Begin typing your search above and press return to search.

ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. రాత్రంతా పో*ర్న్ వీడియోలు!

ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా వెలుగు చూస్తున్న నేరాలు - ఘోరాలు అన్నీ ఇన్నీ కాదనే సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   22 Jan 2026 3:39 PM IST
ప్రియుడితో కలిసి భర్తను  చంపేసి.. రాత్రంతా పో*ర్న్  వీడియోలు!
X

ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా వెలుగు చూస్తున్న నేరాలు - ఘోరాలు అన్నీ ఇన్నీ కాదనే సంగతి తెలిసిందే. జన్మజన్మల శత్రుత్వం ఉన్న వారు సైతం ఈ స్థాయిలో ప్రత్యర్థులను చంపరని.. కానీ, వివాహ బంధంతో ఒక్కటైన జంటలోని భాగస్వామి మాత్రం ఈ స్థాయిలో భర్త/భార్యపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. ఇవి తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను చంపేసి.. రాత్రంతా పో*ర్న్ వీడియోలు చూసిన మహిళ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో దంపతుల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీతో మొదలవుతున్న అక్రమ సంబంధాలు.. హత్యలు, జైళ్లు శిక్షలతో ముగుస్తున్న పరిస్థితి! ఈ క్రమంలో తాజాగా గుంటూరు జిల్లాలో వెలుగు చూసిన ఓ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

అవును... గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు రెండు రోజుల క్రితం మృతిచెందారు. ఈ క్రమంలో తన భర్త గుండెపోటుతో మృతి చెందారని భార్య రోధించింది. తనను ఒంటరిని చేసి వెళ్లిపోయాడని బిగ్గరగా ఏడ్వడం మొదలుపెట్టింది. అయితే.. నాగరాజు స్నేహితుల ఎంట్రీ, ఫలితంగా పోలీసుల రంగ ప్రవేశంతో అసలు విషయం తెరపైకి వచ్చింది.

మంగళగిరి రూరల్ సీఐ, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... నాగరాజుకు లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. ఈ క్రమంలో.. నాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా.. మాధురి విజయవాడలోని సినిమాహాల్లోని టికెట్‌ కౌంటర్‌ లో పనిచేసేది. ఆ సమయంలో.. సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ క్రమంలో... నామోషీగా ఉందంటూ తన భర్తతో ఉల్లిపాయల వ్యాపారం మానిపించేసిన మాధురి... హైదరాబాద్‌ లో గోపీ నిర్వహిస్తున్న కారు ట్రావెల్స్‌ లో ఉద్యోగానికి పంపింది. అయితే.. హైదరాబాద్ వెళ్లిన నాగరాజు కొంతకాలం తర్వాత తిరిగి చిలువూరు వచ్చేశారు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఇక.. నాగరాజు ఇంటి వద్దే ఎక్కువగా ఉంటూ తన పాత వ్యాపారాన్నే కొనసాగిస్తున్నారు!

దీంతో... తన ప్రియుడు గోపీతో సంబంధానికి ఈ విషయం అడ్డుగా మారింది. ఈ నేపథ్యంలోనే తన భర్త అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని లక్ష్మీమాధురి భావించింది. ఈ క్రమలో.. ఈ నెల 18న రాత్రి బిర్యానీ వండి, భర్తకు పెట్టే ప్లేట్ లో 20 నిద్రమాత్రలు పొడిగా చేసి కలిపింది.. దీంతో, బిర్యానీ తిన్న నాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నారు.

కట్ చేస్తే... సమయం రాత్రి 11:30 అయ్యింది. ఆ సమయంలో మాధురి ప్రియుడు గోపీ ఇంట్లోకి వచ్చాడు. ఆ సమయంలో నిద్రపోతున్న నాగరాజు ఛాతిపై గోపీ కూర్చోగా.. మాధురి దిండుతో ముక్కుపై అదిమి నొక్కిపట్టింది. దీంతో నాగరాజు మృతి చెందాడు. అతని మృతిని కన్ఫాం చేసుకున్న గోపి.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత.. రాత్రంతా మాధురి పో*ర్న్‌ వీడియోలు చూస్తూ గడిపింది!!

ఈ క్రమంలో... తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఇరుగుపొరుగును పిలిచిన మాధురి.. గుండెనొప్పితో తన భర్త చనిపోయాడని హడావుడి చేసింది. ఇక శోకాలు మొదలుపెట్టింది. తనను ఒంటరిని చేసి భర్త అర్ధాంతరంగా వెళ్లిపోయాడని మొదలుపెట్టింది. దీంతో.. ఆమె భర్త నిజంగానే గుండెపోటుతో మరణించి ఉంటాడని భావించి.. చింతించారు.. మరికొంతమంది ఆమెతో కలిసి ఏడ్చారు పాపం!

అయితే... సరిగ్గా అరగంటలో అతని మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తారనగా అక్కడికి వచ్చిన నాగరాజు స్నేహితులు.. అతని చెవి నుంచి రక్తం రావడాన్ని గమనించారు. పైగా గోపీ అనే వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం ఉందనే మాటా ఆ నోటా ఈ నోటా విన్నారని అంటున్నారు! దీంతో.. వెంటనే వాళ్లు నాగరాజు తండ్రితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు.

దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. రిపోర్ట్ లో.. మృతుని ఛాతీ వద్ద ఎముకలు విరిగి ఉండడంతో పాటు ఊపిరి ఆడకుండా చేయడంతో చనిపోయాడని తేలింది. దీంతో... మాధురిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. దీంతో.. ఈ విషయం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.