Begin typing your search above and press return to search.

ఇడ్లీ దోశ ఏం పాపం చేశాయ్ స్వామి !

ఇలా ఎందుకు చేశారని నెటిజన్లలో ఇపుడు ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సౌత్ నార్త్ అని విభజించి ఈ విధంగా చేస్తున్నారా అని గుస్సా అవుతున్నారు.

By:  Satya P   |   20 Sept 2025 11:02 PM IST
ఇడ్లీ దోశ ఏం పాపం చేశాయ్ స్వామి !
X

ఎవరైనా టిఫిన్ అంటే తమకు నచ్చిన వాటిని ఆర్డర్ ఇస్తారు. ఇక ఆహారపు అలవాట్లు కూడా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఇందులో కూడా కొంత తేడా స్పష్టంగా ఉంది. ఉత్తరాది దక్షిణాది అని కూడా విభజించేవారు ఉంటారు. అయితే అది వారి సొంత పైత్యం అని సరిపెట్టుకున్నా ఇపుడు ఏకంగా రెండవ తరం జీఎస్టీ పన్నులలో స్లాబుల తగ్గింపులో కూడా ఈ వివక్ష ఉందా అనిపించేలా నిర్ణయం తీసుకున్నారా అని చర్చించుకుంటున్నారు.

పరోటా చపాతికి రాయితీనా :

ఇపుడు దక్షిణాది వారి మీద వివక్ష అనడానికి జీఎస్టీ పన్నులు కారణం అవుతున్నాయని అంటున్నారు. తాజాగా జీఎస్టీ పన్నుల తగ్గింపులో చపతీ పరోటాల మీద ఉన్న 18 శాతం పన్నుని ఏకంగా సున్నాకు తగ్గినిన కేంద్ర ప్రభుత్వం ఇడ్లీ దోశల మీద మాత్రం అయిదు శాతం స్లాబ్ ని అలాగే యధా విధిగా కొనసాగించడం మీద ఇడ్లీ దోశ ప్రియులతో పాటు వివక్షను సహించలేని వారు అంతా తీవ్రంగా మండిపడుతున్నారు.

సౌత్ ఫుడ్ అనేనా :

ఇలా ఎందుకు చేశారని నెటిజన్లలో ఇపుడు ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సౌత్ నార్త్ అని విభజించి ఈ విధంగా చేస్తున్నారా అని గుస్సా అవుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది వారు ఎక్కువగా చపతీ పరోటా తింటారు కాబట్టి వారు తినే టిఫిన్ల మీద అలా తగ్గించి దక్షిణాది వారి అల్పాహారంగా ఉన్న ఎక్కువ మంది తినే ఇడ్లీ దోశల మీద ఈ విధంగా డిసైడ్ చేస్తారా ఇది తగునా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఇదేనా విధానం :

దేశమంతా వర్తించే జీఎస్టీ పన్నుల విషయంలో అంతా ఒకే రూల్ ఉండాలని గుర్తు చేస్తున్నారు. అల్పాహారాల మీద స్లాబ్ పూర్తిగా ఎత్తివేశామని అంటే అది అన్నింటికీ వర్తించాలి కదా అని అంటున్నారు. అలా కాకుండా కేవలం ఇడ్లీ దోశ మీద మాత్రం ఈ భావం మోపడం వల్ల ప్రాంతీయ వివక్షకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు.

రాజకీయ మంటగా :

కడుపులోని ఆకలి మంటను తగ్గించేది అల్పాహారం. పొద్దు పొద్దున్నే టిఫిన్ తిని అంతా రిలాక్స్ అవుతారు. అలాంటి వాటి మీద పన్నుల బాదుడు బాదితే అది కూడా ఒక ప్రాంతానికి ఒక న్యాయం మరో ప్రాంతానికి మరో న్యాయం చేయడం వల్ల రాజకీయ మంట పెట్టినట్లు అవుతుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇడ్లీ తమిళనాడు వారి ప్రధాన అల్పాహారం. ఇప్పటికే దక్షిణాది ఉత్తరాది అని అక్కడే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూంటారు. ఈ రకమైన చర్య వారిని మరింత రెచ్చగొట్టేలా ఉంటుందని కూడా అంటున్నారు. అందువల్ల ఈ విషయంలో పొరపాటుని సరిదిద్దుకుంటే మేలు అని అంటున్నారు. ఇక జీఎస్టీ భేష్ శభాష్ అని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన క్రమంలో ఆ కూటమి ఎమ్మెల్యే సీనియర్ నేత రామకృష్ణ దీనిని ప్రస్తావించడం విశేషం. మరి ఈ విషయంలో ఏపీలో కూటమి పాలకులు కూడా కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకునేలా చేయాలని అంటున్నారు.