కోటి రూపాయలు ఇస్తారా.. సీఎంను లేపేస్తా: ఖతర్నాక్ అరెస్ట్
సాధారణ పౌరులను బెదిరించడం కామన్ అయిపోయింది. బెదిరించి డబ్బులు స్వాహా చేయడం, నగలు దోచుకోవడం కూడా తెలిసిందే.
By: Garuda Media | 16 Aug 2026 11:32 PM ISTసాధారణ పౌరులను బెదిరించడం కామన్ అయిపోయింది. బెదిరించి డబ్బులు స్వాహా చేయడం, నగలు దోచుకోవడం కూడా తెలిసిందే. అయితే.. తాజాగా ఓ వ్యక్తి.. ఏకంగా ముఖ్యమంత్రినే లేపేస్తానంటూ బెదిరింపులకు దిగడం.. దీనికి ఆయన కోటి రూపాయలు డిమాండ్ చేయడం గమనార్హం. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే సదరు ఖతర్నాక్‌ను చాలా తెలివిగా అరెస్టు చేశారు.
ఎక్కడ.. ఏం జరిగింది?
ఈశాన్య రాష్ట్రం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు ఇటీవల కాలంలో బెదిరింపులు వస్తున్నాయి. ఆయనఇతర మత విశ్వాసాలను గుర్తించడం లేదని పేర్కొంటూ.. పలువురు యువకులు బెదిరించిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. మాట్లాడుతున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో లైవ్ ప్రసారం చేశారు. ఈ సమయంలో యూట్యూబ్ కామెంట్లలో ఓ వ్యక్తి.. ``హింతను లేపేస్తా.. ఎవరైనా కోటి రూపాయలు ఇస్తారా`` అని బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు ఇచ్చాడు. ఇది భారీగా వైరల్ అయింది.
ఆవెంటనే స్పందించిన డీజీపీ.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అతి కష్టం మీద గువాహటి పోలీసులు సదరు ఖతర్నా క్‌ను పట్టుకున్నారు. అతని నివాసం, రూమ్ సహా.. సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. స్నేహితులను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు నిందితుడు.. మొరిగావ్ జిల్లాకు చెందిన మైనారిటీ ముస్లిం అబ్దుల్ ముతలెబ్‌గా పోలీసులు చెబుతున్నారు. అతనికి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ ఐతోనూ లింకులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అబ్దుల్ ముతలెబ్ చాలా యాక్టివ్‌గా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాలలో పాకిస్థాన్ చిత్రపటాలు, మ్యాపులు ఉన్నాయని.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాక్ భూభాగంలోని ప్రాంతంగా పేర్కొనే చిత్రాలను పలువురికి షేర్ చేసినట్టు గుర్తించారు. అలానే.. పాకిస్థాన్ అనుకూల నినాదాలు కూడా ఫేస్ బుక్‌లో కనిపించాయని తెలిపారు. మొత్తంగా.. సదరు అబ్దుల్ ముతలెబ్ పాక్‌తో సన్నిహితంగా మెలుగుతున్నట్టు గుర్తించామని డీజీపీ కార్యాలయం పేర్కొంది.
