నాసిక్- సోలాపూర్ కారిడార్...ఏపీకి కేంద్రం వరం
ఎన్డీయే ప్రభుత్వం 2025 లో జరిపిన చివరి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By: Satya P | 1 Jan 2026 6:00 AM ISTఎన్డీయే ప్రభుత్వం 2025 లో జరిపిన చివరి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఒడిశాలోని జాతీయ రహదారి -326 విస్తరణ అలాగే బలోపేతం చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్టు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. దీని వల్ల గజపతి, రాయగడ కోరాపుట్ లలో ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని పర్యాటకం మరియు పరిశ్రమలను పెంచుతుందని, అలాగే గిరిజన ప్రాంతాలలో సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.
తెలంగాణాతో దగ్గరగా :
ఇదిలా ఉండగ మహారాష్ట్ర కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఆరు లేన్ల నాసిక్-సోలాపూర్-అక్కల్‌కోట్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ ప్రధానమంత్రి గతిశక్తితో అనుసంధానించబడింది. ఈ ప్రాజెక్ట్ ఒక కీలక ఘట్టంగా మారనుంది. దీంతో ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అని చెబుతున్నారు ఏకంగా పశ్చిమం నుండి తూర్పు వైపుగా అతి పెద్ద కనెక్టివిటీని పెంచుతుంది. అలగే కీలక రాష్ట్రాల మధ్య రవాణాను మరింతగా బలోపేతం చేస్తుందని లాజిస్టిక్స్‌ను పెంచుతుందని కేంద్రం చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ లో ఏపీకి కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. ఇపుడు చూస్తే చెన్నై నుంచి తిరువల్లూరు, రేణిగుంట, కడప, కర్నూలు మీదుగా మహారాష్ట్ర సరిహద్దులలోని హసాపూర్ వరకు నాలుగు-లేన్ల కారిడార్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కేంద్రం తాజాగా ఆమోదించిన ఆరు-లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే తో ఏకంగా ఏపీ నుంచి తెలంగాణాకు ప్రయాణ సమయాన్ని పెద్ద ఎత్తున తగ్గిస్తుందని చెబుతున్నారు.
ఇదీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే :
కేంద్రం ఆమోదించిన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే మహారాష్ట్రలో 374 కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసలతో నిర్మాణం అవుతుంది. నాసిక్ -సోలాపూర్- అక్కల్కోట్ కారిడార్ నిర్మాణంగా ఇది సాగుతుంది. ఏకంగా 9,142 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో దీనిని ఆమోదించారు. దీనిని బీవోటీ విధానంలో చేపట్టనున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే తో నాసిక్, అహల్యనగర్, సోలాపూర్ వంటి ముఖ్యమైన నగరాలను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుతో కనెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
సగానికి సగం తగ్గుతుంది :
ఇక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే తో ఏపీ నుంచి తెలంగాణాకు ప్రయాణించే సమయం పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్ప్పటిదాకా ఉన్న 201 కిలోమీటర్లు సగానికి సగం అంటే ఏకంగా 17 గంటల వరకూ తగ్గుంది అన్న మాట. ఇక దీని వల్ల కోప్పర్తి, ఓర్వకల్ వంటి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి సైతం ఎంతగానో సహాయపడుతుంది అని అంటున్నారు. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు సాధారణ ప్రయాణం కూడా సాగిపోతుంది. వ్యాపార వాణిజ్యపరంగా కూడా ఏపీ అభివృద్ధి చెందేందుకు అవకాశాలు మెరుగు అవుతాయి. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే మీద గంటకు 100 కిలో మీటల వేగంతో వెళ్లేలా రూపకల్పన చేస్తున్నారు. ఏపీకి కేంద్రం ఈ విధంగా ఒక వరం ఇచ్చినట్లే అని అంతా భావిస్తున్నారు.
