Begin typing your search above and press return to search.

బలమైన బంధం కోసం రోజూ శృ*గారం.. ఇది తెలుసుకోవాల్సిన విషయం!

దంపతుల మధ్య సంబంధాలు రోజు రోజుకీ మరింత బలంగా ఉండాలంటే.. వ్యక్తిగత జీవితంలోని ఒత్తిడి తగ్గించుకోవాలంటే భార్యాభర్తలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు.

By:  Raja Ch   |   9 Feb 2026 10:00 PM IST
బలమైన బంధం కోసం రోజూ శృ*గారం.. ఇది తెలుసుకోవాల్సిన విషయం!
X

దంపతుల మధ్య సంబంధాలు రోజు రోజుకీ మరింత బలంగా ఉండాలంటే.. వ్యక్తిగత జీవితంలోని ఒత్తిడి తగ్గించుకోవాలంటే భార్యాభర్తలు ప్రతిరోజూ శృ*గారంలో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా సుమారు 319 జంటలపై చేసిన స్టడీకి సంబంధించిన వివరాలు 'ఆర్కైవ్స్ ఆఫ్ సెక్స్యువల్ బిహేవియర్' లో ప్రచురితమవ్వగా... ఈ సందర్భంగా జంటలు తెలుసుకోవాల్సిన పలు కీలక విషయాలూ వెలుగులోకి వచ్చాయి! అలా అని దంపతుల మధ్య రోజూ సె*క్స్ మాత్రమే బలమైన బంధానికి కారణం కాదు కానీ దాని ప్రాముఖ్యత, దాని పాత్ర దానిదని అంటున్నారు!

అవును... సాధారణంగా వివాహం అయిన కొత్తలో జంటలు శారీరకంగా, మానసికంగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు! తొలిరాత్రి, హనీమూన్ దిశగా ప్రారంభమైన ఈ సంబంధం కాలక్రమేణా పిల్లలు కలిగిన తర్వాతో, బాధ్యతలు మరింతగా పెరిగినందుకో, ఉద్యోగ కారణాలతోనో, మరేఇతర ఒత్తిడి నేపథ్యంలోనే సహజంగా తగ్గుతుంటుంది. అంతమాత్రాన్న దంపతుల మధ్య ప్రేమాభిమానాలు, ఇష్టాలు లేవని కాదు కానీ... బంధం బలంగా ఉండాలంటే పరస్పర అంగీకరం ఇష్టంతో కూడిన శృ*గారం పాత్ర కూడా కీలకమని చెబుతున్నారు నిపుణులు!

సాధారణంగా వివాహం అయిన కొత్తలో అవకాశం దొరికితే వీలైనన్ని ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనాలని తపించే జంటలు.. కాలం గడిచే కొద్ది, పరిస్థితులు మారే కొద్దీ, ఒత్తిళ్లు పెరిగే కొద్దీ ఆ సంఖ్యలో మార్పులను చూస్తుమండటం అనేది అత్యంత సహజమైన విషయం. అది రోజుకి ఒక్కసారి, లేదా.. వారానికి ఒకటి రెండు సార్లు.. లేదా, నెలలో కొన్నిసార్లు మాత్రమే అవ్వొచ్చు! దానికి ఒత్తిడి, మందులు, ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి రకరకాల కారణాలు ఉండొచ్చు.

కాలం మారేకొద్ది పడక గదిలో ప్రీక్వెన్సీలు మారుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... రోజుకు ఎన్ని సార్లు, వారానికి ఎన్ని సార్లు, నెలకు ఎన్ని సార్లు, ఏడాదికి ఇంకెన్నిసార్లు అనే సంఖ్య ముఖ్యం కాదు కానీ.. సొసైటీ ఫర్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ ప్రచురించిన అధ్యయనంలోని.. వారానికి ఒకసారి మాత్రమే సెక్స్ చేసే జంటలూ సంతోషంగా ఉన్నాయనే విషయాన్ని మరిచిపోకూడదని అంటున్నారు!

ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్ చేసిన గత అధ్యయనంలో.. సగటు అమెరికన్ వివాహిత జంటలు సంవత్సరానికి సుమారు 56 సార్లు సెక్స్ లో పాల్గొంటారు! అంటే సగటున వారానికి ఒకసారన్నమాట. అయితే ఇక్కడ సంఖ్య కంటే అనుభవం, సంతృప్తి ముఖ్యమని చెబుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది గరిష్ట సంతృప్తి లైంగిక అనుభవాలను గుర్తుంచుకోవడానికి ఇష్టపడతారని.. ఉదాహరణకు ఎప్పుడో హాలిడేస్ ఫోటోలు చూస్తున్నప్పుడు నాటి శృ*గార అనుభవాలను నెమరు వేసుకుని మురిసిపోతారని చెబుతున్నారు!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... రోజూ ఒకసారి సెక్స్ చేస్తే బంధం బలంగానే ఉంటుంది కానీ... కేవలం రిలేషన్స్ లో సమస్యలు తగ్గించుకునేందుకు మాత్రమే జరిపే శృ*గారం వల్ల సరికొత్త సమస్యలు వస్తాయని చెబుతున్నారు! మరో విషయం ఏమిటంటే... బంధం బలంగా ఉండాలంటే.. భాగస్వామితో నిజాయితీగా ఉండటం.. ఇతరులతో పోల్చడం, పోల్చుకోవడం వంటివి చేయకపోవడం కూడా ముఖ్యమని సూచిస్తున్నారు! సో.. ఆల్ ది బెస్ట్!