అమరావతిలో స్పోర్ట్స్ సిటీ... తొలి అడుగు పడింది!
ఏపీ రాజధాని అమరావతిలో అనేక నగరాలను నిర్మించనున్నారు. దీనిలో భాగంగా భవిష్యత్తులో స్పోర్ట్స్ సిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు.
By: Garuda Media | 5 Dec 2025 4:28 PM ISTఏపీ రాజధాని అమరావతిలో అనేక నగరాలను నిర్మించనున్నారు. దీనిలో భాగంగా భవిష్యత్తులో స్పోర్ట్స్ సిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి తాజాగా తొలి అడుగు పడింది. ప్రముఖ బ్యాడ్మింటన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ నేతృత్వంలో నిర్మించబోయే `బాడ్మింటన్ అకాడమీ`కి భూమి పూజ చేశారు. ఈ అకాడమీ నిర్మాణం మూడు సంవత్సరాల్లో పూర్తి కానుంది. అనంతరం.. స్థానిక యువతకు 10 శాతం కోటాను అమలు చేయనున్నారు.
ఇక, అమరావతి పరిధిలోని అబ్బరాజు పాలెంలో 12 ఎకరాల భూమిని గతంలో 2017లోనే ప్రభుత్వం కేటా యించింది. ఇది పూర్తిగా `ఫ్రీ హోల్డ్` పరిధిలో ఉంటుంది. ఇక, గత ఒప్పందం ప్రకారం.. అనుమతులు తీసుకున్న తర్వాత.. మూడేళ్లలోనే ఈ నిర్ణయం పూర్తి చేయడంతోపాటు.. అంతర్జాతీయ సౌకర్యాలను కూడా కల్పించాలి. అదేవిధంగా స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించాలి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫ్రీహోల్డ్ ప్రకారం.. 12 ఎకరాలను కేటాయించింది.
ఇక, తాజాగా జరిగిన భూమి పూజ అనంతరం.. గోపీచంద్ మాట్లాడుతూ.. రాష్ట్రం గర్వించే క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దీనిలో మొత్తంగా నాలుగు నిర్మాణాలు స్పష్టం చేశారు. ఇండోర్ కోర్టులు, శిక్షణ సదుపాయాలతో కూడిన మరో నిర్మాణం.. వసతి ఏర్పాట్లు కూడా ఈ భవనంలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ శిక్షణకు అమరావతి ప్రధాన కేంద్రంగా నిలుస్తుందన్నారు.
పూర్తి హక్కులు..
ఇక, అబ్బురాజు పాలెంలో ఇచ్చిన 12 ఎకరాలపై పూర్తి హక్కులు గోపీచంద్‌కే ఉండనున్నాయి. ఫ్రీహోల్డ్ కింద.. ఎకరాను 10 లక్షల రూపాయలకు విక్రయించారు. రిజిస్ట్రేషన్ చార్జీల్లోనూ ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. ఈ భూమిని గోపీ చంద్ అభివృద్ధి చేయడంతోపాటు.. ఎవరికైనా బదలాయించుకునే స్వేచ్ఛను కూడా ప్రభుత్వం కల్పించింది. దీనికి ప్రధాన కారణం.. తక్షణం ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీని నిర్మించి.. అభివృద్ధి చేయాలన్న లక్ష్యమే!. అయితే.. గత వైసీపీ హయాంలో పనులు ముందుకు సాగని నేపథ్యంలో తాజాగా భూమి పూజ నిర్వహించారు.
