Begin typing your search above and press return to search.

గొడవ తర్వాత షాకింగ్ ట్విస్ట్.. భార్యకు మరో పెళ్లి చేసిన భర్త!

ఈ కాలంలో రకరకాల వింతలు జరుగుతున్నాయి.ఇప్పుడు ఒక వింత సంఘటనే ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది.

By:  Madhu Reddy   |   6 Aug 2026 4:03 PM IST
గొడవ తర్వాత షాకింగ్ ట్విస్ట్.. భార్యకు మరో పెళ్లి చేసిన భర్త!
X

ఈ కాలంలో రకరకాల వింతలు జరుగుతున్నాయి.ఇప్పుడు ఒక వింత సంఘటనే ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కలసి కాపురం చేసిన భార్యాభర్తల బంధంలో ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. భార్య వేరొకరిని ప్రేమిస్తుందని తెలిసిన భర్త, రోజూ గొడవలు పడేకంటే ఒక ముగింపు ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గ్రామం, ఇరువైపుల కుటుంబ పెద్దల సమక్షంలో తన భార్యకు ప్రియుడితో పెళ్లి జరిపించి సాగనంపాడు..ఆ వివరాలు చూద్దాం..

21 ఏళ్ల బంధం.. ఐదుగురు పిల్లలు:

ఉత్తర ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా దేవరి గ్రామానికి చెందిన బుద్ధిరామ్ నిషాద్, ఫుల్మతి అనే మహిళను 21 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరిద్దరికీ 18 ఏళ్ల కొడుకుతో సహా మొత్తం ఐదుగురు పిల్లలున్నారు. ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలోకి ఒక కొత్త వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో అసలు సమస్య మొదలైంది. ఇక వీరిద్దరి దశాబ్దాల బంధంలో మనస్పర్థలు వచ్చి సంసారం కాస్త గొడవల మయంగా మారింది.

తనకంటే 13 ఏళ్లు చిన్నవాడితో ప్రేమ:

సదరు గ్రామానికి చెందిన అవధేష్ అనే యువకుడితో ఫుల్మతి ప్రేమలో పడింది. అతడు ఆమె కంటే ఏకంగా 13 ఏళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. ఇక ఈ విషయం భర్త నిషాద్‌కు తెలియడంతో ఆమెకు పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సరే ఆమె తీరు మారకపోగా, రెండు నెలల క్రితం ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చినా భార్యాభర్తల మధ్య గొడవలు అసలు తగ్గలేదు.

పెద్దల సమక్షంలో ప్రియుడితో పెళ్లి:

రోజూ ఇంట్లో జరిగే ఘర్షణలకు ఎలాగైనా చెక్ పెట్టాలని నిషాద్ భావించాడు. భార్య కూడా ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పడంతో, భర్త అందరూ షాక్ అయ్యే నిర్ణయం తీసుకున్నాడు. ఊరి పెద్దలు మరియు ఇరు కుటుంబాల సమక్షంలో గ్రామంలోనే పంచాయతీ ఏర్పాటు చేశారు. ఇక పరస్పర అంగీకారంతో తన భార్య ఫుల్మతికి, ఆమె ప్రియుడు అవధేష్‌తో స్వయంగా వివాహం జరిపించి, కొత్త జంటకు వీడ్కోలు పలికి సాగనంపాడు.

వైరల్‌గా మారిన వెడ్డింగ్ వీడియో:

ఈ వింత పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిషాద్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక రోజువారీ నరకం అనుభవించే కంటే ఇలా ప్రశాంతంగా విడిపోయి ఆమె కోరుకున్న జీవితాన్ని ఇవ్వడం మేలని కొందరు అంటుంటే, ఐదుగురు పిల్లల భవిష్యత్తు ఏంటని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట హాట్ టాపిక్:

ఈ సినిమా తరహా సంఘటన ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక భార్య కోసం భర్త తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయం, దాని తర్వాత పిల్లల పరిస్థితి ఏంటనే విషయాలపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు.