వామ్మో 3.40కోట్ల గూగుల్ ఉద్యోగాన్నే వదులుకున్న అమ్మాయి.. ఈమె చెప్పిన కారణం వింటే?
అయితే ఓ పక్కన ఉద్యోగులంతా భయపడుతూ పనిచేస్తూ ఉంటే ఓ మహిళ మాత్రం ఓ సిల్లీ రీజన్ తో ఏడాదికి 3.40 కోట్ల రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలేసుకుంది.
By: Madhu Reddy | 12 Oct 2025 2:00 AM ISTఏఐ వచ్చినప్పటి నుండి చాలామందికి పని లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటూ చాలా గొప్పగా చెప్పుకున్నవాళ్లే. ఏఐ రావడంతో ఎప్పుడు కంపెనీ వాళ్ళు తమని తొలగిస్తారా అని భయందోళనల మధ్య బతుకుతున్నారు. 10 మంది చేసే పని.. ఇప్పుడు ఒక ఏఐ చేయడంతో అంతమందిని పెట్టుకొని వారికి సాలరీలు ఇచ్చే కంటే ఏఐ ద్వారా ఆ 10 మంది పనిని చేయించి ఎక్కువ లాభాలు సాధించవచ్చని చాలా కంపెనీల అధినేతలు కూడా ఎంతోమందిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. అలా ఏఐ రాకతో కోట్లాదిమంది ఉద్యోగులు.. బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితిలో ఉంటున్నారు.
అయితే ఓ పక్కన ఉద్యోగులంతా భయపడుతూ పనిచేస్తూ ఉంటే ఓ మహిళ మాత్రం ఓ సిల్లీ రీజన్ తో ఏడాదికి 3.40 కోట్ల రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలేసుకుంది. మరి ఇంతకీ ఆ మహిళ ఎవరు..? ఎందుకు అంత మంచి ఉద్యోగాన్ని వదిలేసుకుంది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్ లో పనిచేసే ఫ్లోరెన్స్ పొయిరెల్ అనే 37 ఏళ్ల మహిళ ప్రోగ్రాం మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసుకుంది. జూరిచ్ గూగుల్ లో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ గా పనిచేస్తున్న ఫ్లోరెన్స్ కేవలం ఒకే ఒక్క కారణంతో తన ఉద్యోగానికి రిజైన్ చేసింది.. ఇక జూరిచ్ గూగుల్లో ఫ్లోరెన్స్ దాదాపు 12 సంవత్సరాల నుండి వివిధ హోదాల్లో పనిచేస్తూ చాలా సీనియర్ అయింది. అలా గూగుల్ లో జాబ్ తోపాటు కోట్ల డబ్బులు శాలరీగా వస్తే ఎవరైనా వదులుకుంటారా..కానీ ఫ్లోరెన్స్ వదులుకుంది. గత కొద్ది రోజుల క్రితమే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.
అయితే ఈ రాజీనామాకి కారణం కూడా పెద్ద రీజన్ ఏమీ లేదు.తన కుటుంబంతో గడపడానికి సమయం ఉండడం లేదని తన జాబ్ కి ఫ్లోరెన్స్ రిజైన్ చేసింది..ఇదేంటి కుటుంబంతో గడపడానికి సమయం లేదని ఎవరైనా అంత పెద్ద జాబ్ ని వదులుకుంటారా అని అనుకోవచ్చు. కానీ ఫ్యామిలీని ఎక్కువగా మిస్ అయిన వారికి మాత్రం.. కుటుంబం విలువ ఏంటో తెలుస్తుంది. అలా ఫ్లోరెన్స్ కూడా ఇన్ని సంవత్సరాలుగా జాబ్ గొడవలో పడి లైఫ్ అదే అన్నట్టుగా మారిపోయిందట. అలా ఎక్కువ రోజులు ఆఫీసులో గడపడం వల్ల అదే ప్రపంచంగా మారిపోయిందని, ఇందువల్ల తన కుటుంబాన్ని బాగా మిస్ అయ్యానని, అందుకే జాబ్ వదిలేసుకున్నట్టు ఫ్లోరెన్స్ ఇంటర్వ్యూలో చెప్పింది.
అయితే ఫ్లోరెన్స్ మాత్రమే కాదు ఫ్లోరెన్స్ భర్త జాన్ కూడా అదే గూగుల్లో వర్క్ చేస్తున్నారట. అంతేకాదు ఇప్పుడు జాబ్ వదిలేయాలి అనే నిర్ణయం తీసుకోకపోతే రిటైర్మెంట్ అయ్యేవరకు నా కుటుంబంతో గడిపే ఛాన్స్ నాకు వచ్చేది కాదని,ఒక సగటు భార్యగా భర్తతో హ్యాపీగా గడపడం కోసం రిటైర్మెంట్ వరకు వెయిట్ చేయడం తన వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చింది. తన భర్త కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఆ జాబ్ మానేస్తాడని,జాబ్ మానేశాక ఇద్దరం కలిసి పలు దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలి అనేదే మా ప్లాన్ అంటూ చెప్పుకొచ్చింది. అలా కుటుంబంతో గడపడం కోసం కోట్ల రూపాయలు ఇచ్చే జాబ్ ని వదులుకుంది ఫ్లోరెన్స్. ఈ ఏడాది జనవరి వరకు ఫ్లోరెన్స్ ఉద్యోగం ద్వారా దాదాపు 12.6 కోట్ల రూపాయల్ని సంపాదించిందట. ఈ డబ్బులతో మిగిలిన జీవితాన్ని చాలా హ్యాపీగా గడుపుతాం అంటూ చెప్పుకొచ్చింది.
