Begin typing your search above and press return to search.

అమెరికా హౌసింగ్ మార్కెట్ నుండి H-1B వీసా హోల్డర్లు ఔట్

ఈ విధాన మార్పు ప్రభావం వెంటనే హౌసింగ్ మార్కెట్‌లో కనిపించింది. JBREC (జాన్ బర్న్స్ రీసెర్చ్ & కన్సల్టింగ్) యొక్క కొత్త నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

By:  A.N.Kumar   |   16 Oct 2025 9:00 PM IST
అమెరికా హౌసింగ్ మార్కెట్ నుండి  H-1B వీసా హోల్డర్లు ఔట్
X

అమెరికా హౌసింగ్ మార్కెట్‌లో H-1B వీసా హోల్డర్లు.. ఇతర నాన్-పర్మనెంట్ రెసిడెంట్లు (NPRలు) తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ ప్రభుత్వపు కఠినమైన కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనల కారణంగా.. వీరు ఫెడరల్ హౌసింగ్ అడ్మినిస్ట్రేషన్ (FHA) బీమా చేసిన మోర్గేజ్‌లను పొందే అవకాశం పూర్తిగా కనుమరుగైంది.

* FHA లోన్‌లపై నిషేధం

హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (HUD) శాఖ మార్చి 26న విడుదల చేసిన ఒక లేఖ ప్రకారం, మే 25వ తేదీ నుండి నాన్-పర్మనెంట్ రెసిడెంట్లు FHA-ఇన్సూర్డ్ మోర్గేజ్‌లకు అర్హత కోల్పోయారు. ఈ నిర్ణయం ప్రధానంగా అమెరికా పౌరులు.. లా ఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ల (గ్రీన్ కార్డ్ హోల్డర్లు) ఆర్థిక అవకాశాలను కాపాడటానికి, ఫెడరల్ ప్రయోజనాలు కేవలం వారికి మాత్రమే అందేలా చూడటానికి తీసుకున్నామని శాఖ ప్రకటించింది.

ఈ నిర్ణయం ఫలితంగా ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు, అంతర్జాతీయ విద్యార్థులు, ఇతర తాత్కాలిక వీసాపై ఉన్న వృత్తి నిపుణులు ఇంటిని కొనుగోలు చేయడంలో అకస్మాత్తుగా అడ్డంకిని ఎదుర్కొన్నారు.

* మోర్గేజ్ వాల్యూమ్‌లో భారీ పతనం

ఈ విధాన మార్పు ప్రభావం వెంటనే హౌసింగ్ మార్కెట్‌లో కనిపించింది. JBREC (జాన్ బర్న్స్ రీసెర్చ్ & కన్సల్టింగ్) యొక్క కొత్త నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఏప్రిల్‌లో NPRలకు మంజూరైన FHA లోన్ వాల్యూమ్ 6 శాతంగా ఉండగా... జూన్‌లో అది 1 శాతం కంటే తక్కువకు పడిపోయింది. జూలై, ఆగస్టు నెలల్లో ఈ సంఖ్య దాదాపు సున్నాకి చేరింది.

JBREC నిపుణుడు యాక్సెల్ థామస్ తెలిపిన వివరాల ప్రకారం, "మేలో కొత్త నిబంధన అమలులోకి రాగానే.. NPRలకు FHA మోర్గేజ్‌లు దాదాపుగా సున్నాకు తగ్గిపోయాయి. 2024లో NPRలు FHA లోన్లలో సుమారు 4 శాతం వాటా కలిగి ఉండేవారు, ముఖ్యంగా ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉండేది."

* కన్వెన్షనల్ లోన్ల వైపు మొగ్గు

FHA లోన్‌లను కోల్పోవడంతో H-1B హోల్డర్లు , ఇతర NPRలు ఇప్పుడు కఠినమైన షరతులున్న కన్వెన్షనల్ లోన్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. కన్వెన్షనల్ లోన్లకు సాధారణంగా అధిక క్రెడిట్ స్కోర్లు, US ఆదాయపు డాక్యుమెంటేషన్.. దీర్ఘకాలిక ఉద్యోగ చరిత్ర వంటి కఠినమైన అర్హతలు అవసరం.

ఇప్పటికే హోంబయింగ్ ఖర్చులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అనేక మంది వీసా హోల్డర్లు ఈ కఠిన షరతులను నెరవేర్చడంలో ఇబ్బందులు పడుతున్నారు, తద్వారా ఇంటి యజమానులు అయ్యే వారి కల దూరమవుతోంది.

* మార్కెట్‌పై ప్రభావం

నిపుణుల హెచ్చరికల ప్రకారం.. ఈ నిర్ణయం హౌసింగ్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే మార్కెట్‌లో సేల్స్ తక్కువగా, హౌసింగ్ సప్లై ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో కొత్త కొనుగోలుదారులను మార్కెట్‌కు దూరం చేయడం నష్టం కలిగిస్తుంది.

JBREC నిపుణుడు ఎరిక్ ఫినిగన్ మాట్లాడుతూ "H-1B వీసా హోల్డర్లకు లోన్ ఇవ్వకపోవడం, ఎంట్రీ-లెవల్ హోంబయింగ్‌ను మరింత కుదిపేస్తోంది" అని తెలిపారు. ఈ మార్పు కారణంగా ప్రతిభావంతులైన నాన్-పర్మనెంట్ రెసిడెంట్లు నివాస స్థలాలను సొంతం చేసుకోలేని పరిస్థితి ఏర్పడటంతో, అమెరికన్ హౌసింగ్ మార్కెట్ ప్రధానమైన కొనుగోలు శక్తిని కోల్పోతోంది.