Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌లోకి మాజీ మ‌హిళా మంత్రి.. నిజ‌మేనా..!

ఇలాంటి వారిలో ఉమ్మ‌డి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మ‌హిళా మంత్రి ఒక‌రు జ‌న‌సేన వైపు చూస్తు న్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

By:  Garuda Media   |   16 Jan 2026 11:00 AM IST
జ‌న‌సేన‌లోకి మాజీ మ‌హిళా మంత్రి.. నిజ‌మేనా..!
X

వైసీపీ నుంచి కొంద‌రు నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారనే వార్త‌లు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయొచ్చు. కానీ, పార్టీ అధినేత మైండ్ సెట్టే బాగోన‌ప్పుడు.. ఆయ‌న ఇంకా.. పార్టీలో ఏం జ‌రుగుతోందో కూడా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌న‌ప్పుడు.. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో లేన‌ప్పుడు.. ఇక‌, పార్టీలో ఉండి ప్ర‌యోజ‌నం ఏంట‌ని భావిస్తున్న‌వారు... పెరుగుతున్నారు. దీంతో జంపింగుల‌కు ముహూర్తాలు చూస్తున్నారు.

ఇలాంటి వారిలో ఉమ్మ‌డి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మ‌హిళా మంత్రి ఒక‌రు జ‌న‌సేన వైపు చూస్తు న్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈమె.. గ‌తంలో జ‌గ‌న్ హ‌యాంలో రెండున్న‌రేళ్ల‌పాటు మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత‌.. మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డంతో నొచ్చు కున్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గం మార్పుతో ఆమె ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, అప్ప‌టి నుం చి కూడా పార్టీలో అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక‌, పార్టీ నుంచి కూడా ఆమెకు సరైన మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీలో ఉండి ప్ర యోజ‌నం లేద‌ని భావిస్తున్న‌ట్టు త‌ర‌చుగా ఆమె పై స్థానిక ప‌త్రిక‌ల్లోనూ, మీడియాలో కూడా క‌థ‌నాలు వ‌స్తు న్నాయి. తాజాగా ఇదే విష‌యంపై ఓ కీల‌క ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం మేర‌కు.. ఆమె జ‌న‌సేన వైపు చూస్తు న్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో స‌ద‌రు ఎమ్మెల్యే నిత్యం వార్త‌ల్లో ఉంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. ఈ సీటును జ‌న‌సేన కోరే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతున్న నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కురాలు..పార్టీ మారే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. జ‌న‌సేన కూడా ఈమెకు అవ‌కాశం క‌ల్పించేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో త్వ‌ర‌లోనే ఆమె చేరికకు పార్టీ అవ‌కాశం క‌ల్పించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ మ‌రో నేత‌ను ఎంపిక చేయాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు.