సడెన్ చేంజ్ : రాముడు కొడుకు ఆలయంకట్టిన పాక్
దాయాది పాకిస్థాన్ లో సడెన్ గా చేంజ్ కనిపిస్తోంది. భారత్ మీద ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా ఆరోపణలు ఎదుర్కొంటోంది పాక్.
By: Satya P | 28 Jan 2026 5:00 AM ISTదాయాది పాకిస్థాన్ లో సడెన్ గా చేంజ్ కనిపిస్తోంది. భారత్ మీద ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా ఆరోపణలు ఎదుర్కొంటోంది పాక్. అంతే కాదు భారత్ తో వేయి ఏళ్ళ పాటు యుద్ధం చేస్తామని ఘాటైన ప్రకటనలు ఇచ్చింది కూడా ఇదే పాక్. అంతే కాదు గత ఏడాది ఏప్రిల్ లో జమ్మూ కాశ్మీర్ లో మతం ఏంటి అని అడిగి మరీ దారుణంగా 26 మంది హిందూ పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల వెనక పాక్ అండగా ఉంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతిగా భారత్ పాక్ మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఎటాక్ తో చతికిలపడింది కూడా.
మైనారిటీల భయం :
పాకిస్థాన్ లో ఎపుడూ మైనారిటీలు బిక్కుబిక్కుమని జీవిస్తుంటారు. పాక్ దేశంలో హిందూ జనాభా దాదాపు 5.2 మిలియన్లుగా ఉంది. ఇది 2023 జనాభా లెక్కల ప్రకారం నమోదు అయి ఉంది. అంటే మొత్తం పాక్ జనాభాలో దాదాపు 2.17 శాతంగానే హిందువులు ఉన్నారు అన్న మాట. ఇక ఈ హిందువులలో కూడా అత్యధిక జనాభా సింధ్ ప్రావిన్స్‌లోనే కనిపిస్తారు.
విభజన నాటి సన్నివేశం :
ఇదిలా ఉంటే 1947 విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ జనాభాలో హిందువులు చాలా ఎక్కువ భాగం అంటే 14 శాతం కంటే ఎక్కువగా ఉండేవారు. విభజన తర్వాత పాక్ నుంచి హిందువులు భారత్ వచ్చారు. మిగిలిన వారిలో కూడా అణచివేతల మూలంగా వారంతా కూడా ఇబ్బందుల పాలు అయి జనాభా తగ్గిపోయింది. అయినప్పటికీ హిందువులు పాకిస్తాన్‌లో ఈ రోజుకీ అతి పెద్ద మతపరమైన మైనారిటీగా అక్కడ హిందువులు ఉన్నారు.
ఇదీ ప్రస్తుతం దృశ్యం :
ఇక చూస్తే కనుక పాకిస్తాన్‌లోని హిందువులు సింధీ, మార్వారీ, గుజరాతీ వంటి వివిధ భాషలు మాట్లాడే వారంతా విభిన్న సమాజంగా అక్కడ నివసిస్తున్నారు. ఇక వీరికి పాక్ జాతీయ అసెంబ్లీలో రిజర్వ్ చేయబడిన సీట్లు ఉన్నాయి. అలాగే బలూచిస్తాన్‌లోని హింగ్లాజ్ మాతా ఆలయం వంటి ముఖ్యమైన దేవాలయాలు ముఖ్యమైన తీర్థయాత్ర స్థలాలుగా ఈ రోజుకీ పనిచేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పాక్ పాలకులకు హఠాత్తుగా హిందువుల మీద ప్రేమ పుట్టింది అని అంటున్నారు.
లాహోరు కోటలో :
పాకిస్థాన్ లోని లాహోర్ కోటలో ఉన్న శ్రీరాముడు ఇద్దరు కుమారులలో ఒకరు అయిన లవుడు ఆలయాన్ని పాకిస్తాన్ ఇటీవల కాలంలో బాగా పునరుద్ధరించింది. దానిని హిందువులతో పాటు మొత్తం ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంచింది. అంతే కాదు సిక్కుల కోసం కూడా వారి కాలం నాటి పలు స్మారక చిహ్నాలను తెరచినట్లుగా అధికారులు చెప్పారు.
లవుడు ఆలయంలో :
ఇక లవుడు ఆలయంలో ప్రత్యేకతలు ఏమిటి అంటే పై కప్పు ఏమీ ఉండదు, లాహోర్ కోట లోపల గదుల్లో ఉన్న మధ్యలో ఈ ఆలయం కేంద్రీకృతమై ఉంటుంది. మరో విశేషం ఏమిటి అంటే లవుడు పేరుతోనే లాహోరు అన్న నగరం ఏర్పడింది అని హిందువులు విశ్వసిస్తారు. ఆనాటి సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పడం కోసం హిందువులు, సిక్కులు స్మారక చిహ్నాలు అలాగే మొఘల్ కాలం నాటి నిర్మాణాలను పాక్ ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది అని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి పాక్ వైఖరిలో అయితే ఈ విధంగా ఎంతో కొంత మార్పు రావడం మంచి పరిణామమే అని భావిస్తున్నారు.
