Begin typing your search above and press return to search.

అమెరికాతో తగ్గేదేలే.. ట్రంప్ కు షాకిచ్చిన భారత్

గత ఏడాది నవంబర్‌లో గయానా తీరం నుంచి సుమారు 4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో కూడిన భారీ నౌకలు భారత్ వైపు ప్రయాణాన్ని ప్రారంభించాయి.

By:  A.N.Kumar   |   6 Jan 2026 10:19 PM IST
అమెరికాతో తగ్గేదేలే.. ట్రంప్ కు షాకిచ్చిన భారత్
X

కేవలం రష్యా నుంచి మాత్రమే భారత్ ను చమురు కొనొద్దని ట్రంప్ ఆదేశించారు. ఇప్పటికే ఒత్తిడి పెంచుతున్నాడు. అయితే భారత్ మాత్రం తగ్గేదేలే అంటూ ట్రంప్ టెంపరితనానికి సెగ పుట్టిస్తూ కొత్త డీల్స్ చేసుకుంటూ అగ్రరాజ్యపు అహంకారానికి చెక్ పెడుతోంది.. తగ్గేదేలే అంటూ ముందుకెళుతోంది.

ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్ తన ఇంధన భద్రత విషయంలో అడుగులు వేగవంతం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ పొందుతూ లాభపడిన భారత్ ఇప్పుడు భవిష్యత్తు అవసరాల కోసం సరికొత్త ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకుంది. అదే దక్షిణ అమెరికా దేశమైన గయానా.

భారత్ దిశగా కదులుతున్న చమురు నౌకలు

గత ఏడాది నవంబర్‌లో గయానా తీరం నుంచి సుమారు 4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో కూడిన భారీ నౌకలు భారత్ వైపు ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఈ నెలలో జనవరి 2026 నాటికి భారత తీరానికి చేరుకోనున్నాయి. రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు గయానాతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం భారత్ దౌత్యపరమైన విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

గయానా ఎందుకు కీలకం?

గయానా సముద్ర తీర ప్రాంతంలో ఇటీవల అసాధారణ స్థాయిలో చమురు నిల్వలు బయటపడ్డాయి. దీనితో ఆ దేశం రాత్రికి రాత్రే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో హాట్ టాపిక్ అయింది. గయానా సైతం భారత్‌తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉంది. తమ దేశంలోని చమురు బావుల అన్వేషణ, తవ్వకాల్లో భారతీయ ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యత ఇస్తామని గయానా ప్రకటించింది. కేవలం ప్రైవేట్ సంస్థల ద్వారానే కాకుండా ప్రభుత్వాల మధ్య ఒప్పందాల ద్వారా చమురు కొనుగోలుకు మార్గం సుగమం అవుతోంది.

భారత్‌కు చేకూరే ప్రయోజనాలు

గయానాతో ఈ నవ నూతన బంధం వల్ల భారత్‌కు మూడు ప్రధాన లాభాలు చేకూరనున్నాయి. కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా వివిధ ప్రాంతాల నుంచి చమురు పొందే వెసులుబాటు ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో రష్యా లేదా గల్ఫ్ దేశాలు ధరలు పెంచినా గయానా వంటి ప్రత్యామ్నాయాల వల్ల భారత్‌పై భారం తగ్గుతుంది. మధ్యప్రాచ్యం లేదా ఐరోపాలో యుద్ధ వాతావరణం నెలకొన్నా, దక్షిణ అమెరికా నుంచి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది.

భారత్ తగ్గేదేలే

ఒకప్పుడు చమురు కోసం అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు తలొగ్గిన భారత్ ఇప్పుడు తన ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకుంటోంది. రష్యా నుంచి దిగుమతులు తగ్గినా లేదా ఆంక్షల ప్రభావం ఉన్నా.. గయానా రూపంలో భారత్‌కు పటిష్టమైన 'ప్లాన్-బి' సిద్ధంగా ఉంది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటమే కాకుండా, భారత ఇంధన రంగం మరింత స్వయం సమృద్ధి సాధించనుంది.