విశాఖ హెచ్పీసీఎల్ లో భారీ పేలుడు
విశాఖలో హెచ్పీసీఎల్ రిఫైనరీలో సోమవారం రాత్రి భారీ పేలుడు తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.
By: Satya P | 2 Nov 2026 11:58 PM ISTవిశాఖలో హెచ్పీసీఎల్ రిఫైనరీలో సోమవారం రాత్రి భారీ పేలుడు తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. హెచ్పీసీఎల్ రిఫైనరీ ప్రాంగణంలోని పెచ్ టవర్ యూనిట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదట భారీ పేలుడు శబ్దం వినిపించడంతో అసలు ఏమి జరిగింది అన్నది అర్ధం కాక స్థానికంగా నివాసం ఉంటున్న ప్రాంతాలకు చెందిన ప్రజలు అంతా భయభ్రాంతులు అయ్యారు
ఉలిక్కిపడుతూ :
హెచ్పీసీఎల్ రిఫైనరీలో పేలుడుతో మంటలు ఎగయడంతో స్థానికంగా ఉన్న జనాలు వణికిపోయారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానిక జనంతో పాటు అక్కడ ఉన్న కార్మికులు కూడా వెల్లడించారు. ఇక ఒక్కారిగా ఎగసిన మంటలతో పాటు దట్టమైననల్లటి పొగలు ఆకాశంలోకి దూసుకెళ్ళాయి. ఇక మంటలు పేలుడూ ఈ రెండింటితో భారీగా ప్రమాదం ఏర్పడింది అని భావించిన మల్కాపురం, శ్రీహరిపురం వంటి సమీప కాలనీల జనాలు తీవ్ర భయాందోళనలకు గురై ఒక్కసారిగా ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.
విద్యుత్ నిలిపివేత :
ఎప్పుడైతే ప్రమాదం చోటు చేసుకుందో సమీప పరిసరాలలో విద్యుత్ ని నిలిపివేశారు. ఇక విషయం తెలిసిన వెంటనే వెంటనే రిఫైనరీ అంతర్గత అగ్నిమాపక సిబ్బందితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అగ్ని ప్రమాద నివారణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు సాగించాయి. ఇదిలా ఉంటే ఈ భారీ పేలుడుకు సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఇప్పటివరకూ ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు అయినట్లుగా మాత్రం తెలిసి రాలేదు. మరో వైపు చూస్తే ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి అన్నది కూడా తెలియడం లేదు. ఇక రిఫైనరీలో ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా అన్నది కూదా చూడాల్సి ఉంది అని అంటున్నారు.
