Begin typing your search above and press return to search.

ఇండిగో దెబ్బ...సూట్ కేసులు మాయం

ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకొచ్చిన తంటరా బాబు అనుకోని వారంటూ లేరు.

By:  Tupaki Political Desk   |   8 Dec 2025 12:17 PM IST
ఇండిగో దెబ్బ...సూట్ కేసులు మాయం
X

ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకొచ్చిన తంటరా బాబు అనుకోని వారంటూ లేరు. అత్యవసర ప్రయాణాలు ఆగిపోయిన వారు కొందరైతే...ప్రయాణం మధ్యలో చిక్కుకు పోయిన వారు మరికొందరు. ఈ ఇక్కట్లు చాలవన్నట్లు ఇండిగో దెబ్బకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సూట్ కేసులు, ట్రాలీలు మాయమైపోయాయి. ఇది మరింత గందరగోళానికి గురిచేస్తున్నఅంశం.

ఇండిగో విమానాల రద్దు దేశంలో పెను సంచలనాన్నే సృష్టించింది. దేశప్రైవేట్ పౌర విమానయాన సంస్థల్లొ అతిపెద్ద ఇండిగో ఒకే రోజు 550 విమానాలు రద్దు చేసి లక్షలాది మంది ప్రయాణికుల్ని గందరగోళానికి గురిచేసింది. సాంకేతిక సమస్యలు, అనానుకూల వాతవారణం, ప్రయాణికుల రద్దీతోపాటు విమాన విధుల సమయ కాలపరిమితి నిబంధనల వల్ల ఇండిగో అర్ధంతరంగా విమాన సర్వీసుల్ని రద్దు చేసేసింది. ప్రజలే కాదు ప్రభుత్వానికి కూడా ఏం జరిగిందో...ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది కొరత, జీతాలుసరిపోవట్లేదంటూ కొందరు పైలట్టు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లీవులోకి వెళ్ళడం ప్రధాన సమస్యలుగా తెలుస్తున్నాయి.

గోరుచుట్టుపై రోకలిపోటన్నట్లు అసలే విమానాల్లేక ప్రయాణికులు అల్లాడిపోతుంటే...వారి సూట్ కేసులు కనిపించకుండా పోవడం మరీ దారుణం.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కౌంటర్ వద్దకు వెళ్ళి విమానాల వివరాలు తెలుసుకుని తమ సీటు వద్దకు వచ్చేసరికి సూట్ కేసులు మాయమయ్యాయని ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గత బుధవారం 200 విమానాలు, గురువారం 550 విమానాల సర్వీసులు రద్దు కాగా...ఢిల్లీ ఎయిర్ పోర్టులో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్ లో 75, కోల్ కతాలో 35, చెన్నైలో 26 విమాన సర్వీసులు వరసగా రద్దవుతూ వచ్చాయి.ఈ సమస్యకు మూల కారణం పైలట్ల కొరతే. అయితే ఎయిర్ లైన్స్ పైలట్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా దీనికి స్పందిస్తూ...నిరాటంకంగ విమానం నడిపే పైలట్ల ఆరోగ్యం కోసం కొత్ ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్ అత్యవసరం అని వివరించింది. సగటున రోజకు 2300 విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఇండిగో ఈ సమస్య ఇప్పుడిప్పుడే పరిష్కారం కాదని, ఫిబ్రవరి దాకా వేచి చూడాల్సిందేనని అంటోంది. అంతే కాదు రానున్న రోజుల్లో విమాన సర్వీసుల రద్దు భారీగానే ఉండవచ్చని బాంబు పేల్చింది.

ఈ విషయంగా భువనగికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ...డీజీసీఏ కొత్త నిబంధనలు అమలైతే ఎక్కువ సంఖ్యలో పైలట్లను తీసుకోవాలసి వస్తుందని భావించిన ఇండిగో విమానాలు నడపకుండా ఇబ్బందులు సృష్టిస్తే... ప్రభుత్వం దిగివస్తుందని భావించింది. ఫలితంగా విమానాల టికెట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించాలని కోరారు. మరోపక్క వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు...ఇండిగో విమానాల సర్వీసుల రద్దు నేపథ్యంలో మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.