ఇదో కొత్త జ్వరం.. ఆలస్యం చేశారో నష్టమే!
వర్షాకాలం వచ్చిందంటే కచ్చితంగా సీజనల్ వ్యాధులుగా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటివి వస్తూ ఉంటాయి.
By: Madhu Reddy | 26 Aug 2025 9:00 PM ISTవర్షాకాలం వచ్చిందంటే కచ్చితంగా సీజనల్ వ్యాధులుగా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటివి వస్తూ ఉంటాయి. అయితే వర్షం నీళ్లలో తడిస్తే అందులో ఉండే బ్యాక్టీరియా మనలోకి చేరి జలుబు, జ్వరం వంటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు కూడా అటాక్ అవుతుంటాయి. అలా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ వైరల్ ఫీవర్ కి సంబంధించిన లక్షణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. కొంత మందిలో విపరీతమైన జ్వరం,తలనొప్పి, కీళ్లనొప్పులు, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే లక్షణాలను బట్టి అది ఏం జ్వరమో టెస్టుల ద్వారా తేలిపోతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొత్తరకం జ్వరం మాత్రం టెస్టుల్లో ఏమీ లేదని తేలుతుంది. కానీ మామూలు జ్వరమే కదా అని వదిలేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే అవయవాలు ఒక్కొక్కటిగా పాడవుతాయి. చివరికి చనిపోవచ్చట. మరి ఇంతకీ ఆ జ్వరం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
తాజాగా గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కొత్త రకం జ్వరం కేసులు బయటపడ్డాయి. 48 ఏళ్ల వెంకటరమణ అనే వ్యక్తి దాదాపు 45 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం మాత్రమే కాకుండా ఆయాసం, దగ్గు, కామెర్లు, ఊపిరితిత్తుల్లో నెమ్ము వంటి వాటికీ చికిత్స కూడా తీసుకున్నారు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా కూడా జ్వరం తగ్గకపోవడంతో చివరికి బర్కోల్డేరియా సుడోమాలి అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల వచ్చే మెలియాయిడోసిస్ అనే ఇన్ఫెక్షన్ అని తేలింది. దాంతో డాక్టర్లు ఆ వెంకట్రావుకి ఆంటీబయోటిక్స్ తో చికిత్స అందించడం వల్ల ఆయన ఆరోగ్యంతో కుదుటపడింది.
గుంటూరుకు చెందిన 65 ఏళ్ల ఇబ్రహీం కూడా జ్వరంతో పాటు ఆక్సిజన్ తగ్గి ఆయాసంతో హాస్పిటల్ కి రాగా వెంటనే ఐసీయూలో అడ్మిన్ చేసుకోగా.. సిటీ స్కాన్ చేసి కడుపులో గడ్డలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారట. ఇక కడుపులో గడ్డలు అంటే మొదట డాక్టర్లకి క్యాన్సర్ అని అనుమానం రావడంతో అందులో కొంత భాగం తీసి టెస్ట్ చేయగా బ్లడ్ కల్చర్ పరీక్షలు చేస్తే మెలియాయిడోసిస్ అని తేలింది. దీంతో ఈ కొత్త రకం జ్వరం ఏంటి అని చాలామంది జనాలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే చాలామంది మామూలు జ్వరాలే కదా అని సిరప్ లు,ఇంజక్షన్లు,టాబ్లెట్ వేసుకుంటూ ఉంటున్నారని, కానీ ఈ జ్వరం తీవ్రత ఎక్కువ రోజులు ఉంటే గనుక కచ్చితంగా హాస్పిటల్ కి వచ్చి టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే రీసెంట్ గా గుంటూరులోని ఓ నలుగురు జ్వరంతో చాలా రోజులు బాధపడి చివరికి హాస్పిటల్ కి వచ్చి టెస్టులు చేయించుకోగా మెలియాయిడోసిస్ అని బయటపడిందని డాక్టర్లు చెప్పారు.అయితే ఇది మామూలు జ్వరమే అని వదిలేస్తే మాత్రం అది శరీరంలోని అవయవాల అన్నింటికీ వ్యాపించి చివరికి అవయవాలన్నీ పనిచేయకుండా చేసి చివరికి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా తీసుకు వస్తుంది అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ మెలియాయిడోసిస్ అనే జ్వరాన్ని ముందే గుర్తిస్తే యాంటీబయోటిక్స్ తో తొందరగానే నయం చేయవచ్చట. కానీ ఏం కాదులే అని చూసుకుంటూ పోతే మాత్రం కచ్చితంగా అది అవయవాల మీద ఎఫెక్ట్ చూపించి ప్రాణం పోయే స్థితికి తీసుకువస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
