Begin typing your search above and press return to search.

విశాఖ మేయర్ సీటు... కేబినేట్ మంత్రి హోదానే !

ఏపీలో అతి పెద్ద కార్పోరేషన్ గా విశాఖ నగర పాలక సంస్థ ఉంది. 2005 దాకా కేవలం 50 వార్డులుగా ఉన్న దాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 73 దాకా డివిజన్లు చేసి గ్రేటర్ విశాఖగా మార్చింది.

By:  Satya P   |   16 May 2026 9:25 AM IST
విశాఖ మేయర్ సీటు... కేబినేట్ మంత్రి హోదానే !
X

ఏపీలో అతి పెద్ద కార్పోరేషన్ గా విశాఖ నగర పాలక సంస్థ ఉంది. 2005 దాకా కేవలం 50 వార్డులుగా ఉన్న దాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 73 దాకా డివిజన్లు చేసి గ్రేటర్ విశాఖగా మార్చింది. ఇక 2021 లో వైసీపీ జీవీఎంసీకి ఎన్నికలు పెట్టినపుడు ఆ నంబర్ ని కాస్తా 98 కి పెంచింది. అలా ఏపీలో ఎక్కువ డివిజన్లు ఉన్న కార్పోరేషన్ గా విశాఖ ఉంది. ఇక ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్పోరేషన్లు మునిసిపాలిటీలలో సీట్ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో జీవీఎంసీలో వార్డులు 120 దాకా పెరగనున్నాయి. ఈ మేరకు డ్రాఫ్ట్ ని తయారు చేసి అధికారులు ప్రభుత్వానికి పంపించారు.

భారీ నంబర్ కోసం :

అయితే విశాఖ ఎమ్మెల్యేలు అంతా పట్టుబడుతున్నది మొత్తం 150 దాకా వార్డులను చేయమని. అంటే అదనంగా మరో 30 వార్డులు పెంచమని వారు ప్రతిపాదిస్తున్నారు. విశాఖ చుట్టు పక్కన గ్రామ పంచాయతీలు ఒక అరవై దాకా ఉన్నాయి. వాటిని కనుక జీవీంసీలో విలీనం చేస్తే మొత్తం 150 దాకా వార్డులు పెరిగి అతి పెద్ద కార్పోరేషన్ గా ఏపీలో అవతరిస్తుందని అదే విధంగా కేంద్ర స్థాయిలో కూడా గ్రాంట్స్ పెద్ద ఎత్తున వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. దీని మీద ప్రభుత్వం అయితే ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

పోటా పోటీగా :

స్థానిక సంస్థలకు ఈ ఏడాది సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. అంటే మరో నాలుగు నెలలు అన్న మాట. అప్పటికి జీవీఎంసీ సీట్లు 150 దాకా పెంచి ఎన్నికలు పెట్టడం కుదురుతుందా అన్నది ఒక చర్చ. ఎందుకంటే విలీనం కోసం గ్రామ పంచాయతీలను తీసుకుంటే న్యాయ పరమైన వివాదాలు ఏమైనా తలెత్తుతాయా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. అంతే కాకుండా సాంకేతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. అయితే జీవీఎంసీ మేయర్ పదవి విషయంలో కూటమిలోనూ టీడీపీలోనూ పోటా పోటీగా ఉంది అని అంటున్నారు.

నాలుగు దశాబ్దాల తరువాత :

టీడీపీ విషయానికే వస్తే వైసీపీ నాలుగేళ్ల పాటు పాలించిన తరువాత ఆఖరి ఏడాది మేయర్ మీద అవిశ్వాసం పెట్టి మరీ దించి టీడీపీ మేయర్ పదవిని దక్కించుకుంది. కానీ అసలైన ఎన్నికల యుద్ధంలో ప్రజామోదం తో పదవిని అందుకోవాలని ఆ పార్టీ చూస్తోంది. 1987లోనే తొలిసారి టీడీపీ అలా కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచి మేయర్ పదవిని అందుకుంది. మళ్ళీ నాలుగు దశాబ్దాల తరువాత 2026 లో అదే విజయాన్ని రీ సౌండ్ చేస్తూ దక్కించుకోవాలని చూస్తోంది. విశాఖలో చాలా మంది ఆశావహులు అయితే మేయర్ పదవి మీద గురి పెట్టి ఉన్నారు. జీవీఎంసీ మేయర్ పదవి అంటే కేబినెట్ మంత్రి పోస్ట్ తో సమానం అని భావిస్తున్నారు. ఆ హోదా ఆ దర్జా ఆ రాజసం కోసం ఈసారి మేయర్ కిరీటాన్ని ధరించాలని తమ్ముళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.