Begin typing your search above and press return to search.

"పుష్ప"కు చెక్ పెట్టేస్తున్న హంటర్ డాగ్

దర్శకుడి ఆలోచనలకు తగ్గట్లు వెండితెర మీద చెలరేగిపోయే రీల్ పాత్రలకు భిన్నమైన పరిస్థితులు రియల్ లో మాత్రం భిన్నంగా ఉంటాయి.

By:  Garuda Media   |   14 Oct 2025 10:00 AM IST
పుష్పకు చెక్ పెట్టేస్తున్న హంటర్ డాగ్
X

దర్శకుడి ఆలోచనలకు తగ్గట్లు వెండితెర మీద చెలరేగిపోయే రీల్ పాత్రలకు భిన్నమైన పరిస్థితులు రియల్ లో మాత్రం భిన్నంగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో కథానాయకుడు పుష్ప ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తుంటాడు. అతగాడు టార్గెట్ ఫిక్సు చేస్తే.. ఎన్ని వందల టన్నులైన సరకు అయినా సరే ఇట్టే స్మగ్లింగ్ చేసేస్తుంటాడు. పోలీసులు సైతం అతన్ని ఏం చేయలేని పరిస్థితి.

రీల్ లో అంతలా చెలరేగిపోయే తీరుకు రియల్ లో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. వెండితెర మీద కథానాయకుడి పాత్రలో చెలరేగిపోయే పుష్పలకు చెక్ పెట్టే రియల్ అంశాలకు నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. రాత్రి వేళలో అడవిలో చెట్టు మీద గొడ్డలి పెడితే.. వారి అంతు చూస్తున్న హంటర్ డాగ్ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరిని పట్టించిన ఈ హంటర్ డాగ్ తరహాలో ప్రయత్నించాలే కానీ నల్లమల అడవుల్లో విలువైన అటవీ సంపదను కాపాడే వీలుందన్న విషయం అర్థమవుతుంది.

ఉమ్మడి అదిలావాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ పులుల సంరక్షక కేంద్రం.. జన్నారం అటవీ డివిజన్ పరిధిలో విలువైన టేకు చెట్లను నరికేస్తున్నారు. వీరి ఆట కట్టించేందుకు వీలుగా తెలంగాణ అటవీ శాఖ డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించింది. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన హంటర్ డాగ్ ను తీసుకెళ్లి.. నరికేసిన టేకు చెట్టు వద్ద వాసన చూపించగా.. అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాల్ని ట్రాక్ చేస్తూ.. చివరకు తానిమడుగు గ్రామంలోని రాజేశ్ ఇంటి వరకు వెళ్లి ఆగింది.

దీంతో అతగాడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. హంటర్ డాగ్ సత్తా అటవీ అధికారులకు తెలిసి వచ్చింది. విచారణలో భాగంగా అతడిచ్చిన సమాచారంతో టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇంతకూ ఈ టేకు దొంగను పట్టేసిన శునకం విషయానికి వస్తే.. బెల్జియన్ షెఫర్డ్ జాతికి చెందినదిగా చెబుతున్నారు. దీన్ని హర్యానాలోని ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ యానిమల్స్ విభాగంలో దీనికి ఏడునెలలు శిక్ష ఇచ్చారు.

అడవుల్లో టేకు చెట్లను నరికేసే పుష్పలకు చుక్కలు చూపించే సత్తా ఈ హంటర్ డాగ్ సొంతంగా చెబుతున్నారు. 200 మీటర్ల దూరం నుంచే వాసన పసిగట్టే ఈ శునకాలు రియల్ లైఫ్ లో చాలానే ఉంటాయి. అందుకే.. రీల్ లో చూపించినంత సింఫుల్ గా రియల్టీ ఉండదన్న విషయం తాజా ఉదంతం మరోసారి ఫ్రూవ్ చేసిందని చెప్పాలి