Begin typing your search above and press return to search.

మనిషి వయసు 150... మరణం మరింత వెనక్కి !

అయితే ఈ ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన వారు కూడా ఉన్నారు. జపాన్ వంటి దేశాలలో అయితే 80 ఏళ్ళు సులువుగా జీవిస్తున్నారు.

By:  Satya P   |   26 April 2026 12:00 AM IST
మనిషి వయసు 150... మరణం మరింత వెనక్కి !
X

మనిషి జీవితం వందేళ్ళు అని చెబుతారు. కానీ ఎవరూ ఆ నంబర్ ని చేరుకోలేరు. గట్టిగా యాభైలు చూసేసరికి జావగారి నీరు కారిపోతారు. అనేక రకాలైన వ్యాధుల బారిన పడి మరిన్నేళ్ళు బతికినా నానా ఇబ్బందులు పడుతూ నిక్కుతూ నీలుగుతూ గడుపుతారు. అయితే ఈ ప్రపంచంలో అత్యధిక కాలం జీవించిన వారు కూడా ఉన్నారు. జపాన్ వంటి దేశాలలో అయితే 80 ఏళ్ళు సులువుగా జీవిస్తున్నారు. అయితే మనిషి జీవితం వృద్ధాప్యం అన్నది జన్యువుల మీద ఆధారపడి ఉంది. ఇపుడు దాని మీదనే పరిశోధనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

రష్యా ప్రయోగాలు :

మనిషి వందేళ్ళు కూడా జీవించలేడు అనుకుంటున్న తరుణంలో రష్యా పరిశోధకులు అయితే ఏకంగా 150 ఏళ్ళు జీవించవచ్చు అని అంటున్నారు. ఈ మేరకు రష్యా కొత్త మందుని కనుగొంటోంది. మరణానికి ముందు దశ వృద్ధాప్యం. అది నియంత్రించేందుకు రష్యా గొప్ప మందునే కనుగొనేందుకు చాలా పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తోంది. దీని మీద రష్యా మంత్రి డెనిన్ సెకిరిన్స్కీ మాట్లాడుతూ తమ శాస్త్రవేత్తలు వృధాప్యాన్ని వీలైనంతవరకూ ఆలస్యం చేయడానికి మరణాన్ని దూరం జరపడానికి ప్రయోగాలు చేస్తున్నారు అని చెప్పారు. ఇది ప్రపంచంలోనే తొలి జన్యు చికిత్స ఔషధం అవుతుందని ఆయన చెబుతున్నారు.

ఏమిటీ కొత్త మందు :

జన్యు చికిత్స ఔషధం అంటే ఏమిటీ అన్నది కనుక చూస్తే ఈ మందు వృద్ధాప్యానికి కారణంగా ఉండే ఆర్ఏజీఈ అనే జన్యువుని నిరోధిస్తుంది. నిజానికి ఈ జన్యువు వల్లనే మనిషి వృద్ధాప్యానికి గురి అవుతారు.

ఈ జన్యువు ఎదుగుదలను నిరోధిస్తే కనుక మనిషి ఎక్కువ కాలం యవ్వనంలోనే ఉంటాడు. ఫలితంగా మరణం కూడా మరింత లేట్ అవుతుంది అని అంటున్నారు. ఈ మేరకు రష్యన్ పరిశోధకులు చేసిన పరిశోధనలు మంచి ఫలితాలు ఇస్తే ఇక మరణం మరింత వెనక్కు వెళ్ళడం ఖాయం అంటున్నారు. ఇక ఈ కొత్త మందును మందును ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ ఏజింగ్ అండ్ మెడిసిన్ లో అభివృద్ధి చేస్తున్నారు.

పుతిన్ చెప్పారు కూడా :

ఇక గత ఏడాది నవంబర్ లో జరిగిన ఏఐ సమావేశంలో రష్యా అధినేత పుతిన్ మాట్లాడుతూ మనిషి 150 ఏళ్ళు జీవించవచ్చు అని కామెంట్స్ చేశారు. ఈ పరిశోధనల గురించే ఆయన ఇలా మాట్లాడారు అని గుర్తు చేస్తున్నారు. పుతిన్ తన ఆయుస్షుని మరింతగా పెంచుకోవాలని బలమైన కోరికతో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం అయితే వృద్ధాప్య నియంత్రణ కోసం చేస్తున్న ప్రయోగాలు తొలి దశలోనే ఉన్నాయి. ఇవి విజయవంతం అయితే మాత్రం మనిషి ఏజ్ బాగా పెరుగుతుంది అని అంటున్నారు.

చైనాలో సైతం :

మరో వైపు చైనాలో కూడా ఈ తరహా పరిశోధనలు జరుగుతున్నాయి. చైనా శాస్త్రవేత్తలు బయోటెక్ సంస్థలు 150 సంవత్సరాల మానవ ఆయుర్దాయాన్ని లక్ష్యంగా చేసుకుని వృద్ధాప్య నిరోధక సాంకేతికతలపై పరిశోధనలు చేస్తున్నారు. చైనాలోని షెన్‌జెన్ కేంద్రంగా పనిచేస్తున్న లోన్వి బయో సైన్సెస్ సంస్థ ద్రాక్ష గింజల నుండి లభించే ప్రోసైనిడిన్ సి వన్ పీసీసీ వన్ అనే సమ్మేళనం ఆధారంగా వృద్ధాప్య నిరోధక ఔషధాన్ని అభివృద్ధి చేస్తోంది ఈ రకంగా తయారైన మందు వృద్ధాప్య కణాలను లక్ష్యంగా చేసుకుని నిర్మూలించడమే ఈ పరిశోధన. ఈ కణాలు విభజనను ఆపి వేసి కణజాలాలలో పేరుకుపోయి వాపును కలిగించి వయస్సు సంబంధిత క్షీణతను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు.