జీఎస్టీ 2.0: తగ్గిన ధరలు..అన్నీ తగ్గాయి.. కొన్ని మాత్రం భారీగా పెరిగాయి
అయితే, కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0లో రెండు విభిన్న కోణాలు ఉన్నాయి.
By: A.N.Kumar | 22 Sept 2025 7:00 PM ISTదేశంలో వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో భారీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆదివారం (సెప్టెంబర్ 21) అర్ధరాత్రి నుంచి అమలులోకి ప్రవేశించింది. దీన్ని దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జాతిని ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో జీఎస్టీని తాము ప్రవేశపెట్టామని, ఇప్పుడు కూడా ప్రజల భారం తగ్గించాలనే సంకల్పంతో మార్పులు చేపట్టామని తెలిపారు.
అయితే, కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0లో రెండు విభిన్న కోణాలు ఉన్నాయి. కొన్నింటి ధరలు తగ్గబోతున్నప్పటికీ, మరోవైపు నిత్యావసర సరకులే కాకుండా చాలా వస్తువుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి.
పాత జీఎస్టీ వ్యవస్థ
గతంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం జీఎస్టీని మూడే శ్లాబులతో రూపొందించింది – 5%, 12%, 14%.
తర్వాత మోడీ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత శ్లాబులు మార్చి 5%, 14%, 18%, 24% గా అమలు చేసింది.
* కొత్త జీఎస్టీ శ్లాబులు
ఇప్పుడు అమల్లోకి వచ్చిన కొత్త మార్పుల్లో
5% శ్లాబు కొనసాగుతుంది. 12% శ్లాబు రద్దు చేసి, దానిని 18%తో భర్తీ చేశారు. కొత్తగా ఒక 40% భారీ శ్లాబును ప్రవేశపెట్టారు.
* ధరలు పెరగబోయే సరుకులు
40% శ్లాబులో చేర్చిన వస్తువులు సాధారణ ప్రజలకు పెద్ద భారంగా మారబోతున్నాయి. ముఖ్యంగా
సుగంధ ద్రవ్యాలు: దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, గసగసాలు, లవంగాలు, ఇంగువ, జీలకర్ర మొదలైనవి.
తంబాకు ఉత్పత్తులు: సిగరెట్లు, చుట్టలు, గుట్కా, వక్కపలుకులు.
మద్యం & మత్తు పానీయాలు.
బ్యూటీ ఉత్పత్తులు: సెంట్లు, అత్తర్లు, మహిళల అలంకార వస్తువులు.
ఇవి ఇంతవరకు 24% పన్నులో ఉండగా, ఇప్పుడు 40% పన్ను కిందకు వచ్చాయి. ఫలితంగా ఈ సరుకుల ధరలు గణనీయంగా పెరుగుతాయి.
* తగ్గబోయే ధరలు
12% శ్లాబును తొలగించడంతో కొన్ని ఉత్పత్తుల ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. 5% లేదా 18% పన్నులోకి వచ్చే వస్తువులపై వినియోగదారులకు కొంత ఊరట దక్కుతుంది.
మొత్తం చూస్తే జీఎస్టీ 2.0లో ఒకవైపు కొన్నింటి ధరలు తగ్గినా, మరోవైపు మన రోజువారీ జీవితంలో తప్పనిసరిగా ఉపయోగించే వస్తువులు ముఖ్యంగా మసాలాలు, బ్యూటీ ప్రోడక్ట్స్, తమాకు ఉత్పత్తులు మరింత వాచిపోనున్నాయి. అందువల్ల, ఈ సంస్కరణలు ప్రజలకు కొంత ఊరట ఇస్తూనే, పెద్ద భారం కూడా మోపుతున్నాయి అని చెప్పాలి.
