Begin typing your search above and press return to search.

రాయలసీమ డిమాండ్ ఎందుకు..లెక్కలు ఇవే !

విభజన ఏపీలో మరో విభజనకు బాటలు పడుతున్నాయా అంటే అవును అనే అంటున్నారు. ప్రత్యేక రాయలసీమ నినాదం ఊపు అందుకుంటోంది.

By:  Satya P   |   12 Aug 2025 5:00 AM IST
రాయలసీమ డిమాండ్ ఎందుకు..లెక్కలు ఇవే !
X

విభజన ఏపీలో మరో విభజనకు బాటలు పడుతున్నాయా అంటే అవును అనే అంటున్నారు. ప్రత్యేక రాయలసీమ నినాదం ఊపు అందుకుంటోంది. అయితే ఈ ప్రత్యేక ఉద్యమాలు ఎపుడూ అసమానత్వం మీద వివక్ష మీదనే ఎక్కువగా పుడుతూంటాయి. అంతే కాదు తమ పట్ల ఫోకస్ పెట్టడం లేదని అనుమానించినపుడు వస్తూంటాయి. అంతకు మించి ఆత్మ గౌరవం కూడా ఇందులో అత్యంత కీలకమైన భావోద్వేగంగా ఇమిడి ఉంటుంది. ప్రత్యేక ఉద్య్హమాలు సక్సెస్ కావడానికి ఇదే మూలాధారం గా ఉంటుంది.

జీడీపీ డేటా ఇదేనట :

ఇదిలా ఉంటే తాజా 2022–23 ఆంధ్రప్రదేశ్ సామాజిక-ఆర్థిక సర్వే డేటాను ఉపయోగించి చూసినపుడు అనేక ఆసక్తికరమైన విషయాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. ప్రస్తుత జీడీపీ ఒక్కో జిల్లాలో ఏ విధంగా ఉందో కూడా ఒక అంచనా కూడా దొరుకుతుంది. అలా చూస్తే చిత్తూరు జిల్లా 94 వేల కోట్ల గా జీడీపీని కలిగి ఉంటే అనంతపురం 80 వేల కోట్ల గా ఉంది. కర్నూలు 75 వేల కోట్ల ఉంది. వైఎస్సార్ కడప చూస్తే 65 వేల కోట్ల గా ఉంది. ప్రకాశం 70 వేల కోట్ల గా ఉంది. నెల్లూరు 78 వేల కోట్ల గా ఉంది. ఈ లెక్కన గ్రేటర్ రాయలసీమ గా పిలుచుకునే ఈ ఆరు జిల్లాల మొత్తం జీడీపీ విలువ అక్షరాల 4 లక్షల 62 వేల కోట్ల గా అని తెలుస్తోంది. ఇక ఇదే యూఎస్డీ వద్ద లెక్క తేల్చి చూస్తే 56 బిలియన్లు గా ఉంది.

ఏపీ మొత్తం జీడీపీలో 40 శాతంగా :

మరో వైపు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం జీడీపీ దాదాపు 40 శాతంగా గ్రేటర్ రాయలసీమ కంట్రిబ్యూషన్ ఉంది అని లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక ఈ ప్రాంతాల జిల్లా వారీ ఆర్థిక బలాలు కచ్చితంగా ఇదే ప్రతిబింబిస్తున్నాయి. వ్యవసాయం, పరిశ్రమ, సేవలు వంటి రంగాలలో జీడీపీ ఈ విధంగా ఉంది అన్న మాట. అందువల్లనే గ్రేటర్ రాయలసీమ చాలా స్ట్రాంగ్ రీజియన్ అని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది అని చాట్ జీపీటీ చాలా నిక్కచ్చిగా చెబుతోంది అంటున్నారు.

ఏపీలో ఏడు జిల్లాల లెక్క ఇదే :

ఇక ఏపీలో కోస్తా జిల్లాలు ఉత్తరాంధ్ర దాకా తీసుకుంటే జీడీపీ డేటా ఏమిటి అన్నది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. గుంటూరు నుండి శ్రీకాకుళం దాకా చూస్తే కూడా చాట్ జీపీటీ దగ్గర పక్కగా లెక్కలు ఉన్నాయి. గుంటూరు ఒక లక్షా రెండు వేల వరకూ జీడీపీ ఉంది. క్రిష్ణ జిల్లా ఒక లక్షా 7 వేల కోట్ల దాకా ఉంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా 94 వేల కోట్ల దాకా ఉంటే తూర్పు గోదావరి ఒక లక్షా 5 వేల వేల కోట్ల దాకా ఉంది. ఇక విశాఖపట్నం ఒక లక్షా 42 వేల కోట్ల గా ఉంటే విజయనగరం జిల్లా 53 వేల కోట్ల గా ఉంది. శ్రీకాకుళం 59 వేల కోట్ల గా ఉంది. ఈ లెక్కల చూస్తే కోస్తాలోని ఏడు జిల్లాలలో మొత్తం జీడీపీ అంచనా 6 లక్షల 62 వేల కోట్ల దాకా ఉంది. ఇలా చూస్తే యూఎస్డీ 80 బిలియన్లుగా ఉంది.

క్లారిటీతోనే అంతా :

ఏపీలో ఏడు జిల్లాలు ఒక వైపు ఆరు జిల్లాలు మరో వైపు ఉమ్మడిగా ఉంటూ సాధించిన జీడీపీని తీసుకుంటే 40 శాతం రేషియో గ్రేటర్ రాయలసీమ రీజియన్ ది అని అర్ధం అవుతోంది. అదే సమయంలో ఏపీ బడ్జెట్ లో కానీ ఇతరత్రా కానీ కేటాయింపుల విషయంలోనూ ఇదే రేషియో కంటిన్యూ అవుతోందా అన్నది ఒక చర్చగా ఉంది. దాంతో పాటు సాగు నీరు, విద్య వంటి మౌలిక సదుపాయాల విషయంలో ఈ రోజుకీ సీమ ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని గణాంకాలు తెలియచేస్తున్నాయి. వెనకబాటుతనం సీమ జిల్లాలలో ఉందని స్పష్టం చేతున్నాయి. ఈ కారణంగానే ప్రాంతీయ ఉద్యమాలు ప్రత్యేక పోరాటాలకు అంకురార్పణ జరుగుతోంది అని అంటున్నారు. మరి చాట్ జీపీటీ అందించిన ఈ డేటా ఇపుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. గ్రేటర్ రాయలసీమ ఇష్యూని నేరుగా ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని సైతం సూచిస్తోంది.