Begin typing your search above and press return to search.

అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న పాండ్యా పోస్ట్.. ఇంతకీ అందులో ఏముందంటే?

క్రికెట్‌ షెడ్యూల్‌ నుంచి విరామం తీసుకున్న హార్దిక్‌ ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Political Desk   |   5 Nov 2025 4:04 PM IST
అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న పాండ్యా పోస్ట్.. ఇంతకీ అందులో ఏముందంటే?
X

భారత క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాడు. కానీ ఈసారి బ్యాట్‌, బాల్ తో కాదు.. అది కూడా గ్రౌండ్ లో కాదు. బీచ్‌ తీరాన చిల్‌ అవుతూ కనిపించాడు. పైగా పక్కనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. అతనితో కనిపిస్తున్నది మోడల్‌, నటి మహికా శర్మ. ఇద్దరూ ఇటీవల బీచ్‌ వద్ద విహరించిన ఫొటోలను పాండ్య తన ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





‘ఖాళీ సమయం’లో ప్రేమ విహారం

క్రికెట్‌ షెడ్యూల్‌ నుంచి విరామం తీసుకున్న హార్దిక్‌ ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మహికా శర్మతో కలిసి పలు ప్రైవేట్‌ ట్రిప్స్‌, డేట్స్‌ చేస్తున్నట్లు ఫొటోలు చెబుతున్నాయి. వీరిద్దరూ టూర్స్‌, బీచ్‌ పార్టీలు, లాంగ్‌ డ్రైవ్స్‌ లాంటి అనేక క్షణాలను కలిసి గడుపుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న బీచ్‌ ఫొటోల్లో వీరిద్దరూ మంచి మూడ్‌లో, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.





సోషల్ మీడియాలో..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలు షేర్‌ చేయగానే అభిమానుల కామెంట్లు మిన్నంటాయి. ‘వీరిద్దరూ కపుల్‌నా?’ ‘ఇప్పుడు నటాషా స్టాండ్ ఏంటి?’ ‘హార్దిక్‌ కొత్త చాప్టర్‌ మొదలుపెట్టేశాడా?’ వంటి ప్రశ్నలు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మహికా శర్మ కూడా ఈ ఫొటోలలో తన సమాధానాల ద్వారా మరింత కుతూహలం పెంచారు. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య సంబంధంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

హార్దిక్‌ వ్యక్తిగత జీవితం

క్రికెట్‌ మైదానంలో యాక్షన్‌తో, స్టైల్‌తో, ఆత్మవిశ్వాసంతో అభిమానులను ఆకట్టుకున్న హార్దిక్‌ పాండ్యా ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో కూడా అంతే ఆసక్తి రేపుతున్నాడు. నటాషా స్టాంకోవిచ్‌తో అతని వివాహం, ఆ తర్వాత వచ్చిన దూరం గురించి ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. ఇప్పుడు మహికా శర్మతో కలసి కనిపించడం అనేక ఊహాగానాలకు రేకెత్తిస్తోంది.

ప్రేమ పిచ్‌పై కొత్త ఇన్నింగ్స్‌..?

వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే.. ఇది కేవలం స్నేహంగా కాకుండా ఎక్కువగానే కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు. వీరు వివాహం చేసుకుంటారా.? లేక ఇది కేవలం స్నేహం మాత్రమేనా? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు హార్దిక్‌ లేదా మహికా ఎవరూ తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించలేదు.

ప్రస్తుతం ఈ కపుల్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. క్రికెట్‌ ఫీల్డ్‌ నుంచి లవ్‌ ఫీల్డ్‌ వరకు పాండ్యా శైలిలోని డ్రామా కొనసాగుతూనే ఉంది. అతని లైఫ్‌ కూడా మనముందే ఒక రియల్‌ టైమ్‌ మ్యాచేలాగానే కనిపిస్తోంది.