హూతీల కీలక బెదిరింపులు.. ఆ వాణిజ్య నౌకల పరిస్థితి ఏమిటి?
ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ తో వ్యాపారం చేసే వాణిజ్య నౌకలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. దీంతో.. ఈ విషయం సంచలనంగా మారింది.
By: Raja Ch | 29 July 2025 12:32 AM ISTఇజ్రాయెల్ తో మొన్నటి వరకూ హమాస్ ఉగ్రవాదులకు, తర్వాత ఇరాన్ తో యుద్ధం.. ఇటీవల సిరియాపైనా దాడులు.. ఈ నేపథ్యంలో వీటన్నింటి తానులోనూ ముక్కగా చెప్పే హూతీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ తో వ్యాపారం చేసే వాణిజ్య నౌకలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. దీంతో.. ఈ విషయం సంచలనంగా మారింది.
అవును... యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రెబల్ గ్రూప్ హూతీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ తో వ్యాపారం చేసే వాణిజ్య నౌకలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని.. అవి ఏ దేశానికి చెందినవి, ఏ సంస్థవి అనే తారతమ్యాలేమీ లేవని.. ఏ నౌకలను విడిచిపెట్టేది లేదని హూతీ హెచ్చరించింది. ఈ సందర్భంగా తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.
ఇందులో భాగంగా... ఏ దేశానికి చెందినవైనా, ఏ కంపెనీకి చెందిన నౌకలైనా మాకు సంబంధం లేదు.. ఇజ్రాయెల్ పోర్టుల వైపు వెళ్లిన ప్రతి వాణిజ్య నౌకపైనా దాడులు చేస్తాం.. మా సైనిక చర్య ఆగాలంటే.. గాజాపై ఐడీఎఫ్ యుద్ధాన్ని ఆపాలి, పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లాలి, ఆ దేశంతో వాణిజ్యం చేస్తున్న దేశాలే ఈ మేరకు ఒత్తిడి తీసుకురావాలి అని పేర్కొంది.
కాగా... ఎర్ర సముద్రం మీదుగా ఇజ్రాయెల్ పోర్టులకు వెళ్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ వైపు వెళ్తున్న రెండు నౌకలపై దాడి చేసి, వాటిని సముద్రంలో ముంచేశారు. ఈ నేపథ్యంలో దాడులను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు హూతీలు తాజాగా ప్రకటించారు.
ఇటీవల లైబీరియా పతాకంతో వెళుతున్న బల్క్ క్యారియర్ పై డ్రోన్లు, మిస్సైళ్లు, గ్రెనేడులు, ఇతర ఆయుధాలతో దాడికి దిగిన హూతీలు... అనంతరం ఆ నౌక సముద్రంలో మునిగిపోయినట్లు హూతీలు ప్రకటించారు. అయితే... ఆ నౌకలో ఉన్న 22 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.
ఇదే క్రమంలో... గ్రీక్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న కార్గో నౌక ఉత్తరంవైపు సూయజ్ కాలువ దిశగా వెళుతుండగా దానిపైనా దాడి చేశారు. ఈ క్రమంలో.. నౌకలోని సెక్యూరిటీ గార్డులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఘర్షణలో ముగ్గురు నావికులు మరణించారు. ఈ క్రమంలోనే ఇకపై ఇజ్రాయెల్ పై ఒత్తిడి తెచ్చేలా మరిన్ని దాడులు ఉంటాయని హెచ్చరించారు!
