ప్రేమలో గాసిప్స్ మంచివే.. కాలిఫోర్నియా యూనివర్సిటీ ఏం చెబుతోందంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో ఇతరుల వ్యక్తిగత విషయాలపై గాసిపింగ్ ఎక్కువగా పెరిగిపోతుంది.
By: Madhu Reddy | 10 Oct 2025 6:00 PM ISTగాసిప్స్.. గాసిప్స్.. గాసిప్స్.. అసలు గాసిప్స్ చెప్పనిదే.. విననిదే కొంతమందికి నిద్ర కూడా పట్టదు. సాధారణంగా భోజనం చేయకుండా ఒక పూటైనా గడిపేస్తారేమో కానీ గాసిప్స్ వినకుండా లేదా ఒకరిపై గాసిప్స్ క్రియేట్ చేయకుండా మాత్రం గడపలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇక సాధారణ మనుషుల విషయంలోనే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా ఈ గాసిప్స్ నిత్యం ఏదో ఒక రూపంలో వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు తమకు నచ్చిన వారితో ఒక ఫోటో షేర్ చేస్తే చాలు.. వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో కూడా తెలియకుండానే గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు.
ఇకపోతే ఇలా రోజురోజుకీ గాసిప్స్ చాప కింద నీరులా పాకి పోతుంటే కొంతమంది సెలబ్రిటీలు తట్టుకోలేక వీటిపై స్పందించి చెక్ పెడితే.. మరికొంతమంది సెలబ్రిటీలు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. ఇంకొన్ని గాసిప్స్ ఏకంగా రిలేషన్ లో గొడవలు పెడుతున్న విషయం తెలిసిందే. అంతే కాదండోయ్ ఈ గాసిప్స్ వల్ల ఏకంగా బంధాలు కూడా బ్రేకప్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో గాసిప్స్ మంచివే అంటూ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా జరిపిన ఒక రీసర్చ్ లో ముఖ్యంగా ప్రేమ జీవితంలో గాసిప్స్ మంచివేనట. మరి కాలిఫోర్నియా యూనివర్సిటీ చెప్పిన ఈ మాట వినక ఉన్న ఉద్దేశం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో ఇతరుల వ్యక్తిగత విషయాలపై గాసిపింగ్ ఎక్కువగా పెరిగిపోతుంది. అయితే ఇలా గాసిప్స్ చేయడం మంచిది కాదు అని ఎంతోమంది చెబుతున్నారు. కానీ కపుల్స్, లవర్స్ మధ్య రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ చిన్న గాసిప్స్ తోడ్పడుతాయి అని.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రీసర్చర్స్ తేల్చారు. వీటివల్ల ఎక్కువ సమయం కలిసి టైం స్పెండ్ చేస్తారని ఒకరికొకరు మరింత కనెక్ట్ అవుతారని కూడా వెల్లడించారు.
ఇకపోతే యూనివర్సిటీ రీసర్చర్స్ చెప్పిన మాట వింటే నిజమనే అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గజిబిజి లైఫ్ స్టైల్ లో చాలామంది మొబైల్ కి ఇస్తున్న ప్రాధాన్యత.. తమ భాగస్వాములకు ఇవ్వడం లేదు అనే వాదన ఎప్పటినుంచో వినిపిస్తోంది. దీనికి తోడు నిత్యం మొబైల్ లో గడపడం.. కుటుంబానికి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవడం.. అటు భార్యాభర్తలు లేదా లవర్స్ కలిసి ఒకరికొకరు సమయం కేటాయించకపోవడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని.. తద్వారా విడిపోతున్నారనే వార్తలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకే కాసేపు మొబైల్స్ పక్కన పెట్టి ఇలా చిన్న చిన్న గాసిప్స్ క్రియేట్ చేసుకుంటే వారి మధ్య బంధం బలపడుతుందని.. ఎక్కువ సమయం ఒకరికొకరు కలిసి మాట్లాడుకునే సమయం దొరుకుతుంది అని రీసర్చర్స్ తెలుపుతున్నారు.
