9,200 రూపాయలు ఖర్చు చేసిన వెల్టన్, "హైదరాబాద్ బిర్యానీ అంటే నాకు పిచ్చి" అంటూ సరదాగా పోస్ట్ చేశాడు.
నెటిజన్ల రియాక్షన్.. బిర్యానీకి ఇచ్చే గౌరవం ఇదే:
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "హైదరాబాద్ బిర్యానీకి ఉండాల్సిన డెడికేషన్ ఇదే" అని కొందరు మెచ్చుకుంటుంటే, "బిర్యానీ కోసం 9 వేలు ఖర్చు చేయడం కొంచెం ఎక్కువే అయినా.. ఆ రుచి ముందు ఇవేవీ పనికిరావు" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఫుడ్ లవర్స్ అయితే తమ సొంత అనుభవాలను పంచుకుంటున్నారు.ఇక ఒక యూజర్ స్పందిస్తూ, "మా అబ్బాయి కూడా చెన్నై, హైదరాబాద్ నుండి ఇలాగే ఫేవరెట్ ఫుడ్ తెచ్చుకుంటాడు, ఎక్సెస్ లగేజీ కట్టడం మాకు అలవాటే" అని చెప్పుకొచ్చారు.
మైసూర్ వీధుల్లో విదేశీయుడికి బిర్యానీ విందు:
బిర్యానీ మ్యాజిక్ కేవలం దేశీయులకే కాదు, విదేశీయులకు కూడా పిచ్చెక్కిస్తోంది. ఇటీవల బ్రిటన్‌కు చెందిన లెపాని అనే ఆర్టిస్ట్ ఇండియా టూర్‌లో భాగంగా మైసూర్ వెళ్లినప్పుడు, అక్కడ ఒక అపరిచిత వ్యక్తి అతనికి ప్రేమతో బిర్యానీ వడ్డించాడు. ఆ సువాసన చూసి ఆగలేకపోయానని, భారతీయుల ఆతిథ్యం తనను ఆశ్చర్యపరిచిందని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు. ఇలా బిర్యానీ కేవలం ఆహారం మాత్రమే కాకుండా, మనుషులను కలిపే ఒక వారధిగా మారుతోంది. వెల్టన్ సల్దాన్హా లాంటి హార్డ్ కోర్ ఫుడీలు ఉన్నంత కాలం హైదరాబాద్ బిర్యానీ క్రేజ్ తగ్గేదేలే అంటున్నారు నెటిజన్స్. బిర్యానీ అంటే మన భారతీయులకు ఒక ఎమోషన్. ఆ రుచి కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతైనా ఖర్చు చేస్తాం అని ఈ ఘటనలు మరోసారి నిరూపించాయి.
