Begin typing your search above and press return to search.

భారత్‌పై అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్‌ మరోసారి వ్యాఖ్యలు

అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ బుద్ది మారడం లేదు.కుక్క తోక వంకరలాగా హోవర్డ్ నోరు ఎప్పుడూ అదుపు తప్పుతూనే ఉంది.

By:  A.N.Kumar   |   29 Sept 2025 1:39 AM IST
భారత్‌పై అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్‌ మరోసారి వ్యాఖ్యలు
X

అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ బుద్ది మారడం లేదు.కుక్క తోక వంకరలాగా హోవర్డ్ నోరు ఎప్పుడూ అదుపు తప్పుతూనే ఉంది. ట్రంప్ అయినా కాసింత చూసి మాట్లాడుతున్నాడు కానీ.. ఈ హోవర్డ్ మాటలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. ఈ కంపు నోరు భారత్ పై రోజుకో మాట పేలుతూనే ఉంది. తాజాగా మరోసారి భారత్ పై మరోసారి నోరు జారాడు.

భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య వివాదాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ తాజాగా ఇండియాపై విమర్శలు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌, బ్రెజిల్‌, స్విట్జర్లాండ్‌ వంటి దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకునే విధానాలను అనుసరిస్తున్నాయంటూ, వీరు అమెరికాతో భాగస్వామ్యం కొనసాగిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ప్రవర్తించాలన్నారు.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం సందర్భం

రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన తర్వాత భారత్‌ రాయితీ ధరలపై ముడిచమురును కొనుగోలు చేస్తోందని ఆరోపించిన లుట్నిక్‌, ఇలాంటి నిర్ణయాలతో అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఏ వైపు నిలబడాలనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు.

వాణిజ్య అడ్డంకులపై ఆరోపణలు

భారత్‌, బ్రెజిల్‌, కెనడా వంటి దేశాలు అమెరికాలో తమ ఉత్పత్తులు విక్రయించి లాభాలు పొందుతున్నప్పటికీ, అమెరికా కంపెనీలకు తమ మార్కెట్లను పరిమితం చేస్తున్నాయని లుట్నిక్ పేర్కొన్నారు. అందువల్లే అమెరికా సుంకాలను పెంచక తప్పలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్యం చేయాలంటే ఈ దేశాలు సుంకాల విధానాన్ని అంగీకరించాల్సిందేనని హెచ్చరించారు.

భారత్‌–అమెరికా సుంకాల వివాదం

ఇప్పటికే రెండు దేశాల మధ్య సుంకాల వివాదం సీరియస్‌ స్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా భారత రష్యా చమురు దిగుమతులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, భారత్‌పై 50 శాతం అదనపు సుంకాలు విధించారు. ఇవి గత నెలలో అమల్లోకి వచ్చాయి. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దేశ ప్రయోజనాలను కాపాడుకునే దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

దౌత్య ఉద్రిక్తతల సూచన

హోవర్డ్‌ లుట్నిక్‌ వ్యాఖ్యలు భారత్‌–అమెరికా సంబంధాలపై మళ్లీ ప్రశ్నా చిహ్నం ఉంచాయి. వాణిజ్య ప్రయోజనాలు, జియోపాలిటికల్‌ అంశాలు కలసి రెండు దేశాల మధ్య సంబంధాలను గడ్డు పరిస్థితికి నెట్టేస్తున్నాయి. ఈ వివాదం ఎలా ముగుస్తుందో, దౌత్య చర్చల ద్వారా ఏదైనా లోటుపాట్లు పరిష్కరించబడతాయో చూడాల్సి ఉంది.