అక్కడ గంజాయి సాగుకు ఓకే....కోట్లలో ఆదాయం
అయితే గంజాయి సాగుతో కూడా అదనపు ఆదాయం సంపాదించడం ఎలా అన్నది ఇపుడు ఒక రాష్ట్రం సీరియస్ గా ఆలోచించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఆ రాష్ట్రమే హిమాచల్ ప్రదేశ్.
By: Satya P | 28 Dec 2025 5:00 PM ISTగంజాయి సాగుని వ్యతిరేకిస్తూ ధ్వంసం చేయడం దేశంలో కొన్ని చోట్ల సాగుతోంది. అయితే గంజాయి సాగుతో కూడా అదనపు ఆదాయం సంపాదించడం ఎలా అన్నది ఇపుడు ఒక రాష్ట్రం సీరియస్ గా ఆలోచించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఆ రాష్ట్రమే హిమాచల్ ప్రదేశ్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా ఉన్న ఈ మంచు రాష్ట్రంలో ఇపుడు గంజాయి సాగూ చట్టబద్ధత కల్పించారు. అయితే పారిశ్రామిక గంజాయి సాగుకు మాత్రమే అని నిబంధన విధించారు. ఇక దీనికి గ్రీన్ టూ గోల్డ్ అని పేరు కూడా పెట్టారు.
ఆల్టర్నేషన్ గా :
రైతులకు కొత్త పంటలతో అదనపు ఆదాయం చూపించాలని ఆలోచించిన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం గంజాయి సాగుకు ఓకే చెప్పారు. అయితే పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే గంజాయిని మాత్రమే సాగు చేయాలని నిబంధన విధించారు. ఈ సాగు ద్వాతా రైతులకే కాకుండా ప్రభుత్వానికి సైతం ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. రానున్న రెండేళ్ళ కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ఎంతో కొంత బలంగా ఉండాలి అంటే ఈ తరహా విధానాలు అమలు చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది.
కోతులతో పంట నష్టం :
ఇక సంప్రదాయ పంటలను వేస్తున్న రైతులకు కోతుల బెడద ఎక్కువగా ఉంది. వారి పంటను కోతులు పెద్ద ఎత్తున దాడి చేసి సర్వనాశనం చేస్తున్నాయి. దాంతో వారంతా లబోదిబోమంటున్నారు. ఇలా భారీగా నష్టపోతున్న రైతులకు పారిశ్రామిక గంజాయిని సాగుచేసుకోమని చెప్పడం ద్వారా ప్రత్యామ్నాయ పంటని ప్రభుత్వం చూపించింది అని అంటున్నారు. దీని వల్ల ఏకంగా ప్రతీ ఏటా రెండు వేల కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందని లెక్క వేస్తున్నారు.
అక్రమ సాగు సక్రమం :
ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ లో కూడా చాలా చోట్ల అక్రమంగా గంజాయి సాగు పెద్ద ఎత్తున సాగుతోంది. అందులో మండీ, చంబా కులూ వంటి లోయలలో ఈ గంజాయి సాగు విరివిగా సాగుతోంది. దాంతో ప్రభుత్వమే దానిని సక్రమంగా మార్చడం ద్వారా అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి కొత్త ఆదాయ వనరుగా మారుస్తోంది అయితే మాదక ద్రవ్యం గా ఉన్న గంజాయి లో నుంచి మత్తు కలిగించని విధంగా కొత్త రకం పంటను పండించమని రైతులకు సూచిస్తున్నారు. టెట్రాహైడ్రోకెనబినాల్ రకం గంజాయి మొక్కలనే సాగు చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. దాని వల్ల ఔషధ రంగంలో గంజాయిని వినియోగించుకోఅచ్చు. అనేక కణాల వాపు తగ్గించడానికి అలాగే వివిధ రకాలైన నొప్పులు తగ్గించడానికి ఈ గంజాయిని వాడుతారు. ఇక పరిశ్రమల అవసరాలకు వస్త టెక్స్ టైల్స్, బయో-ప్లాస్టిక్స్ కాస్మెటిక్స్ బయో ఫ్యూయల్ వంటి అనేక పరిశ్రమలలో గంజాయి వినియోగం అధికంగా ఉంటుంది. దాంతో వాటికి ఈ పంటను సరఫరా చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
ప్రభుత్వానికి ఆదాయం :
కేవలం రైతులకే కాకుండా ప్రభుత్వానికి సైతం రెండు వేల కోట్ల రూపాయల దాకా ప్రతీ ఏటా ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. సంప్రదాయ పంటల వల్ల వచ్చే నష్టం ఈ విధంగా రైతులకు భర్తీ అవుతుంది, అలాగే ఎక్కువగా నీటి అవసరం కూడా గంజాయి పంట సాగుకు ఉండదు, వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా తట్టుకుని పంటను అందించగలిగే శక్తి గంజాయి సాగుకు ఉంది అని అంటున్నారు. ఈ సాగులో ఎక్కువగా యువతను ప్రోత్సహించడం ద్వారా వారికి ఒక ఉపాధిని కల్పించాలని ప్రభుత్వం చూస్తోంది. మొత్తానికి మత్తు నుంచి గమ్మత్తుగా ఆదాయం గడించడం అంటే ఇదే అని అంటున్నారు.
